Skip to main content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019-20(ఓట్ ఆన్ అకౌంట్)

సంక్షేమం, సమతుల అభివృద్ధి, కనీస మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యాలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడం వల్లే రాష్ట్రం ప్రగతిబాట పట్టిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ఐదేళ్ల క్రితం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం అనేక సవాళ్లను అధిగమించి ప్రగతి బాట పట్టిందన్నారు.
2019 - 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2.26 లక్షల కోట్లతో, మొదటి నాలుగు నెలలకు సంబంధించి రూ. 76816.85 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 5న ఆయన శాసనసభకు సమర్పించారు. 2019- 20 ఆర్థిక సంవత్సరానికి రూ. 2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించామని, 2018- 19 కేటాయింపులతో పోల్చితే ఇది 18.38 శాతం ఎక్కువని వివరించారు. మరోవైపు శాసన మండలిలో మంత్రి పి.నారాయణ బడ్జెట్ ప్రసంగాన్ని చదివారు.
 
బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యాంశాలు...
  • రైతుల కోసం అన్నదాత సుఖీభవ అనే మరో పథకానికి రూ. 5,000 కోట్లు ప్రతిపాదన
  • కనీస మద్దతు ధరలు లేని సమయంలో రైతును ఆదుకునేందుకు విపణి ప్రమేయ నిధి రూ. 500 కోట్ల నుంచి రూ. 1,000 కోట్లకు పెంపు.
  • పశువుల బీమా కోసం బడ్జెట్‌లో రూ. 200 కోట్లు కేటాయింపు.
  • ముఖ్యమంత్రి యువనేస్తం కింద నిరుద్యోగ యువతకు ప్రస్తుతం నెలకు రూ. 1000 చొప్పున ఇస్తున్న నిరుద్యోగ భృతి రూ. 2000కి పెంపు. ఈ పథకం కింద 4.3 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు ప్రకటన.
  • వెనుకబడిన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు రూ. 3,000 కోట్లు. జనాభా దామాషా ప్రకారం కార్పొరేషన్లకు నిధుల పంపిణీ.
  • అంబేడ్కర్ విదేశీ విద్య పథకం కింద ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి మంజూరు చేసే స్కాలర్‌షిప్ రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు.
  • ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 2019 - 20 కేటాయింపులు 28 శాతం పెంచి రూ. 14,367 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటన.
  • ఎస్టీ సబ్‌ప్లాన్ 33 శాతం పెంచి రూ. 16,226 కోట్లు కేటాయింపు ప్రతిపాదన.
  • ఆరోగ్య శాఖ బడ్జెట్ రూ. 8,463 కోట్ల నుంచి రూ. 10,032 కోట్లకు పెంపు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి కేటాయింపులు రూ. 1,000 కోట్ల నుంచి రూ. 1,200 కోట్లకు పెంపు.
  • పేదలకు గృహ నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు రూ.500 కోట్లు.
  • చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలకు రూ.400 కోట్లు.
ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంక్షిప్తంగా..

అంశం

(అంకెలు రూ. కోట్లలో)

మొత్తం బడ్జెట్ 2,26,177.53
రెవెన్యూ వ్యయం 1,80,369.32
కేపిటల్ వ్యయం 29,596.53
రెవెన్యూ ఆదాయం 1,78,269.85
కేంద్ర పన్నుల్లో వాటా 36,360.26
కేంద్ర గ్రాంట్లు 60,721.51
రెవెన్యూ మిగులు 2,099.46
ద్రవ్యలోటు 32,390.67
ఏప్రిల్ నుంచి జూలై వరకూ వ్యయం 76,816.85

Budget 18-19
Budget 18-19

సంక్షేమ పథకాలు- కేటాయింపులు

అంశం

(అంకెలు రూ. కోట్లలో)

