1828 Bank Jobs: ఐబీపీఎస్ ఎస్‌ఓ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం
బ్యాంకు కొలువులంటే టక్కున గుర్తుకు వస్తుంది.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఇటీవల ఐబీపీఎస్.. 1828 ఎస్‌ఓ(స్పెషలిస్ట్ ఆఫీసర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎస్‌ఓ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం ఐబీపీఎస్ జాతీయ స్థాయిలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ ఎస్‌ఓ కొలువులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియపై ప్రత్యేక కథనం...
- 1828 ఎస్‌ఓ పోస్టులకు ఐబీపీఎస్ ప్రకటన
- మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహణ
భాగస్వామ్య బ్యాంకులు
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంక్.
- మొత్తం పోస్టుల సంఖ్య: 1828
- పోస్టుల వివరాలు: అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్–884, మార్కెటింగ్ ఆఫీసర్–535, ఐటీ ఆఫీసర్–220,లా ఆఫీసర్–44, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్–61, రాజ్ భాషా అధికారి 84 పోస్టులున్నాయి. ఇవన్నీ కూడా స్కేల్–1 స్థాయి పోస్టులు.
అర్హతలు
- ఐటీ ఆఫీసర్: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సీఎస్/సీఏ /ఐటీ/ఈఈఈ/ఈసీఈ/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ విభాగాల్లో నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఆయా విభాగాల్లో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. డీఓఈఏసీసీ ‘బీ’ లెవల్ ఉత్తీర్ణత సాధించినవారు కూడా దరఖాస్తుకు అర్హులే.
- అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్: అగ్రికల్చరల్/అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ/హార్టికల్చర్/ ఫారెస్ట్రీ/ఫుడ్ సైన్స్/యానిమల్ హస్బెండరీ/వెటర్నరీ సైన్స్/డెయిరీ సైన్స్/ఫిషరీ సైన్స్ లేదా ఇతర వ్యవసాయ అనుబంధ కోర్సులో నాలుగేళ్ల డిగ్రీ(గ్రాడ్యుయేషన్) పూర్తిచేసి ఉండాలి.
- రాజ్ భాషా అధికారి: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు హిందీతో ఇంగ్లిష్ కోర్ సబ్జెక్ట్‌గా పీజీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా సంస్కృతంతో ఇంగ్లిష్,∙హిందీ కోర్ సబ్జెక్ట్‌లుగా పీజీ పూర్తిచేసి ఉండాలి.
- లా–ఆఫీసర్: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణులై.. బార్ కౌన్సిల్‌లో అడ్వకేట్‌గా నమోదు చేసుకోవాలి.
- హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్: గ్రాడ్యుయేషన్, అలాగే రెండేళ్ల పూర్తిస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులవ్వాలి. లేదా ప్రొఫెషనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ రిలేషన్స్/హెచ్‌ఆర్/హెచ్‌ఆర్‌డీ/సోషల్ వర్క్/లేబర్ లా కోర్సులో రెండేళ్ల పీజీ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
- మార్కెటింగ్ ఆఫీసర్: గ్రాడ్యుయేట్, రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంఎంఎస్(మార్కెటింగ్)/ రెండేళ్ల ఫుల్ టైమ్ ఎంబీఏ(మార్కెటింగ్)/మార్కెటింగ్ స్పెషలైజేషన్‌గా రెండేళ్ల ఫుల్ టైమ్ పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎం ఉత్తీర్ణులవ్వాలి.
- వయసు: 20–30ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్ పోస్టులకు మూడంచెల్లో(ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ప్రిలిమ్స్, మెయిన్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని మెయిన్‌కు అనుమతిస్తారు. మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయించారు. మెయిన్, ఇంటర్వ్యూ మార్కులను పరిగణలోకి తీసుకొని తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
- ప్రిలిమ్స్: ఈ పరీక్షను మొత్తం 150 ప్రశ్నలు–125 మార్కులకు నిర్వíß స్తారు. పరీక్ష సమయం 120 నిమిషాలు. ఎస్‌ఓల్లో వేర్వేరు పోస్టులు ఉన్న కారణంగా ప్రిలిమ్స్ పరీక్షలో విభిన్న సబ్జెక్టులు ఉన్నాయి.
