ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2018-19
Sakshi Education
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆదాయ వనరులను కోల్పోయినా.. మూడు సంవత్సరాల కాలంలో సమస్యలకతీతంగా రాష్ట్రం సగటున 10.96 శాతం రెండంకెల వృద్ధిని సాధించిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ మేరకు 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1,91,063.61 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను మార్చి 8న అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2017 -18 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే బడ్జెట్ 21.70 శాతం పెరిగింది. రూ. 19,078 కోట్లతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
రాష్ట్ర బడ్జెట్ స్వరూపం (రూ. కోట్లలో)
ప్రధాన రెవెన్యూ వ్యయం - పెట్టుబడి వ్యయం వివరాలు
ప్రధాన రెవెన్యూ వ్యయం
Download AP Budget Documets
సంక్షేమ పథకాల వివరాలు
పెట్టుబడి వ్యయం
వ్యవసాయ బడ్జెట్ స్వరూపం
వ్యవసాయ శాఖల వారీగా కేటాయింపులు
రాష్ట్ర అప్పులు రూ.2,49,435 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు మొత్తం రూ.2,49,435.37 కోట్లకు చేరనున్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి తలసరి అప్పు రూ.43,205 ఉండగా ఇప్పుడు అది రూ.49,887లకు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో రూ.6,682 మేర తలసరి అప్పు పెరిగింది.
శాఖలు, ముఖ్య పథకాలకు కేటాయింపులు
నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
నిరుద్యోగ భృతి పథకానికి 2017-18 బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. 2018-19 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. అయితే... గతేడాది కేటాయింపుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం.
2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. దీని ప్రకారం అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది.
అమరావతికి రూ.678 కోట్లు
గతేడాది బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,429 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేవలం రూ.678 కోట్లు కేటాయించారు. రాజధానిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల విలువే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.
- మున్సిపల్ శాఖకు కేటాయింపు రూ. 7741 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు రూ. 16,978.22 కోట్లు
బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,978.22 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,620.76 కోట్లను మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులకు, రూ.905.05 కోట్లను ఏపీఎస్‌ఐడీసీకి(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ), రూ.452.41 కోట్లను చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించారు. గత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,770 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 33 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ, ఇందులో పోలవరంతోపాటు పీఎంకేఎస్‌వై కింద ఏడు ప్రాజెక్టులకు కేంద్రం రూ.9,000 కోట్లకుపైగా ఇస్తుందని బడ్జెట్‌లో చూపారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రూ.7,978.22 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా అధిక శాతం ఏపీడబ్ల్యూఆర్‌డీసీ(ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా రుణంగా సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం రూ.9,000 కోట్లు ఇస్తుందని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, కేంద్రం ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.8,829.39 కోట్లు
రాష్ట్రానికి వరప్రదాయని లాంటి పోలవరం ప్రాజెక్టుకి 2018-19 బడ్జెట్‌లో రూ.8,829.39 కోట్లు కేటాయించారు. అయితే ఇవి కూడా కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో కేటాయింపులు చేశారు. గతేడాది కూడా ఈ తరహాలోనే రూ.6,889 కోట్లు కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,582.56 కోట్లే వచ్చాయి.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.19,070.36 కోట్లు
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొంటు.. ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2017-18లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.18,214 కోట్లు కేటాయించగా.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.19,070.36 కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తాము పని చేస్తున్నట్టు వివరించారు. ప్రతి కుటుంబానికి నెలకి కనీసం రూ.10 వేల ఆదాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు.
రూ.10 వేల ఆదాయం కింద ఏమేమీ పనులు చేస్తారంటే..
భూమిని అభివృద్ధి చేయడం, సారవంతం చేయడం, భూగర్భ జలాలను పెంచి పంటను కాపాడడం, సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడం, పంట మార్పిడి కింద పండ్ల తోటల పెంపకాన్ని విస్తరించడం, గ్రామీణ గిడ్డంగుల నిర్మాణం, చేలకు బాటలు వేయడం, వాటర్‌షెడ్‌ల నిర్మాణం వంటి పనులు చేపడతారు.
98,278 మంది కౌల్దార్లకే రుణాలు
రాష్ట్రంలో అధికారిక లెక్క ప్రకారమే 17 లక్షల మంది కౌలు రైతులుంటే 7.25 లక్షల మంది కౌల్దార్లకు రుణ అర్హత పత్రాలు ఇచ్చారు. సహకార బ్యాంకుల ద్వారా 98,278 మందికి గత డిసెంబర్ వరకు రూ.391.36 కోట్ల రుణాలు ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆక్వా హబ్‌గా మారుస్తామన్నారు.
3 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు రూ.700.12 కోట్లు
పకృతి సేద్యం...