ఎస్సీ ఉప ప్రణాళిక 14,367.34
ఎస్టీ ఉప ప్రణాళిక 5,385.31
బీసీ ఉప ప్రణాళిక 16,226
బీసీ సంక్షేమ కార్పొరేషన్లు 3,000
కాపు సంక్షేమం 1,000
మైనారిటీ సంక్షేమం 1,309
ఈబీసీ సంక్షేమం 720
డ్రైవర్ల సంక్షేమం 150
బ్రాహ్మణ సంక్షేమం 100
వైశ్య సంక్షేమం 50
క్షత్రియ సంక్షేమం 50

కొత్త పథకాలు- కేటాయింపులు
రాష్ట్రంలో ఆరు కొత్త పథకాలను ప్రవేశపెడుతన్నట్లు ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పేర్కొంది. అవి.

పథకం

కేటాయించిన నిధులు (రూ. కోట్లలో)

అన్నదాత సుఖీభవ 5000
ఇళ్ల స్థలాలకు భూసేకరణ 500
ఎంఎస్‌ఈలకు ప్రోత్సాహకాలు 400
డ్రైవర్ల ప్రాదికార సంస్థ 150
పట్టణాల్లో మౌళిక సదుపాయాలు 100
క్షత్రియ సంక్షేమం 50

వివిధ శాఖలకు కేటాయింపులు
శాఖ కేటాయింపు (రూ. కోట్లలో)
వ్యవసాయ మార్కెటింగ్, సహకారం 12,732.97
పశుసంవర్థక 2,030.87
వెనుకబడిన వర్గాల సంక్షేమం 8,242.64
అటవీ, పర్యావరణం, సైన్స్... 491.93
ఉన్నత విద్య 3,171.63
ఇంధన, మౌలిక వసతులు 5,473.83
మాధ్యమిక విద్య 22,783.37
ఆహార, పౌరసరఫరాలు 3763.42
ఆర్థికశాఖ 51,841.69
సాధారణ పరిపాలన శాఖ 1,177.56
వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమం 10,032.15
హోంశాఖ 6,397.94
గృహనిర్మాణం 4,079.10
జలవనరులు 16,852.27
పరిశ్రమలు, వాణిజ్యం 4,114.92
ఇంఫర్మేషన్ టెక్నాలజీ... 1,006.81
కార్మిక, ఉపాధికల్పన 1,225.75
న్యాయశాఖ 918.81
లెజిస్లేచర్ 149.90
పురపాలక,పట్టణాభివృద్ది 7,979.34
మైనార్టీ సంక్షేమం 1,308.73
ప్రభుత్వరంగసంస్థలు 2.56
ప్రణాళిక 1,403.17
పంచాయతీరాజ్, ఆర్డీ 35,182.61
రెవెన్యూ 5,546.94
ఆర్టీజీఎస్ 172.12
స్కిల్‌డెవలప్‌మెంట్... 458.66
సాంఘిక సంక్షేమం 6,861.60
రోడ్లు, భవనాలు, రవాణా 5,382.83
మహిళా శిశుసంక్షేమం.... 3,408.66
క్రీడలు, యువజనసేవలు 1,982.74

ఆర్థికలోటు రూ.32,390.68 కోట్లు
ఆర్థిక మంత్రి యనమల 2019 -20 సంవత్సరానికి మొత్తం రూ.2,26,177.53 కోట్ల వ్యయం ప్రతిపాదించగా.. ఇందులో రూ.1,80,369.33 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.29,596.33 కోట్ల క్యాపిటల్ వ్యయం ఉంది. రూ.32,390.68 కోట్ల ఆర్థిక లోటు చూపించారు. 2018 -19 బడ్జెట్ అంచనాలతో పోల్చితే 2019 - 20 అంచనా మొత్తం రూ.18.38 కోట్ల పెరుగుదల చూపించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రెవెన్యూ వ్యయం 20.03 శాతం, క్యాపిటల్ వ్యయం 20.03 శాతం పెరగనుంది. రెవెన్యూ మిగులు రూ.2,099.47 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆర్థిక లోటు 3.03 శాతం, రెవెన్యూ మిగులు రూ.0.20 శాతం ఉంటుందని అంచనా వేశారు.

