Skip to main content

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2017-18

సవాళ్లను అధిగమించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ద్వారా విజన్ 2029ను సాకారం చేసేందుకు ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రకటించారు. ఈ లక్ష్యాలను అందుకునే దిశగా 2017-18 బడ్జెట్ దోహదం చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1,56,999.40 కోట్ల బడ్జెట్‌ను మార్చి 15న శాసనసభలో ప్రవేశపెట్టారు. 2016- 17తో పోల్చితే ఇది 15.70 శాతం ఎక్కువ. కేంద్రం సూచనలకు అనుగుణంగా బడ్జెట్‌లో ప్రణాళిక, ప్రణాళికేతర విభాగాలను రెవెన్యూ వ్యయం, క్యాపిటల్ వ్యయంగా వర్గీకరించారు. మొత్తంగా రాష్ట్ర విభజన తర్వాత ఇది ఆంధ్రప్రదేశ్ నాల్గవ బడ్జెట్ (3వ పూర్తిస్థాయి బడ్జెట్) కాగా.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి వేదికగా ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఇదే...
బడ్జెట్‌లో పేర్కొన్న లక్ష్యాలు
  • 2022 నాటికి దేశంలోని మొదటి 3 పురోగామి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావాలి.
  • 2029 నాటికి దేశంలోనే అత్యుత్తమ అభివృద్ధి రాష్ట్రం కావాలి
  • 2050 నాటికి ప్రపంచంలోనే అత్యున్నతమైన గమ్యం కావాలి.
  • విజన్ 2029 ప్రకారం ప్రతి ఏటా 12 శాతం వృద్ధి రేటు సాధించాలనేది లక్ష్యం


2017-18 బడ్జెట్ స్వరూపం
మొత్తం బడ్జెట్ రూ.1,56,999 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.1,25,912 కోట్లు
కేపిటల్ వ్యయం రూ.23,078 కోట్లు
రుణాల చెల్లింపు రూ.8,009 కోట్లు
మొత్తం రెవెన్యూ రాబడులు రూ.1,25,496 కోట్లు
కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.29,139 కోట్లు
కేంద్ర గ్రాంట్లు రూ.37,548 కోట్లు
రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.53,717 కోట్లు
వ్యాట్ రూ.39,321 కోట్లు
ఎక్సైజ్‌ రూ.5,886 కోట్లు
రవాణా రూ.2,950 కోట్లు
స్టాంప్స్ అండ్ రిజస్ట్రేషన్స్‌ రూ.4,000 కోట్లు
రాష్ట్ర పన్నేతర ఆదాయం రూ.5,092 కోట్లు
గనులు రూ.2,200 కోట్లు
అటవీ రూ.920 కోట్లు
రెవెన్యూ లోటు రూ.416 కోట్లు
ద్రవ్య లోటు రూ.23,054 కోట్లు
జీఎస్‌డీపీ రూ.7,68,546 కోట్లు
జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు 0.05 శాతం
జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.00 శాతం
Education News
2017-18 ఆర్థిక సంవత్సరంలో అభివృద్ధి, అభివృద్ధియేతర వ్యయం మొత్తం రూ.1,56,999 కోట్లు....
అభివృద్ధి వ్యయం అభివృద్ధి యేతర వ్యయం
రెవెన్యూ రూ.86,603 కోట్లు రెవెన్యూ రూ.39,309 కోట్లు
కేపిటల్ రూ.21,959 కోట్లు అప్పులు చెల్లింపు రూ.8,009 కోట్లు
రుణాలు రూ.1,119 కోట్లు మొత్తం రూ.47,318 కోట్లు
మొత్తం రూ.1,09,681 కోట్లు

Download AP Budget Documents:
Education News Budget Speech
Education News Budget in Brief
Education News Annual Financial Statement
Education News Agriculture Budget
Education News Scheduled Castes Sub-Plan
Education News Scheduled Tribes Sub-Plan
Education News Budget Estimates 2017-2018