2022 నాటికి 5 లక్షల హెక్టార్లలో 5 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికి 66,930 హెక్టార్లలో 1.63 లక్షల మంది వివిధ పంటలను ప్రకృతి సేద్యం ద్వారా చేస్తున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలలో పనులు చేయిస్తామన్నారు.
మహిళ, శిశు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.3,007.96 కోట్లు కేటాయించింది. పిల్లలు, తల్లుల ప్రత్యేక పోషకాహార పథకానికి రూ.383 కోట్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టులకు రూ.1,016 కోట్లు, కౌమార దశ బాలికల జీవన విధాన పెంపుదలకు రూ.60 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు విస్తరించారు.
గిరిజన సంక్షేమానికి రూ. 2,129 కోట్లు
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2,129.12 కోట్లు కేటాయించింది. ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణాలకు రూ. 250 కోట్లు కేటాయించింది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.670 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.260 కోట్లు, గిరిజన పౌష్టికాహారం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. ఐటీడీఏల్లో మార్కెటింగ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు ఇచ్చింది.
మైనార్టీలకు రూ. 1,101.90 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో నిధులు పెరిగాయి. ప్రస్తుత బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ. 1,101.90 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మైనార్టీ విదేశీ విద్యకు రూ. 30 కోట్లు కేటాయించారు. దుల్హన్ పథకానికి రూ.80 కోట్లు, ఇమామ్స్, మౌజన్స్కు ప్రోత్సాహకాల కోసం 75 కోట్ల రూపాయలు కేటాయించారు. బ్యాంకుల రుణాలతో ఆదాయ వనరులు చేకూర్చే పథకాలకు రూ. 150 కోట్లు కేటాయించగా, క్రిష్టియన్ మైనార్టీలకు 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
బీసీల సంక్షేమానికి రూ.4,477 కోట్లు
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గానూ రూ.4,477 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం కొత్తగా వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయించారు. మత్స్యకారుల పనిముట్లకు రూ.77 కోట్లు, 50 ఏళ్లు పైబడిన వారికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు.
కార్మిక సంక్షేమానికి రూ.814.83 కోట్లు
కార్మిక సంక్షేమానికి 2018-19 ఆర్థిక సంవత్స రానికి బడ్జెట్‌లో రూ.814.83 కోట్లు కేటాయించారు. ఇందులో చంద్రన్న బీమాకు రూ.140 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.350 కోట్లు తీసుకొని చంద్రన్న బీమాకు ప్రీమియం కట్టారు.
వైద్య ఆరోగ్యానికి రూ. 8,463 కోట్లు
ఈ ఏడాది ఆరోగ్య రంగానికి రూ.8,463కోట్లు కేటాయించారు. అంటే.. మొత్తం బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయించింది 4.42 శాతం. కాగా, కేటాయింపుల్లోని 70శాతం మొత్తం సిబ్బంది జీతాలకే పోతుంది. మిగిలిన 30 శాతంతోనే పథకాల నిర్వహణ ఆధారపడి ఉంది.
విద్యాశాఖకు రూ.24,185.75 కోట్లు
2018-19 బడ్జెట్‌లో విద్యా రంగానికి 24,185.75 కోట్లు కేటాయించారు. ఇందులో పాఠశాల విద్యకు రూ.21,612 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో 61,710 పాఠశాలలుండగా అందులో 16,688 ప్రైవేటు యాజమాన్యంలోనివి కాగా తక్కినవన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. అన్ని స్కూళ్లలో 72 లక్షల మంది విద్యార్థులుండగా అందులో 65 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. కాగా, ఉపాధ్యాయులు 1.80 లక్షల మంది వరకు ఉన్నారు.
- ఉన్నత విద్యాశాఖకు రూ.2,835 కోట్లు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,439 కోట్లు
రాష్ట్రప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.23,439 కోట్లను కేటాయించింది. ఇందులో పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా విభాగాలకు రూ.8,733.83 కోట్లు, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యక్రమాలకు రూ.14,705 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. గతేడాది బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.21,140 కోట్లు కేటాయించగా.. ఈసారి సుమారు మరో రూ.2వేల కోట్లకుపైగా కేటాయింపులు పెరిగాయి. అయితే ఈ శాఖకు కేటాయింపులు ఈ స్థాయిలో ఉండడానికి కేంద్రం నుంచి అందే సాయమే కారణం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువభాగం కేంద్రం నుంచే నిధులందుతాయని ప్రభుత్వం బడ్జెట్ గణాంకాల్లో పేర్కొంది. శాఖ పరిధిలోని వివిధ పథకాల అమలుకు కేంద్రం రూ.6,780 కోట్ల నిధుల్ని రాష్ట్రానికి అందజేస్తోందని తెలిపింది.