రాష్ట్ర అప్పులు
2017-18 నాటికి రాష్ట్ర అప్పులు రూ.2.59 లక్షల కోట్లకు చేరుకున్నాయని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. 2018-19 బడ్జెట్‌లో రూ.37,272 కోట్లు అప్పు చేశారు. తాజా బడ్జెట్‌లో రూ.45,078.73 కోట్లను రుణంగా తీసుకోవాలని ప్రతిపాదించారు. దాంతో అప్పుల భారం మొత్తం రూ.3.41 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా.

రాష్ట్ర అప్పులు తీరు ఇదీ..

ఆర్థిక సంవత్సరం

మొత్తం అప్పు (రూ.కోట్లలో)

రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పుల శాతం

2014-15

1,48,743.45

28.25

2015-16

1,73,853.60

28.50

2016-17

2,01,314.04

28.79

2017-18

2,59,000.00

28.80

2018-19(అంచనా)

2,96,000

28.99

2019-20(అంచనా)

3,41,000

29.12

Budget 18-19
Budget 18-19

శాఖలు, ముఖ్య పథకాలకు కేటాయింపులు
సాంఘిక సంక్షేమానికి రూ. 6861కోట్లు
Budget 18-19 పభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో సాంఘిక సంక్షేమానికి ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ.6,861.60 కోట్లు కేటాయించింది.చర్మకారుల జీవనోపాధికి, లిడ్‌క్యాప్‌కు, డప్పు కళాకారుల పెన్షన్‌కు ప్రత్యేకంగా కేటాయించారు. ఎస్సీ కాంపొనెంట్ కింద రూ.14,367.34 కోట్లు ఖర్చు చేస్తారు.

గిరిజన సంక్షేమానికి రూ.2,309.73 కోట్లు
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.2,309.73 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని ఎస్టీ రెసిడెన్షియల్ స్కూళ్ల భవన నిర్మాణాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు మెయింటెనెన్స్, ఎస్టీ కార్పొరేషన్ ద్వారా రుణసాయం, గిరిజనులకు పౌష్టికాహారం పంపిణీ, ఐటీడీఏల్లో మార్కెటింగ్ స్టోరేజ్, తదితర మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేస్తామని ప్రకటించింది.

మైనార్టీలకు రూ.1,308.73 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి 2019-20 సంవత్సరానికి రూ.1,308.73 కోట్లు కేటాయించారు. మైనార్టీల విదేశీ విద్య, దుల్హన్, ఇమామ్‌లు, మౌజన్లకు ప్రోత్సాహకాలు, బ్యాంకుల రుణాలతో ఆదాయ వనరులు చేకూర్చే పథకాలకు, క్రిస్టియన్ మైనార్టీలకు ఈ నిధులు ఖర్చు చేస్తారు.

వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌లకు 3000 కోట్లు
2019-20 బడ్జెట్‌లో అన్ని రకాల వెనుకబడిన తరగతుల కార్పొరేషన్‌లకు రూ.3000 కోట్లను ప్రభత్వం కేటాయించింది. 2018-19 బడ్జెట్‌లో రూ.1,337.81 కోట్లు కేటాయించింది. గతేడాది దాకా 11 బీసీ ఫెడరేషన్‌లు ఉన్నారుు. ఇప్పుడు ఈ ఫెడరేషన్‌లను కార్పొరేషన్‌లుగా మార్చారు. రాష్ట్రంలో బీసీ, ఈబీసీ వర్గాలకు సంబంధించి మొత్తం 32 కార్పొరేషన్‌లు ఉన్నారుు. ఈ బడ్జెట్‌లో కేటాయించిన రూ.3,000 కోట్లను ఈ 32 కార్పొరేషన్‌లు పంచుకోవాల్సి ఉంటుంది.

పౌరసరఫరాల శాఖకు రూ. 3,763.42 కోట్లు
పౌరసరఫరాల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,763.42 కోట్లు కేటాయించింది.2018-19లో రూ. 3,495.39 కోట్లుకేటాయించారు.