బడ్జెట్ ముఖ్యాంశాలు...
  • పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత, ఉపాధి కల్పనతో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత.
  • గ్రామీణ ప్రాంతాలను దారిద్య్ర రహితంగా మార్చడం, గ్రామీణ, పట్టణ అసమానతల తగ్గింపు కోసం వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.9,091 కోట్లు , గ్రామీణాభివృద్ధికి రూ.19,565 కోట్లు.
  • రుణమాఫీతదుపరి వాయిదా కింద బడ్జెట్‌లో రూ.3,600 కోట్లు.
  • వివిధ కార్యక్రమాల కింద పండ్ల తోటల పెంపకానికి రూ.1,015 కోట్లు.
  • 2029 నాటికి రాష్ట్రంలో దాదాపు 50 శాతం భూమిని హరితమయం చేయాలన్నది లక్ష్యం.
  • వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల ద్వారా ఎనిమిది మెగా ఫుడ్ ప్రాసెసింగ్ పార్కులు నెలకొల్పడానికి ప్రయత్నాలు.
  • రాష్ట్రంలో మరో ఏడు ఎలక్ట్రానిక్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ క్లష్టర్ల ఏర్పాటు.
  • కొండపల్లి కోట వారసత్వ కట్టడంగా అభివృద్ధి. బాపూ మ్యూజియం, అమరావతి ఘన వారసత్వ కేంద్రం, కాకినాడ ఆంధ్ర సాహిత్య పరిషత్తుల అభివృద్ధి.
  • అధికార భాషా సంఘం స్థానంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు.
  • వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్న భూమిలేని నిరుపేద దళిత మహిళలకు వ్యవసాయ భూమి కొనుగోలు చేసి అందించే పథకం పునరుద్ధరణ. ఈ పథకం కింద యూనిట్ ధర ఎకరానికి రూ.15 లక్షలదాకా పెంచడంతోపాటు 75 శాతం సబ్సిడీ, వడ్డీ నిమిత్తం ఆర్థిక సాయం.
  • ఎస్సీల గృహాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఉచిత విద్యుత్తును 50 యూనిట్ల నుంచి 75 యూనిట్లకు పెంపు.
  • బాగా వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కోసం ప్రత్యేక కేటాయింపులు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌కు తొలి విడతగా రూ.60 కోట్లు.
  • వెనుకబడిన తరగతుల వారి నైపుణ్యాల అభివృద్ధి కోసం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వాణిజ్య సంస్థలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సాయం నిమిత్తం ప్రత్యేక ప్రథకం.
  • ఎన్టీఆర్ జలసిరి కింద కొత్తగా 1,24,349 బోరు బావులను ప్రభుత్వం మంజూరు చేయగా, కేవలం 10,039 మాత్రమే పూర్తి.
  • తోటపల్లి ప్రాజెక్టు, గాలేరు నగరి సుజల స్రవంతి మొదటి దశ, హంద్రీ - నీవా సుజల స్రవంతి, వంశధార రోండో దశ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పథకాలు 2018 నాటికి పూర్తి.
  • రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ, వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ సాగు నీటి కోసం నిర్మాణంలో ఉన్న ఏడు నీటిపారుదల ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి.
  • పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వచ్చే ఖరీఫ్ నాటికి పూర్తి. జలవనరుల శాఖకు ప్రస్తుత సంవత్సరం కంటే 60 శాతం అధికంగా నిధుల కేటాయింపు.
  • త్వరలోనే రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణ పనులు ప్రారంభం.
  • 2017-18లో వెయ్యి కిలోమీటర్ల సింగిల్‌లైన్ రోడ్లను డబుల్ లైన్ రహదారులుగా విస్తరణ. విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి పథకం కింద 372 కిలోమీటర్ల పొడవున రహదారులను నాలుగు లైన్ల ప్రమామాణాలకు అనుగుణంగా అభివృద్ధి లక్ష్యం.
  • ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో సరుకు రవాణా కోసం కాకినాడ, పుదుచ్ఛేరి మధ్య అంతర్గత జల మార్గం నిర్మాణానికి సహకారం.
  • కంటింజెన్సీ ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణ కోసం మరో 475 ఉద్యోగాల మంజూరు.
  • రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఎల్పీజీ కనెక్షన్ లక్ష్యం. 2017 జూన్ నాటికి 24 లక్షల ఎల్పీజీ కనెక్షన్ల పంపిణీకి ప్రణాళిక.
  • నిరుపేదలకు చౌక ధరకు భోజనం అందించే ఎన్టీఆర్ క్యాంటీన్ పథకం అమలుకు రూ.200 కోట్లు.
  • రానున్న రెండేళ్లలో పది లక్షల గృహాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం.
Education News
Education News

బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త పథకాలు, వాటికి కేటాయింపులు

రాష్ట్రంలో 12 కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నామంటూ ప్రభుత్వం బడ్జెట్‌లో పేర్కొంది. అవి...
పథకం కేటాయించిన నిధులు రూ. కోట్లలో
నిరుద్యోగులకు సాయం 500.00
ఉపాధి హామీతో పథకాలు 330.00
రాష్ట్ర పర్యాటక అథారిటీ 200.70
అన్న క్యాంటీన్లు 200.00
పట్టణ నీటి సరఫరా నిర్వహణ ప్రాజెక్టు 101.90
ఐటీ ఇన్నోవేషన్ 100.00
ఎన్టీఆర్ సుజల స్రవంతి 100.00
ఉపాధి హామీ కింద అంగన్‌వాడీ కేంద్రాలు 87.74
అత్యంత వెనుకబడిన వర్గాల సంక్షేమం 60.00
మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ 50.00
సాంస్కృతిక కమిషన్ 48.46
ఎన్టీఆర్ జలసిరి 44.00
స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ 40.00

రూ.18,214 కోట్లతో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం నాలుగోసారి కూడా వ్యవసాయనికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టింది. రూ.18,214 కోట్ల ప్రతిపాదనలతో కూడిన వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టారు. ఇందులో రుణమాఫీకి పథకానికి రూ. 3,600 కోట్లు, రైతులకు విద్యుత్ సబ్సిడీకి రూ.3,300 కోట్లు, ఉపాధి హామీ పథకానికి రూ.6,040 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి 2015-16లో రూ.14,184.03 కోట్లు, 2016-17లో రూ.16,250 కోట్ల కేటాయింపులు చేశారు.

వ్యవసాయ బడ్జెట్ స్వరూపం
జాతీయ ఉపాధి హామీ పథకం రూ.6,040
రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ.3,300
రుణ మాఫీ రూ.3,600
వ్యవసాయ రంగానికి రూ.5,525

(ఇందులో ప్రణాళిక వ్యయం 1,170 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.4,355 కోట్లు)

సహకార రంగం బడ్జెట్ రూ.174
వ్యవసాయ మార్కెటింగ్ రూ.18
మత్స్య శాఖ రూ.282
పశు సంవర్థక శాఖ రూ.956
పట్టు పరిశ్రమ రూ.160
నూనెగింజలు, పామారుుల్ రూ.55
సూక్ష్మసేద్యం పథకం రూ.717
సమీకృత ఉద్యాన వన మిషన్ రూ. 96
ఉద్యానవన రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక రూ. 102
ప్రధాన మంత్రి పంటల బీమా పథకం రూ.269
కేంద్ర సాయంతో చేపట్టే పథకాలకు రాష్ట్ర వాటా రూ.301
పావలా వడ్డీకి రూ.5
వడ్డీలేని రుణాలకు రూ.172
వ్యవసాయ విశ్విద్యాలయాలకు అగ్రి వర్సిటీ రూ.308
హార్టికల్చర్ వర్సిటీ రూ.51
పశు వైద్య వర్సిటీ రూ.153