ఆర్‌అండ్‌బీకి రూ.4,703 కోట్లు
రవాణా, రహదారులు, భవనాల శాఖకు మొత్తం రూ.4,703 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.4,402 కోట్లు ఇవ్వగా, ఈ దఫా 16 శాతం అధికంగా మంజూరు చేశారు. రవాణా శాఖ పరిపాలనకు రూ.207.66 కోట్లు కేటాయించారు. ఇందులోనే రూ.10 కోట్లతో రహదారి భద్రత నిధి ఏర్పాటు చేశారు. మిగిలిన రూ.4,495.73 కోట్లను ఆర్ అండ్ బీకి కేటాయించారు. ఇందులోనే గ్రామీణ రహదారులకు రూ.వంద కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.341 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర రహదారులు, ఏపీఆర్‌డీసీ (ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ)కు రూ.250 కోట్లు ప్రతిపాదించారు.
ఇతర కేటాయింపులు
సాధ్యమైన ఆదాయ వనరులను మదింపు చేసి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రావాల్సిన అన్ని బకాయిలు అందుతాయనే ఆకాంక్షతో రెవెన్యూ మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు యనమల చెప్పారు. కేంద్రం నుంచి స్పందన కరువైనప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ను 2022 నాటికి దేశంలో ఉత్తమ రాష్ట్రంగా.. 2029 నాటికి ప్రపంచంలోనే ఉత్తమ రాష్ట్రంగా.. అంతిమంగా 2050 నాటికి ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే కేంద్రంగా రూపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు..
బడ్జెట్ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు..
- ‘బడికొస్తా’ కార్యక్రమం కింద ఎనిమిదో తరగతి విద్యార్థినులకు కూడా సైకిళ్ల పంపిణీ.
- మధ్యాహ్న భోజన పథకానికి డైట్ చార్జీల పెంపు. వారానికి మూడు కోడిగుడ్లకు బదులు అయిదు సరఫరా.
- పంటలకు సముచిత ధరలు కల్పించడం కోసం మార్కెట్ ఇంటర్వెన్‌షన్ ఫండ్ ఏర్పాటు యోచన.
- ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రుణమాఫీకి రూ.4100 కోట్లు.
- 10 లక్షల పశువులకు బీమా వర్తింపజేయడం కోసం రూ.50 కోట్లతో కొత్త పథకం.
- నిత్యావసర వస్తువుల ధరల స్థిరీకరణకు చర్యలు.. ఇందుకోసం పౌర సరఫరాల కార్పొరేషన్‌కు అదనపు కేటాయింపులు.
- సమతుల్య, సమానమైన, వికేంద్రీకృత, పారిశ్రామికాభివృద్ధి సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
- ఎలక్ట్రానిక్ క్లస్టర్ల ద్వారా రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు.
- ఎలాంటి సంఖ్యా పరిమితి లేకుండా దివ్యాంగులకు పింఛన్లు.
- స్వయం సహాయక సంఘాల మహిళలు, కౌమార బాలికలకు శానిటరీ నాప్‌కిన్ల సరఫరాకు రూ.వంద కోట్లు.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలివ్వాలని ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది.
- శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో మూత్రపిండాల బాధితులకు వైద్య సేవల కోసం 14 డయాలసిస్ యూనిట్ల ఏర్పాటు.