అమరావతి నిర్మాణానికి రూ. 1.09 లక్షల కోట్లు ఖర్చు
అమరావతి నిర్మాణానికి రూ. 1,09,023 కోట్లు అవుతుందని అంచనా వేయగా మొదటి దశలో రూ. 39,875 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయని ఆర్థికమంత్రి యనమల చెప్పారు.
బీసీల సంక్షేమానికి రూ.6,213.16 కోట్లు
2019-20 బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.6,213.16 కోట్లు కేటాయిస్తున్నట్లు యనమల ప్రకటించారు.

సంవత్సరం

కేటాయింపు

ఖర్చు

2014-15

3,129.00

3,122.00

2015-16

3,231.00

2,720.00

2016-17

4,430.00

3,045.00

2017-18

5,013.50

4,783.22

2018-19

6,213.16

-


మహిళా సంక్షేమానికి రూ.3,408 కోట్లు
తాజా ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మహిళలు, శిశు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్, వయోవృద్ధుల సంక్షేమానికి రూ.3,408.66 కోట్లు కేటాయించింది. పిల్లలు, తల్లుల ప్రత్యేక పోషకాహార పథకం, ఐసీడీఎస్ ప్రాజెక్టులు, కౌమార దశ బాలికల జీవన విధానం పెంపుదల పథకాలకోసం ఈ మొత్తాన్ని ఖర్చుచేస్తారు. బాలికలకు శానిటరీ నాప్‌కిన్లు, దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమం, దివ్యాంగుల సంక్షేమం, ట్రాన్స్జెండర్లు గౌరవప్రదమైన జీవితం సాగించడానికి ఈ నిధులు ఖర్చుచేస్తారు. కేటాయింపుల వివరాలిలా ఉన్నారుు..

కేటాయింపులు-ఖర్చు (రూ. కోట్లలో)

సంవత్సరం

కేటాయింపు

ఖర్చు

2014-15

1,130.00

1,126.00

2015-16

1,137.00

1,403.00

2016-17

1,331.00

1,208.00

2017-18

1,773.05

2,497.98

2018-19

3,007.96

-

2019-20

3,408.66

-


కార్మిక సంక్షేమానికి రూ.1,225 కోట్లు..
కార్మిక సంక్షేమానికి 2019-20 బడ్జెట్‌లో రూ.1,225.75 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో చంద్రన్న బీమాకు రూ.354.02 కోట్లు కేటాయించారు.

మైనార్టీలకు...
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం 2019-20 సంవత్సరానికి రూ.1,304.43 కోట్లు కేటాయించింది. 2018-19 సంవత్సరానికి రూ.1,100.14 కోట్లు కేటాయించినట్లు ప్రభత్వం పేర్కొంది.

మానవవనరుల అభివృద్ధి శాఖ...
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మానవవనరుల అభివృద్ధి శాఖకు కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.25,955 కోట్లు ఉన్నత విద్య, సెకండరీ విద్యకు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఉన్నత విద్యకు 3171.63 కోట్లు, సెకండరీ విద్యకు 22,783.37 కోట్లుగా కేటాయింపులు చేశారు. గత ఏడాదికన్నా ఉన్నత విద్యకు 11.88 శాతం, సెకండరీ విద్యకు 5.42 శాతం పెంచారు.

బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు

ఏడాది

మొత్తం బడ్జెట్ (రూ.కోట్లలో)

కేటాయింపు (రూ.కోట్లలో)

శాతం

2014-15

1,11,823.86

14,860.94

13.28

2015-16

1,13,048.98

17,729.02

15.68

2016-17

1,35,688.99

19,428.86

14.31

2017-18

1,56,999.40

20,358.78

12.96

2018-19

1,91,063.60

24,098.74

12.61

2019-20

2,26,177.53

25,955.00

11.47


పట్టణాభివృద్ధికి రూ.7,979.34 కోట్లు
రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో రూ.7,979.34 కోట్లను కేటారుుస్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. గతేడాదితో పోల్చితే ఈ కేటాయింపులు 3.08 శాతమే అధికం. ఇందులో రెవెన్యూ వ్యయం కింద రూ.6,990.04 కోట్లను, పెట్టుబడి వ్యయం కింద రూ.989.29 కోట్లను కేటాయించారు. ఈ నాలుగు నెలల కాలానికి రూ.2,659.78 కోట్లను కేటాయించారు.