వ్యవసాయ బడ్జెట్ ముఖ్యాంశాలు
  • వచ్చే మూడేళ్లలో ఉద్యాన వన పంటల విస్తీర్ణం ప్రస్తుతం ఉన్న 20 శాతం నుంచి 35 శాతానికి పెంపు.
  • 2017-18లో పీఎం కృషి సించారుు యోజన కింద రెండు లక్షల హెక్టార్లలో బిందు, తుంపర సేద్యం.
  • 2022 నాటికి దేశంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో మొదటి మూడు రాష్ట్రాలలో ఒకటిగా ఆంధ్రప్రదేశ్.
  • వచ్చే ఐదేళ్లలో చిన్న జీవాల అభివృద్ధిలో అగ్రగామిగా రాష్ట్రం
  • గాలికుంటు రహిత రాష్ట్రంగా ఏపీ
  • మరో 810 గ్రామాల్లో 45 పశు వైద్య కేంద్రాలు
  • సముద్ర ఉత్పత్తులలో అగ్రగామి, ఆక్వా హబ్‌గా ఏపీ
  • రాష్ట్రంలోని పది వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఈ-ట్రేడింగ్
  • తూర్పు గోదావరి, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో సమీకృత సహకార అభివృద్ధి పథకం రెండో దశ అమలు
  • హెవోల్టేజీ పంపిణీ వ్యవస్థ పరిధిలోకి 56,699 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు
  • నీటి ఎద్దడి నివారణకు 4.03 లక్షల నీటి కుంటల తవ్వకం

శాఖల వారీ కేటాయింపులు
నీటిపారుదల రంగానికి రూ.12,770.26 కోట్లు
2017-18 బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.12,770.26 కోట్లు కేటారుుంచారు. ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేస్తున్న నిధులు రూ.7,665.30 కోట్లు కాగా రాష్ట్ర నిధులు రూ.5,104.96 కోట్లు.
పోలవరం ప్రాజెక్టుకు రూ. 9 కోట్లు కేటాయించిన ప్రభుత్వం కేంద్రం నాబార్డు ద్వారా రూ.6,880 కోట్ల రుణం ఇప్పిస్తుందని అంచనా వేసింది. 2018 నాటికి పాక్షికంగా, 2019 నాటికి పూర్తిగా ప్రాజెక్టు సిద్ధమవుతుందని హామీ ఇచ్చింది.

సాగునీటికి బడ్జెట్లలో కేటాయింపులు (రూ.కోట్లలో) ఏ ప్రాజెక్టుకు ఎంత... (రూ. కోట్లలో) >
సంవత్సరం కేటాయింపులు వ్యయం
2014-15 3,210.49 3,910.74
2015-16 4678.13 8,124.37
2016-17 7,978.80 8,119.79
2017-18 12,770.26 -