మొత్తం బడ్జెట్ | రూ. 1,96,064 కోట్లు |
రెవెన్యూ వ్యయం | రూ. 1,50,272 కోట్లు |
కేపిటల్ వ్యయం | రూ. 28,678 కోట్లు |
రెవెన్యూ రాబడి | రూ. 1,55,507 కోట్లు |
కేంద్ర పన్నుల వాటా | రూ. 33,930 కోట్లు |
కేంద్ర గ్రాంట్లు | రూ. 50,696 కోట్లు |
రెవెన్యూ మిగులు | రూ. 5,235 కోట్లు |
రాష్ట్ర బడ్జెట్ స్వరూపం (రూ. కోట్లలో)
రుణాల తిరిగి చెల్లింపు | 10,851 |
రాష్ట్ర సొంత పన్ను ఆదాయం | 65,535 |
సేల్స్ టాక్స్ | 38,448 |
మద్యం | 7,357 |
మోటారు వాహనాలు | 3,687 |
స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్ | 4,880 |
పన్నేతర ఆదాయం | 5,346 |
కేంద్ర పన్నుల వాటా | 33,930 |
కేంద్ర గ్రాంట్లు | 50,696 |
ద్రవ్య లోటు | 24,205 |
రాష్ట్ర స్థూల ఉత్పత్తి | 8,70,330 |
- రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ మిగులు | - 0.60% |
- రాష్ట్రస్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు | - 2.78% |
ప్రధాన రెవెన్యూ వ్యయం - పెట్టుబడి వ్యయం వివరాలు
ప్రధాన రెవెన్యూ వ్యయం
ఉద్యోగుల జీతాలు | రూ.39,121 కోట్లు |
పెన్షన్ల చెల్లింపు | రూ.15,427 కోట్లు |
వడ్డీల చెల్లింపు | రూ.15,076 కోట్లు |
వేతనేతర | రూ.7,387 కోట్లు |
నిర్వహణ | రూ.1,604 కోట్లు |
సబ్సిడీలు అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ | రూ.68,381 కోట్లు |
రైతుల రుణమాఫీ | రూ.4,100 కోట్లు |
విద్యుత్ సబ్సిడీ | రూ.2,500 కోట్లు |
బియ్యం సబ్సిడీ | రూ.3,140 కోట్లు |
Download AP Budget Documets
- Budget SpeechTelugu
- Budget Speech English
- Budget in Brief
- Agriculture Budget Estimates
- Annual Financial Statement
- Scheduled Castes Component
- ScheduledTribes Component
- Budget Estimates
సంక్షేమ పథకాల వివరాలు
ఎస్సీ ఉప ప్రణాళిక | రూ.11,228 కోట్లు |
ఎస్టీ ఉప ప్రణాళిక | రూ.4,177 కోట్లు |
బీసీ ఉప ప్రణాళిక | రూ.12,200 కోట్లు |
కాపు కమ్యునిటీ సంక్షేమం | రూ.1,000 కోట్లు |
ఈబీసీ సంక్షేమం | రూ.700 కోట్లు |
బ్రాహ్మణ కార్పొరేషన్ | రూ.75 కోట్లు |
మైనారిటీ సంక్షేమం | రూ.1,102 కోట్లు |
వైశ్య కమ్యునిటీ | రూ.30 కోట్లు |
పెట్టుబడి వ్యయం
సాధారణ సేవలకు పెట్టుబడి లెక్కలు | రూ.1,021.90 కోట్లు |
సాంఘిక సేవలకు పెట్టుబడి లెక్కలు | రూ.4,718.55 కోట్లు |
వ్యవసాయ అనుబంధ పెట్టుబడి | రూ.614.95 కోట్లు |
గ్రామీణ పెట్టుబడి లెక్కలు | రూ.1,560.15 కోట్లు |
సాగునీరు పెట్టుబడి లెక్కలు | రూ.15,915.31 కోట్లు |
ఇంధన పెట్టుబడి లెక్కలు | రూ.22.55 కోట్లు |
పరిశ్రమల, ఖనిజాల పెట్టుబడి | రూ.1,464.09 కోట్లు |
రవాణా పెట్టుబడి లెక్కలు | రూ.2,187.14 కోట్లు |
సాధారణ, ఆర్థికసర్వీసు పెట్టుబడి | రూ.1,173.82 కోట్లు |
వ్యవసాయ బడ్జెట్ స్వరూపం
వ్యవసాయ బడ్జెట్ | రూ.19,078 కోట్లు |
రెవెన్యూ వ్యయం | రూ.18,602 కోట్లు |
పెట్టుబడి వ్యయం | రూ.467.38 కోట్లు |
- నాలుగో విడత రుణ మాఫీకి | రూ.4,100 కోట్లు |
- ఉచిత విద్యుత్తుకు | రూ. 2,500 కోట్లు |
వ్యవసాయ శాఖల వారీగా కేటాయింపులు
వ్యవసాయ శాఖ | రూ.7,607.49 కోట్లు |
ఉద్యానశాఖ | రూ. 1,517.88 కోట్లు |
పశు సంవర్థక శాఖ | రూ. 1, 223.40 కోట్లు |
మత్స్యశాఖ | రూ. 386 కోట్లు |
గ్రామీణ ఉపాధి హామీ అనుసంధానం | రూ. 4,730 కోట్లు |
ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం | రూ. 395 కోట్లు |
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం | రూ. 130 కోట్లు |
ఉద్యాన విశ్వవిద్యాలయం | రూ. 175.12 కోట్లు |
పట్టు పరిశ్రమకు | రూ.175.12 కోట్లు |
పశు సంవర్ధక శాఖకు | రూ.1,223.40 కోట్లు |
మార్కెటింగ్ శాఖకు | రూ.11.83 కోట్లు |
సహకార రంగానికి | రూ.208.11 కోట్లు |
ఉచిత విద్యుత్ చెల్లింపులకు | రూ.2,500 కోట్లు |
సూక్ష్మపోషకాల సవరణకు | రూ.60 కోట్లు |
రుణమాఫీ కోసం | రూ.4,100 కోట్లు |
వేరుశనగ విత్తనాలకు | 90 శాతం రాయితీ |
మెగా సీడ్‌పార్క్‌కు | రూ.100 కోట్లు |
పావలా వడ్డి రుణాలకు | రూ.5.44 కోట్లు |
చంద్రన్న రైతు క్షేత్రాలకు | రూ.15 కోట్లు |
ప్రధాని ఫసల్ బీమా యోజన | రూ.485 కోట్లు |
రైతులకు వడ్డీ లేని రుణాలకు | రూ.172 కోట్లు |
రాష్ట్ర అప్పులు రూ.2,49,435 కోట్లు 2018-19 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు మొత్తం రూ.2,49,435.37 కోట్లకు చేరనున్నాయని బడ్జెట్‌లో ప్రభుత్వం పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటికి తలసరి అప్పు రూ.43,205 ఉండగా ఇప్పుడు అది రూ.49,887లకు చేరుకుంది. అంటే ఏడాది కాలంలో రూ.6,682 మేర తలసరి అప్పు పెరిగింది.