- లా ఆఫీసర్, రాజ్‌భాష అధికారి: ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
- ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్, హెచ్‌ఆర్/పర్సనల్ ఆఫీసర్, మార్కెటింగ్ ఆఫీసర్: ఈ పోస్టులకు నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షలో.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
- ఎస్‌ఓ మెయిన్స్: ఈ పరీక్షను మొత్తం 60 ప్రశ్నలు–60 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రొఫెషనల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
- నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 0.25 మార్కులను తగ్గిస్తారు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 23.11.2021
- ఆన్‌లైన్ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: 26.12.2021
- ఆన్‌లైన్ మెయిన్ పరీక్ష తేది: 30.01.2022
- వెబ్‌సైట్: www.ibps.in
సిలబస్–ప్రిపరేషన్
ఇంగ్లిష్
ఐబీపీఎస్ భర్తీచేసే అన్ని రకాల పోస్టుల ఎంపిక ప్రక్రియలో ఇంగ్లిష్ కీలకమైన సబ్జెక్ట్. ఇందులో రీడింగ్ కాంప్రహెన్షన్, స్పాటింగ్ ద ఎర్రర్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, జంబుల్డ్ వర్డ్స్, పారా జంబుల్స్, క్లోజ్ టెస్ట్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఫ్రేజెస్ సబ్‌స్ట్యూషన్, గ్రామర్ ముఖ్యమైనవి. వీటిపై పట్టు పెంచుకుంటే ఇంగ్లిష్‌లో మంచి స్కోర్ సొంతం చేసుకోవచ్చు.
క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్
ఈ విభాగం నుంచి సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్, వాల్యూస్,నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, డేటా సఫిషియన్సీ,డేటా ఇంటర్‌ప్రిటేషన్, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ సహా ఇతర అర్థమెటిక్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రీజనింగ్ ఎబిలిటీ
రీజనింగ్ ఎబిలిటీలో..కోడింగ్, డీకోడింగ్, సీటింగ్ అరేంజ్‌మెంట్స్, ఆర్డరింగ్, ర్యాంకింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్ అండ్ డిస్టెన్స్, డేటా సఫిషియన్సీ, అరేంజ్‌మెంట్ అండ్ ప్యాటర్న్, డబుల్ లైనప్, షెడ్యూలింగ్,సిరీస్,అనాలజీ వంటివి ముఖ్యమైనవి.
జనరల్ అవేర్‌నెస్
జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించి వివిధ దేశాల కరెన్సీలు, ముఖ్యమైన తేదీలు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, పోర్టులు, నేషనల్ హైవేలు, నదులు, డ్యామ్‌లు, న్యూక్లియర్ పవర్‌ప్లాంట్లు, నేషనల్ పార్కులు, స్టేడియాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలు అడిగే అవకాశముంది.
బ్యాంకింగ్ అవేర్‌నెస్
ఆర్‌బీఐ స్ట్రక్చర్ అండ్ ఫక్షన్స్, మానిటరీ పాలసీ, నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్, యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్ గైడ్‌లైన్స్, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, పేమెంట్ బ్యాంక్స్, బ్యాంకింగ్ టెర్మినాలజీ, రీజినల్ రూరల్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, బేసిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ టాక్సేషన్ సిస్టమ్ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
సన్నద్ధత ఇలా
- ఐబీపీఎస్ ఎస్‌ఓ ప్రిలిమ్స్ పరీక్షను డిసెంబర్ 26వ తేదీన నిర్వహించనున్నారు. అభ్యర్థులు ప్రస్తుత సమయాన్ని ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు మాత్రమే కేటాయించాలి. ప్రిలిమ్స్ ముగిసాక మెయిన్స్‌కు సన్నద్ధం కావచ్చు.
- ప్రిపరేషన్ మొదలు పెట్టే ముందు పరీక్ష విధానం,సిలబస్‌పై పూర్తిఅవగాహన పెంచుకోవాలి.
- మొదటి రోజు నుంచే కనీసం 8 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి.
- ప్రిపరేషన్ ఇప్పుడు మొదలు పెట్టినా.. సరైన ప్రణాళికతో కొనసాగిస్తే విజయం సాధించే అవకాశం ఉంది. ప్రిలిమ్స్ తర్వాత మెయిన్ పరీక్షకు నెల రోజుల సమయం అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆ సమయానికి అనుగుణంగా పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించాలి.
- అభ్యర్థులు వీలైనన్నీ ఎక్కువ మాక్ టెస్టులు రాయాలి. తద్వారా పరీక్షలో వేగంతోపాటు కచ్చితత్వంతో సమాధానాలు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
More Details Click Here
Also Read