ప్రాజెక్టు పేరు 2016-17బడ్జెట్ సవరించిన అంచనా 2017-18బడ్జెట్
పోలవరం 3,389.00 3,357.50 6,889.00
చాగల్నాడు ఎత్తిపోతల 5.40 5.40 4.15
పుష్కర ఎత్తిపోతల 54.00 54.00 92.39
తాడిపూడి ఎత్తిపోతల 55.00 46.80 98.64
వెంకటనగరం పంపింగ్ 15.00 9.47 15.00
ముసురుమిల్లి ప్రాజెక్టు 11.89 11.66 11.89
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి 2.00 2.00 2.00
సూరంపాలెం ప్రాజెక్టు 2.00 2.00 2.00
భూపతిపాలెం ప్రాజెక్టు 4.61 4.59 4.61
కేసీ కెనాల్ 44.94 57.62 43.12
గురు రాఘవేంద్ర 20.01 23.66 14.11
ఎస్సార్బీసీ 43.05 48.67 46.25
ఎల్లెల్సీ 6.10 6.10 4.10
గాజులదిన్నె 1.15 1.15 1.15
చింతలపూడి ఎత్తిపోతల 91.03 160.76 91.90
గోదావరి డెల్టా సిస్టమ్ 85.23 95.23 85.25
పంపా రిజర్వాయర్ 1.45 1.45 1.45
ఎర్రకాల్వ రిజర్వాయర్ 2.60 3.32 18.80
తొర్రిగడ్డ పంపింగ్ స్కీం 8.30 8.30 8.30
పులిచింతల ప్రాజెక్టు 43.41 27.00 43.41
కృష్ణాడెల్టా ఆధునికీకరణ 112.89 - 112.89
వెలిగొండ 200.00 199.41 200.00
గుండ్లకమ్మ 10.44 10.21 266.73
సాగర్ ఆయకట్టు స్థిరీకరణ 99.14 98.15 103.56
హంద్రీనీవా సుజల స్రవంతి 504.20 504.20 479.20
హెచ్చెల్సీ స్టేజ్-1 19.69 19.69 19.70
హెచ్చెల్సీ స్టేజ్-2 57.74 57.74 57.78
వంశధార స్టేజ్-1 9.57 9.57 9.57
వంశధార స్టేజ్-2 56.80 56.37 54.82
తోటపల్లి రిజర్వాయర్ 52.54 52.39 154.78
మహేంద్రతనయ వరదకాలువ 10.33 10.33 10.32
తారకరామతీర్థ సాగరం 8.00 7.84 259.74
గాలేరు-నగరి సుజల స్రవంతి 348.00 358.12 363.12
పులివెందుల బ్రాంచ్ కెనాల్ 89.22 92.43 96.35
మైలవరం కెనాల్ 7.85 5.61 7.40
వెలిగల్లు ప్రాజెక్టు 3.00 3.00 3.00
సోమశిల 58.78 58.63 58.31
పెన్నా డెల్టా సిస్టమ్ 100.00 100.00 100.00
తెలుగుగంగ 78.12 22.22 57.09
కండలేరు ఎత్తిపోతల పథకం 00 26.42 14.98
సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ - 10.62 10.62
సిద్ధాపురం ఎత్తిపోతల పథకం - 7.95 7.95
ఏలేరు ఆధునికీకరణ 19.51 21.13 39.36
ఏపీఐఎల్‌ఐపీ స్టేజ్-2 2.002 1.70 100.00
గోదావరి పుష్కరాల పనులు, వరదల నియంత్రణ 89.86 89.86 89.86
కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో డ్రెయిన్ల నిర్వహణ 43.15 33.38 45.21
తుంగభద్ర బోర్డు 103.91 45.56 162.02
కడ 57.53 59.53 125.00
చిన్న నీటిపారుదల శాఖ 529.73 897.39 544.27
ఏపీఎస్‌ఐడీసీ 144.14 144.14 186.14
భూగర్భ జలవనరులు 41.57 40.89 44.01

సంక్షేమానికి పెరిగిన నిధులు
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, వెనుకబడిన తరగతుల సంక్షేమానికి గత బడ్జెట్లతో పోల్చుకుంటే కేటారుుంపులు పెరిగాయి. 2017-18 బడ్జెట్‌లో ఎస్సీల సంక్షేమానికి రూ.3,692.43 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.1,815.32 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.5,013.50 కోట్లు కేటాయించారు.
Education News

వైద్య ఆరోగ్య శాఖకు రూ.7,020 కోట్లు
Education News బడ్జెట్‌లో ఆరోగ్య శాఖకు ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల కింద రూ.7,020 కోట్లు కేటాయించారు. ఇందులో 108 అంబులెన్స్‌ల నిర్వహణకు రూ.62.5 కోట్లు, 104 (చంద్రన్న సంచార చికిత్స)కు రూ.64.95 కోట్లు, జాతీయ ఆరోగ్యమిషన్‌కు రాష్ట్ర గ్రాంటు కింద రూ.424.77 కోట్లు, మందులకు రూ.200 కోట్లు కేటాయించారు.