ఆర్థిక సంవత్సరం | మొత్తం అప్పు (కోట్లలో) | రాష్ట్రస్థూలఉత్పత్తిలో అప్పు శాతం |
2014-15 | 1,48,743.45 | 28.25 |
2015-16 | 1,73,853.60 | 28.50 |
2016-17 | 2,01,314.04 | 28.79 |
2017-18 సవరించిన అంచనా | 2,25,234.04 | 28.40 |
2018-19 అంచనా | 2,49,435,37 | 28.66 |
శాఖలు, ముఖ్య పథకాలకు కేటాయింపులు
నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
నిరుద్యోగ భృతి పథకానికి 2017-18 బడ్జెట్‌లో 500 కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం.. 2018-19 బడ్జెట్‌లో రూ.1000 కోట్లు కేటాయించింది. అయితే... గతేడాది కేటాయింపుల్లో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం గమనార్హం.
2016లో ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వేలో 35 సంవత్సరాల లోపు నిరుద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు సేకరించారు. దీని ప్రకారం అన్ని తరగతులకు సంబంధించి 33,70,315 మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎస్సీ నిరుద్యోగులు 6,11,309, ఎస్టీ నిరుద్యోగులు 1,38,328, బీసీ నిరుద్యోగులు 16,20,823, దివ్యాంగ నిరుద్యోగులు 11,683, ఇతరులు 9,88,172 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తయారు చేసింది.
అమరావతికి రూ.678 కోట్లు
గతేడాది బడ్జెట్‌లో రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.1,429 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది కేవలం రూ.678 కోట్లు కేటాయించారు. రాజధానిలో ప్రస్తుతం నడుస్తున్న ప్రాజెక్టుల విలువే రూ.30 వేల కోట్లు ఉన్నట్లు సీఆర్‌డీఏ వర్గాలు చెబుతున్నాయి.
- మున్సిపల్ శాఖకు కేటాయింపు రూ. 7741 కోట్లు
సాగునీటి ప్రాజెక్టులకు రూ. 16,978.22 కోట్లు
బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.16,978.22 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.15,620.76 కోట్లను మధ్య తరహా, భారీ సాగునీటి ప్రాజెక్టులకు, రూ.905.05 కోట్లను ఏపీఎస్‌ఐడీసీకి(ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ), రూ.452.41 కోట్లను చిన్న నీటిపారుదల రంగానికి కేటాయించారు. గత బడ్జెట్‌లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.12,770 కోట్లు కేటాయించగా, ప్రస్తుత బడ్జెట్‌లో 33 శాతం అధికంగా నిధులు ఇచ్చామని ప్రకటించారు. కానీ, ఇందులో పోలవరంతోపాటు పీఎంకేఎస్‌వై కింద ఏడు ప్రాజెక్టులకు కేంద్రం రూ.9,000 కోట్లకుపైగా ఇస్తుందని బడ్జెట్‌లో చూపారు. అంటే రాష్ట్ర ఖజానా నుంచి రూ.7,978.22 కోట్లు మాత్రమే కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇందులో కూడా అధిక శాతం ఏపీడబ్ల్యూఆర్‌డీసీ(ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థ) ద్వారా రుణంగా సేకరించాలని నిర్ణయించింది. కేంద్రం రూ.9,000 కోట్లు ఇస్తుందని రాష్ట్ర సర్కారు చెబుతున్నా, కేంద్రం ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు.
