SBI 5280 Jobs 2023 : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఎస్‌బీఐ 5280 ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..
ఇటీవలే ఎస్‌బీఐ 8,773(జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజా 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల పాటు ప్రొబేషన్ ఉంటుంది. వారం వ్యవధిలో ఎస్‌బీఐ రికార్డు స్థాయిలో 14013 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
తెలుగు రాష్ట్రాలకు..
దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ సర్కిళ్లలో 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (సీబీవో) ఉద్యోగాల భర్తీకి అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 22 నుంచి డిసెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఎస్‌బీఐ ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్(CBO) ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో 825 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు ఇవే..:
ఏదైన గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత తప్పనిసరిగా ఉండాలి. అలాగే.. ఏదైనా కమర్షియల్ బ్యాంకు లేదా రీజినల్ గ్రామీణ బ్యాంకులో రెండేళ్ల పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు :
ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2023 అక్టోబర్ 31 నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ : నవంబర్ 22, 2023
దరఖాస్తులకు చివరితేదీ : డిసెంబర్ 12, 2023
దరఖాస్తు ఫీజు : జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు రూ.750; ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఎలాంటి ఫీజు లేదు.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ : 2024 జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను త్వరలోనే ప్రకటిస్తారు.
పరీక్షావిధానం :
ఆన్‌లైన్ టెస్ట్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ రూపంలో 120 మార్కులకు, డిస్క్రిప్టివ్ రూపంలో 50 మార్కులకు ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షకు సమయం 2గంటలు కాగా.. డిస్క్రిప్టివ్ పరీక్షను 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. డిస్క్రిప్టివ్ పరీక్ష ఇంగ్లిష్ భాషలోనే రాయాల్సి ఉంటుంది. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు లేవు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్
5,280 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇవే..
Tags
- sbi circle based officer jobs
- sbi circle based officer eligibility
- sbi circle based officer exam pattern
- sbi cbo exam eligibility details in telugu
- sbi cbo exam syllabus
- sbi cbo exam date 2023
- sbi cbo job profile
- sbi cbo salary per month
- sbi cbo application 2023
- State IT Minister Palani Vel Thyagarajan
- Tamil Nadu IT Sector
- Job creation goal
- Employment target
- economic growth
- Workforce expansion strategy
- Monthly Jobs Goal
- IT industry development
- Companies advisory
- Employment initiative
- Sakshi Education Latest News