ఆరోగ్య శ్రీకి రూ. వెయ్యి కోట్లు
ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ)కి బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయించారు. అయితే గత మూడేళ్లకు సంబంధించి ఇప్పటికే రూ.400 కోట్ల బకాయిలు ఉన్నాయి.

మున్సిపల్, పట్టణాభివృద్ధికి రూ.5,207.45 కోట్లు
ఈ ఏడాది బడ్జెట్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖకు రూ.5,207.45 కోట్లు కేటాయించారు. 2016-17 బడ్జెట్‌లో ఈ శాఖకు కేటాయించిన నిధులు రూ.4,728.95 కోట్లు.

పట్టణాలు, పథకాల వారీగా కేటాయింపులు
  • స్మార్ట్ నగరాలకు రూ.150 కోట్లు.
  • పట్టణాల్లో సౌకర్యాల మెరుగు కోసం ఉద్దేశించిన అమృత్ పథకానికి రూ.197.72 కోట్లు.
  • మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో మురికివాడల అభివృద్ధి పథకమైన వెలుగు ప్రాజెక్టుకు రూ.2,691 కోట్లు.
  • జాతీయ పట్టణ జీవనధార్ మిషన్‌కు రూ.16 కోట్లు.
  • మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (మడ)కి రూ.50 కోట్లు.

అమరావతి నిర్మాణానికి రూ.1,061 కోట్లు
బడ్జెట్‌లో అమరావతి నిర్మాణ పనుల కోసం రూ.1,061 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏ మాత్రం సరిపోవని స్వయంగా ఆర్థిక మంత్రి బడ్జెట్‌లో పేర్కొన్నారు. అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టు కోసం రూ.500 కోట్లు కేటాయించారు. భవిష్యత్తు అవసరాల నిధి కోసం రూ.169 కోట్లు, భూసమీకరణ పథకానికి రూ.247 కోట్లు, పెన్షన్లకు రూ.70.5 కోట్ల కేటాయింపులు చేశారు. అమరావతి ప్రాజెక్టు కోసం రూ.75 కోట్లు, అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు.

పరిశ్రమల శాఖకు రూ.1,300 కోట్లు Education News
బడ్జెట్‌లో పరిశ్రమల శాఖకు రూ.1,300 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇందులో రూ.564 కోట్లు పారిశ్రామిక రారుుతీలుగా పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.125 కోట్లు, ఎంఎస్‌ఎంఈకి రూ. 125 కోట్లు, ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రాయితీల కింద రూ. 165 కోట్లు, విశాఖ-చెన్నై కారిడార్‌కు రూ. 369 కోట్లు కేటాయించింది.

హోంశాఖకు రూ.5,221 కోట్లు
రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణకు బడ్జెట్‌లో రూ.5,221 కోట్లు కేటాయించారు. 2016-17లో ఖర్చు చేసిన రూ.4,997 కోట్లకు ఇవి రూ.224 కోట్లు అదనం.

విద్యుత్ రాయితీలకు రూ.3,300 కోట్లు
బడ్జెట్‌లో విద్యుత్ శాఖకు రూ.4,274 కోట్లు కేటాయించారు. ఇందులో విద్యుత్ రాయితీలు రూ.3,300 కోట్లు. 2016-17లో ఈ శాఖకు రూ.3,703 కోట్లు కేటాయించారు.