పోలవరం ప్రాజెక్టుకు రూ.8,829.39 కోట్లు
రాష్ట్రానికి వరప్రదాయని లాంటి పోలవరం ప్రాజెక్టుకి 2018-19 బడ్జెట్‌లో రూ.8,829.39 కోట్లు కేటాయించారు. అయితే ఇవి కూడా కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న అంచనాతో కేటాయింపులు చేశారు. గతేడాది కూడా ఈ తరహాలోనే రూ.6,889 కోట్లు కేటాయించగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.1,582.56 కోట్లే వచ్చాయి.
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.19,070.36 కోట్లు
2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని పేర్కొంటు.. ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2017-18లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.18,214 కోట్లు కేటాయించగా.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.19,070.36 కోట్లు కేటాయించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.18602.98 కోట్లు కాగా 467.38 కోట్లు పెట్టుబడి వ్యయం. రైతు సంక్షేమం, పంటల ఉత్పాదక పెంపే లక్ష్యంగా ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతుందని బడ్జెట్‌లో పేర్కొన్నారు. 2022 నాటికి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా తాము పని చేస్తున్నట్టు వివరించారు. ప్రతి కుటుంబానికి నెలకి కనీసం రూ.10 వేల ఆదాయం అందేలా చూస్తామని పేర్కొన్నారు.
రూ.10 వేల ఆదాయం కింద ఏమేమీ పనులు చేస్తారంటే..
భూమిని అభివృద్ధి చేయడం, సారవంతం చేయడం, భూగర్భ జలాలను పెంచి పంటను కాపాడడం, సేంద్రీయ ఎరువులను ప్రోత్సహించడం, పంట మార్పిడి కింద పండ్ల తోటల పెంపకాన్ని విస్తరించడం, గ్రామీణ గిడ్డంగుల నిర్మాణం, చేలకు బాటలు వేయడం, వాటర్‌షెడ్‌ల నిర్మాణం వంటి పనులు చేపడతారు.
98,278 మంది కౌల్దార్లకే రుణాలు
రాష్ట్రంలో అధికారిక లెక్క ప్రకారమే 17 లక్షల మంది కౌలు రైతులుంటే 7.25 లక్షల మంది కౌల్దార్లకు రుణ అర్హత పత్రాలు ఇచ్చారు. సహకార బ్యాంకుల ద్వారా 98,278 మందికి గత డిసెంబర్ వరకు రూ.391.36 కోట్ల రుణాలు ఇచ్చామని వ్యవసాయ మంత్రి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ ఆక్వా హబ్‌గా మారుస్తామన్నారు.
3 వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు రూ.700.12 కోట్లు
- ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.395 కోట్లు
- డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.175.12 కోట్లు.
- శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయానికి రూ.130 కోట్లు కేటాయించినట్టు తెలిపారు.
పకృతి సేద్యం...
2022 నాటికి 5 లక్షల హెక్టార్లలో 5 లక్షల మంది రైతులతో ప్రకృతి వ్యవసాయాన్ని చేయిస్తామని బడ్జెట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికి 66,930 హెక్టార్లలో 1.63 లక్షల మంది వివిధ పంటలను ప్రకృతి సేద్యం ద్వారా చేస్తున్నట్లు వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ అనుబంధ రంగాలలో పనులు చేయిస్తామన్నారు.
- మంచినీటి పథకాల నిర్వహణకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం రూ.172 కోట్లు.
మహిళ, శిశు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్, వయో వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఈ సంవత్సరం బడ్జెట్‌లో రూ.3,007.96 కోట్లు కేటాయించింది. పిల్లలు, తల్లుల ప్రత్యేక పోషకాహార పథకానికి రూ.383 కోట్లు, ఐసీడీఎస్ ప్రాజెక్టులకు రూ.1,016 కోట్లు, కౌమార దశ బాలికల జీవన విధాన పెంపుదలకు రూ.60 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం నాలుగు జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలకు విస్తరించారు.
- బాలికల శానిటరీ నాప్‌కిన్‌లకు రూ.100 కోట్లు కేటాయించారు.
- దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేసే కార్యక్రమానికి రూ.30 కోట్లు కేటాయించారు. మొత్తం దివ్యాంగుల సంక్షేమానికి రూ.121 కోట్లు కేటాయించారు.
టాన్స్జెండర్ల సంక్షేమానికి రూ.20 కోట్లు రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ల (హిజ్రాలు) సంక్షేమం కోసం ఈ బడ్జెట్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో సుమారు 80 వేల మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రప్రభుత్వం 26 వేల మందిని గుర్తించి పెన్షన్ స్కీమ్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. వారి సంక్షేమానికి సమగ్ర విధానాన్ని రూపొందిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం.. వారికోసం ఏడాదికి రూ.50 కోట్లు ఖర్చు చేయాలని అప్పట్లో నిర్ణయించింది. అయితే బడ్జెట్‌లో కేవలం రూ.20 కోట్లు కేటాయించారు.