పరిశ్రమలకు రూ. 4,114.92 కోట్లు
ఉపాధి కల్పనలో కీలకమైన పరిశ్రమల రంగానికి 2019-20 బడ్జెట్ కేటాయింపుల్లో ప్రభుత్వం రూ. 4,114.92 కోట్లను కేటాయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేటాయింపులతో పోలిస్తే వచ్చే ఏడాదికి 35 శాతం తగ్గిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిపాదనలు చేశారు. 2018-19లో రూ. 6,290.29 కోట్లు కేటాయించింది.

సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,852.27 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు 2019-20 బడ్జెట్లో రూ.16,852.27 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రూ.15,558.90 కోట్లు పెట్టుబడి వ్యయం కాగా రూ.1293.37 కోట్లు రెవెన్యూ వ్యయం. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడంతో జూలై వరకు ఇందులో రూ.5,621.80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న ప్రాజెక్టులతోపాటు కొత్తగా రూ.17,061 కోట్లతో ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

వ్యవసాయానికి రూ.12,732 కోట్లు
Budget 18-192019-20 బడ్జెట్‌లో రూ.12,732 కోట్లు వ్యవసాయానికి కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఇందులో అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి రూ.5 వేల కోట్లు కేటాయించారు. వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.7,732 కోట్లు కేటాయించారు. వ్యవసాయ యాంత్రీకరణకు రూ.310.17 కోట్లుగా ప్రకటించారు. పశు సంవర్థక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖలకు రూ.2030.87 కోట్లుగా ప్రతిపాదించారు. గత ఏడాది(2018-19) వ్యవసాయ బడ్జెట్‌లో రూ.7,607.49 కోట్లు కేటాయించారు.

వ్యవసాయ బడ్జెట్‌లో ప్రతిపాదనలు
  • వ్యవసాయం, మార్కెటింగ్, సహకార రంగాలు రూ.12,732.97 కోట్లు
  • పాడి, పశు సంవర్థక, మత్స్య శాఖ రూ.2,030.87 కోట్లు
  • 2019-20కి అన్నదాత సుఖీభవ పథకం రూ.5,000 కోట్లు
  • వ్యవసాయ యాంత్రీకరణ రూ.300.17 కోట్లు
  • పశువుల బీమా రూ.200 కోట్లు
  • మత్స్యశాఖ కార్యకలాపాలకు రూ.100 కోట్లు
  • ఊరూరా పశుగ్రాసం పెంపునకు రూ.200 కోట్లు
  • ధరల స్థిరీకరణ నిధి రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంపు
  • ఉద్యాన శాఖ కార్యక్రమాల ప్రోత్సాహకానికి రూ.124 కోట్లు
ఇతర కేటాయింపులు
  • గృహ నిర్మాణానికి రూ.3,734.60 కోట్లు.
  • ఇన్‌ఫ్రా, ఐటీకి రూ. 5,473.83 కోట్లు.
  • పర్యాటక శాఖకు రూ.467 కోట్లు కేటాయింపు.
  • రాజధాని భూసమీకరణ రూ.226.27 కోట్లు.
  • వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 10,032 కోటు్ల.
  • ఆరోగ్యశ్రీకి రూ.1,200 కోట్లు.
  • ఇళ్ల స్థలాల భూసేకరణకు రూ.500 కోట్లు.
  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ)కు రూ.400 కోట్లు.
Published date : 06 Feb 2019 06:36PM

Photo Stories