విద్యారంగ కేటాయింపులు
ఉన్నత విద్య, సాంకేతిక విద్యకు రూ.3,513 కోట్లు
బడ్జెట్‌లో ఉన్నత విద్యకు రూ.3,513 కోట్లు కేటాయించారు. ఇందులో యూనివర్సిటీలకు రూ.1,113 కోట్లు ఇవ్వనున్నారు. 2016-17లో విశ్వవిద్యాలయాలకు రూ.1,017 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో విశ్వవిద్యాలయాల్లో కొత్త నిర్మాణాలకు రూ.205.55 కోట్లు కేటాయించారు.

యూనివర్సిటీల వారీగా కేటాయింపులు ఇవీ...
వర్సిటీ కేటాయింపు (రూ. కోట్లలో)
ఆంధ్రా వర్సిటీ 313.17
శ్రీవేంకటేశ్వర వర్సిటీ 171.99
నాగార్జున వర్సిటీ 60.89
శ్రీకృష్ణదేవరాయ 72.20
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 12.22
పద్మావతీ వర్సిటీ 46.08
శ్రీకృష్ణా వర్సిటీ 10.48
రాయలసీమ 10.15
విక్రమసింహపురి 16.59
తెలుగు వర్సిటీ 3.15
ద్రవిడ వర్సిటీ 22.17
నన్నయ వర్సిటీ 15.29
యోగివేమన వర్సిటీ 37.13
అంబేద్కర్ వర్సిటీ 12.22
ఉర్దూ వర్సిటీ 00.50

కేపిటల్ గ్రాంటు కేటాయింపులు ఇలా...
అంబేద్కర్ వర్సిటీ 33.45
నన్నయ వర్సిటీ 45.28
కృష్ణావర్సిటీ 40.86
విక్రమసింహపురి 21.76
రాయలసీమ 48.20
శ్రీకృష్ణదేవరాయ 10.00
యోగివేమన 5.00
ఉర్దూ వర్సిటీ 1.00

సాంకేతిక విద్యకు రూ.765 కోట్లు
బడ్జెట్‌లో సాంకేతిక విద్యకు రూ.765 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఇందులో 57.85 కోట్లను అనంతపురం జేఎన్‌టీయూకి ప్రతిపాదించింది.
కాకినాడ జేఎన్‌టీయూకి రూ. 51.91 కోట్లు, ఒంగోలు అబ్దుల్‌కలామ్ ఐఐఐటీకి, అనంతపురంలో ఏర్పాటు చేయనున్న సెంట్రల్ వర్సిటీ, ఐఐఐటీలకు రూ. కోటి చొప్పున, ఐఐఎస్‌ఈఆర్‌కు రూ. 4 కోట్లు, ఐఐటీకి రూ. 4 కోట్లు, ఎన్‌ఐటీకి రూ. 4 కోట్లు, ట్రైబల్ వర్సిటీకి రూ. కోటి కేటాయించారు. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జి టెక్నాలజీస్‌కు రూ. 200 కోట్లు పేర్కొన్నారు. 2016-17 బడ్జెట్‌లో సాంకేతిక విద్యకు రూ. 825 కోట్లు కేటాయించారు.

పాఠశాల విద్యకు రూ. 17,925 కోట్లు
ప్రభుత్వం పాఠశాల విద్యకు బడ్జెట్‌లో రూ. 17,952 కోట్లు కేటాయించింది. ఈ పద్దు కింద కేటాయించిన నిధుల్లో 90 శాతం జీతభత్యాలు, నిర్వహణకు ఖర్చవుతుంది. మరోవైపు డిజిటల్ తరగతుల కోసం రూ. 45.49 కోట్లు కేటాయించారు.

రహదారులకు 4,041 కోట్లు Education News
బడ్జెట్‌లో రవాణా, ఆర్ అండ్ బీ శాఖకు రూ. 4,041 కోట్లు కేటాయించారు. ఇందులో రవాణా శాఖకు రూ. 191 కోట్లు కాగా, రహదారులు, భవనాల శాఖకు రూ. 3,850 కోట్లు వెచ్చించనున్నారు. ఈ ఏడాది వెయ్యి కిలోమీటర్ల సింగిల్ లైన్ రోడ్లను డబుల్ లైన్లుగా మార్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్టణం-చెన్నై పారిశ్రామిక కారిడార్ అభివృద్ధిలో భాగంగా 372 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేసేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంపైనా, అనంత-అమరావతి ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి కేంద్ర నిధులపైనా ఆధారపడ్డారు.