సాంఘిక సంక్షేమానికి రూ.4,278 కోట్లు
సాంఘిక సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం 2018-19 బడ్జెట్‌లో రూ. 4,278.78 కోట్లు కేటాయించింది. గతేడాది బడ్జెట్‌లో ప్రభుత్వం రూ. 3,692.43 కోట్లు కేటాయించగా 2,485.94 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే రూ. 1,206.49 కోట్లు మిగిలిపోయాయి.

- ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీలో ఉన్న 188 విద్యాసంస్థలకు రూ.1,050 కోట్లు కేటాయించారు.
- షెడ్యూల్డ్ కులాల ఆర్థిక మద్దతు పథకాలకు రూ. 901 కోట్లు సబ్సిడీగా కేటాయించారు.
- చర్మకారుల జీవనోపాధికి రూ. 60 కోట్లు
- లిడ్‌క్యాప్‌కు రూ. 40 కోట్లు
- డప్పు కళాకారుల పెన్షన్‌కు రూ. 12 కోట్లు.
- ఎస్సీ కాలనీలను అనుసంధానించే రోడ్లకు రూ. 452 కోట్లు.
- ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ. 11,228.10 కోట్లు.
- చంద్రన్న పెళ్లికానుక పథకంలో భాగంగా ఎస్సీలకు రూ. 100 కోట్లు.
- భూమి కొనుగోలు పథకానికి రూ. 100 కోట్లు.
గిరిజన సంక్షేమానికి రూ. 2,129 కోట్లు
గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2,129.12 కోట్లు కేటాయించింది. ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల భవనాల నిర్మాణాలకు రూ. 250 కోట్లు కేటాయించింది. అలాగే రెసిడెన్షియల్ స్కూళ్లకు రూ.670 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.260 కోట్లు, గిరిజన పౌష్టికాహారం కోసం రూ.40 కోట్లు కేటాయించింది. ఐటీడీఏల్లో మార్కెటింగ్ స్టోరేజ్ మౌలిక సదుపాయాల కోసం రూ.50 కోట్లు ఇచ్చింది.
మైనార్టీలకు రూ. 1,101.90 కోట్లు
మైనార్టీల సంక్షేమానికి ఈ బడ్జెట్‌లో నిధులు పెరిగాయి. ప్రస్తుత బడ్జెట్‌లో మైనార్టీ సంక్షేమానికి రూ. 1,101.90 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మైనార్టీ విదేశీ విద్యకు రూ. 30 కోట్లు కేటాయించారు. దుల్హన్ పథకానికి రూ.80 కోట్లు, ఇమామ్స్, మౌజన్స్కు ప్రోత్సాహకాల కోసం 75 కోట్ల రూపాయలు కేటాయించారు. బ్యాంకుల రుణాలతో ఆదాయ వనరులు చేకూర్చే పథకాలకు రూ. 150 కోట్లు కేటాయించగా, క్రిష్టియన్ మైనార్టీలకు 75 కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది.
బీసీల సంక్షేమానికి రూ.4,477 కోట్లు
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి గానూ రూ.4,477 కోట్లు కేటాయించింది. ఈ సంవత్సరం కొత్తగా వైశ్యుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయించారు. మత్స్యకారుల పనిముట్లకు రూ.77 కోట్లు, 50 ఏళ్లు పైబడిన వారికి పింఛన్ ఇవ్వాలని నిర్ణయించారు.
- రజకులకు మౌలిక సదుపాయాల కోసం రూ.70 కోట్లు
- దూదేకుల వారికి నైపుణ్య శిక్షణ కోసం రూ.40 కోట్లు
- నాయీ బ్రాహ్మణులకు రూ.30 కోట్లు
- ఎంబీసీలకు రూ.100 కోట్లు
- కల్లు గీత కార్మికులకు రూ.70 కోట్లు
- వాల్మీకి బోయలకు రూ.50 కోట్లు
- వడ్డెరులకు రూ.50 కోట్లు
- సాగర, ఉప్పర్లకు రూ.40 కోట్లు, కృష్ణబలిజ-పూసలకు రూ.25 కోట్లు.
- చంద్రన్న పెళ్ళికానుకకు రూ.100 కోట్లు, ఆదరణ పథకం కింద రూ.750 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు రూ.600 కోట్లు కేటాయించారు. కాపు కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయించారు. ఇందులో విద్యాభివృద్ధికి రూ.400 కోట్లు కేటాయించారు. ఈబీసీల ఫీజులకు రూ.700 కోట్లు కేటాయించారు.
