APPSC Exams: ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వాహణ.. ఎప్పుడు..?
సాక్షి ఎడ్యుకేషన్: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఏపీపీఎస్సీ ద్వారా వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీఎస్సీ ద్వారా ఏపీ ఫారెస్ట్ సర్వీస్, రవాణా శాఖల్లో వివిధ పోస్టుల భర్తీకి ఈ నెల 3, 4, 5, 6 తేదీల్లో రెండు షిఫ్ట్‌లలో పరీక్షలు నిర్వహిహిస్తామన్నారు.
చదువు మాని.. చపాతీల తయారీ.. గురుకులంలో విద్యార్థుల వంటావార్పు
కంప్యూటర్ ఆధారిత విధానంలో, ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్షలు రాజమహేంద్రవరం రాజీవ్‌గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం నుంచి 6 వరకూ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఫోటో గుర్తింపు కార్డుతో పరీక్ష ప్రారంభించడానికి అర గంట ముందే కేంద్రానికి రావాలన్నారు. ఉదయం పరీక్ష 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుందని, అభ్యర్థులను ఉదయం 8 నుంచి అనుమతిస్తామన్నారు.
PG Counselling: పీజీ కౌన్సెలింగ్ విధానాన్ని మార్చాలి
మధ్యాహ్నం పరీక్ష 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని, అభ్యర్థులను మధ్యాహ్నం ఒంటి గంట నుంచి అనుమతిస్తామన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎస్‌ఆర్ రాజశేఖర్‌రాజు, ఏపీపీఎస్సీ ప్రతినిధులు ఎస్వోలు జె.యశోద, టి.వెంకటరమణ, ఏఎస్వో కేఎస్‌ఎస్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.