పంచాయతీరాజ్ శాఖకు రూ.21,140 కోట్లు Education News
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు ఈ బడ్జెట్‌లో రూ.21,140 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.8193 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని బడ్జెట్ గణాంకాల్లో పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం అమలుకు బడ్జెట్‌లో రూ.6,561 కోట్లు ప్రతిపాదించగా, అందులో రూ.5797 కోట్లు కేంద్రం నుంచి అందుతుందని పేర్కొన్నారు.
పింఛన్లకు రూ.4,376 కోట్లు, ఎన్టీఆర్ సుజల పథకానికి రూ.100కోట్లు కేటాయించారు.
గ్రామీణ ప్రాంతాల్లో కొత్త రోడ్ల నిర్మాణం, పాత రోడ్ల మరమ్మతులకు రూ.808 కోట్లు ప్రతిపాదించగా ఇందుకు అయ్యే ఖర్చులో రూ.331 కోట్ల మేర పీఎం జీఎస్‌వై పథకం ద్వారా కేంద్రం ఆర్థిక సాయం చేయనుంది.
ఈ ఏడాది గ్రామ పంచాయతీలకు కేంద్రం నేరుగా కేటాయించే రూ.1686.85 కోట్లు నిధులను బడ్జెట్‌లో పొందుపరిచారు.

గృహ నిర్మాణ శాఖకు రూ.1,457 కోట్లు
ఈ బడ్జెట్‌లో గృహ నిర్మాణ శాఖకు రూ.1,457 కోట్లు కేటాయించారు. ఈ శాఖకు 2014-15లో రూ.808 కోట్లు, 2015-16లో రూ.897 కోట్లు, 2016-17లో రూ.1,132.83 కోట్లు కేటాయించారు. గృహ నిర్మాణ పథకాల కింద ప్రభుత్వం ఇప్పటి వరకూ 3.93 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. 2017-18లో వివిధ పథకాల ద్వారా 4.23 లక్షల ఇళ్లు కొత్తగా నిర్మించనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం పేర్కొంది.

ఇతర శాఖలు, విభాగాల కేటాయింపులు
  • ఫీజు రియంబర్స్‌మెంట్ పథకానికి రూ.1,316 కోట్లు, ఉపకార వేతనాలకు రూ.307 కోట్లు.
  • స్వచ్ఛ భారత్ పథకంలో ఈ ఏడాది రాష్ట్రంలో మరుగుదొడ్ల నిర్మాణానికి బడ్జెట్‌లో రూ. 514 కోట్లు.
  • డ్వాక్రా మహిళలకు జీరో వడ్డీ పథకం కింద చెల్లింపులకు రూ.110 కోట్లు.
  • జిల్లా పరిషత్‌లకు రూ.119.69 కోట్లు.
  • క్రీడలు, యువజన శాఖకు రూ.1,005 కోట్లు
  • ఐటీ శాఖకు రూ.364 కోట్లు
  • రాష్ట్రంలో 1.40 కోట్ల తెల్లరేషన్ కార్డుల లబ్దిదారులకు సబ్సడీపై బియ్యం, ఇతర వస్తువుల పంపిణీకి రూ.2,800 కోట్లు.
  • మహిళా, శిశు, వికలాంగుల అభివృద్ధి శాఖకు రూ. 1,773 కోట్లు.
  • మత్య్సశాఖకు రూ. 282 కోట్లు.
  • వరద నివారణకు రూ.700 కోట్లు.
Published date : 18 Mar 2017 03:50PM

Photo Stories