ఆరోగ్యానికి 5,728 కోట్లు
Sakshi Education
- ఆరోగ్య శాఖకు రూ. 5,728 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 3,741 కోట్లకు పైగా నిధులు ప్రణాళికేతర వ్యయంలో చూపించారు. ప్రణాళికా వ్యయంలో కేవలం రూ. 1,986 కోట్లు.
- దేశవ్యాప్తంగా అపర సంజీవనిగా వెలుగొందిన 108 అంబులెన్సు పథకానికి రూ. 40 కోట్లు, మారుమూల గ్రామాల్లో మొబైల్ ఆస్పత్రులుగా పేరుగాంచిన 104 పథకానికి రూ. 31 కోట్లు మాత్రమే కేటాయించారు
- ఆరోగ్యశ్రీ (తాజాగా ఎన్టీఆర్ వైద్యసేవగా పేరు మార్చారు) పథకంలో జబ్బుల జాబితాను 938 నుంచి 1,038కి పెంచారు.
- ప్రీమియం రూ. 2 లక్షల నుంచి రూ. 2.5 లక్షలకు పెంచారు. దీంతో కనీసం రూ. 800 కోట్లు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ రూ. 500 కోట్లు మాత్రమే ఇచ్చారు.
- ఉద్యోగుల హెల్త్‌కార్డులకు సైతం రూ. 120 కోట్లు కేటాయించారు.
విభాగం | కేటాయింపులు (రూ. కోట్లలో) |
వైద్యవిద్యాశాఖ | 2,246 |
ప్రజారోగ్యానికి | 296.73 |
కుటుంబ సంక్షేమం | 1,451.26 |
108 సర్వీసులకు | 40.07 |
104 సర్వీసులకు | 31.62 |
ఎన్టీఆర్ వైద్యసేవ | 500 |
స్విమ్స్‌కు | 916 |
ఔషధ నియంత్రణ | 11.93 |
ఉద్యోగుల హెల్త్‌కార్డులు | 120 |
Published date : 14 Mar 2015 02:51PM