కార్మిక సంక్షేమానికి రూ.814.83 కోట్లు
కార్మిక సంక్షేమానికి 2018-19 ఆర్థిక సంవత్స రానికి బడ్జెట్‌లో రూ.814.83 కోట్లు కేటాయించారు. ఇందులో చంద్రన్న బీమాకు రూ.140 కోట్లు కేటాయించారు. గత సంవత్సరం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి రూ.350 కోట్లు తీసుకొని చంద్రన్న బీమాకు ప్రీమియం కట్టారు.
వైద్య ఆరోగ్యానికి రూ. 8,463 కోట్లు
ఈ ఏడాది ఆరోగ్య రంగానికి రూ.8,463కోట్లు కేటాయించారు. అంటే.. మొత్తం బడ్జెట్‌లో ఆరోగ్యానికి కేటాయించింది 4.42 శాతం. కాగా, కేటాయింపుల్లోని 70శాతం మొత్తం సిబ్బంది జీతాలకే పోతుంది. మిగిలిన 30 శాతంతోనే పథకాల నిర్వహణ ఆధారపడి ఉంది.
విద్యాశాఖకు రూ.24,185.75 కోట్లు
2018-19 బడ్జెట్‌లో విద్యా రంగానికి 24,185.75 కోట్లు కేటాయించారు. ఇందులో పాఠశాల విద్యకు రూ.21,612 కోట్లను కేటాయించారు. రాష్ట్రంలో 61,710 పాఠశాలలుండగా అందులో 16,688 ప్రైవేటు యాజమాన్యంలోనివి కాగా తక్కినవన్నీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. అన్ని స్కూళ్లలో 72 లక్షల మంది విద్యార్థులుండగా అందులో 65 శాతం ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉన్నారు. కాగా, ఉపాధ్యాయులు 1.80 లక్షల మంది వరకు ఉన్నారు.
- ఉన్నత విద్యాశాఖకు రూ.2,835 కోట్లు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.23,439 కోట్లు
రాష్ట్రప్రభుత్వం తాజా బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకోసం రూ.23,439 కోట్లను కేటాయించింది. ఇందులో పంచాయతీరాజ్, మంచినీటి సరఫరా విభాగాలకు రూ.8,733.83 కోట్లు, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యక్రమాలకు రూ.14,705 కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. గతేడాది బడ్జెట్‌లో ఈ శాఖకు రూ.21,140 కోట్లు కేటాయించగా.. ఈసారి సుమారు మరో రూ.2వేల కోట్లకుపైగా కేటాయింపులు పెరిగాయి. అయితే ఈ శాఖకు కేటాయింపులు ఈ స్థాయిలో ఉండడానికి కేంద్రం నుంచి అందే సాయమే కారణం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు చేసిన బడ్జెట్ కేటాయింపుల్లో ఎక్కువభాగం కేంద్రం నుంచే నిధులందుతాయని ప్రభుత్వం బడ్జెట్ గణాంకాల్లో పేర్కొంది. శాఖ పరిధిలోని వివిధ పథకాల అమలుకు కేంద్రం రూ.6,780 కోట్ల నిధుల్ని రాష్ట్రానికి అందజేస్తోందని తెలిపింది.
ఆర్‌అండ్‌బీకి రూ.4,703 కోట్లు
రవాణా, రహదారులు, భవనాల శాఖకు మొత్తం రూ.4,703 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌లో రూ.4,402 కోట్లు ఇవ్వగా, ఈ దఫా 16 శాతం అధికంగా మంజూరు చేశారు. రవాణా శాఖ పరిపాలనకు రూ.207.66 కోట్లు కేటాయించారు. ఇందులోనే రూ.10 కోట్లతో రహదారి భద్రత నిధి ఏర్పాటు చేశారు. మిగిలిన రూ.4,495.73 కోట్లను ఆర్ అండ్ బీకి కేటాయించారు. ఇందులోనే గ్రామీణ రహదారులకు రూ.వంద కోట్లు, జిల్లా ప్రధాన రహదారులకు రూ.341 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర రహదారులు, ఏపీఆర్‌డీసీ (ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ)కు రూ.250 కోట్లు ప్రతిపాదించారు.
ఇతర కేటాయింపులు
- ఆర్టీసీకి రూ. 490 కోట్లు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.వంద కోట్లు
- రహదారి భద్రత నిధికి రూ.10 కోట్లు
- ఎకై ్సజ్ శాఖ భవనాలకు రూ.50 కోట్లు
- హోంశాఖకు రూ. 6, 226 కోట్లు
- ఎన్టీఆర్ సుజల పథకానికి రూ. 150 కోట్లు
- డ్వాక్రా రుణమాఫీకి రూ.1,700 కోట్లు
- అన్న క్యాంటీన్లకు రూ. 200 కోట్లు
Published date : 10 Mar 2018 06:22PM