Geography Important Topics: పోటీ పరీక్షల్లో జాగ్రఫీ అంశాలకు ఎలా సిద్ధమవాలి?
Sakshi Education
Important topics and preparation guidance for Geography in competitive exams.
- జాగ్రఫీకి సంబంధించి ప్రశ్నలు కోర్ అంశాలతో పాటు వాటితో సంబంధమున్న సమకాలీన అంశాల (Contemporary issues) నుంచి కూడా వచ్చేందుకు అవకాశముంది. అందువల్ల ఇటీవల భౌగోళికంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై దృష్టిసారించాలి.
ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్న రాజధాని నగరం ఏది?
- రుతుపవనాలు-ముందస్తు అంచనాలు, పులుల అభయారణ్యాలు, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు తదితర అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
- టైగర్ సెన్సస్ అంశాలను అధ్యయనం చేయాలి. గతంతో పోల్చితే పులుల సంఖ్యలో వచ్చిన మార్పులు, పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు, ప్రాంతాలను గుర్తుంచుకోవాలి.
భారతదేశంలో అత్యంత పొడవైన కాలువ ఏది?
- ఇటీవల కాలంలో నదుల అనుసంధానం (River Linking) పై బాగా చర్చ జరుగుతోంది. నీరు, ఆహార భద్రతకు నదుల అనుసంధానం ముఖ్యమని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అభ్యర్థులు నదుల అనుసంధానం స్థితిగతులు, రాష్ట్రాల మధ్య జలవివాదాలు తదితరాలపై దృష్టిసారించాలి.
- ప్రస్తుతం స్మార్ట్‌సిటీలపైనా పెద్ద ఎత్తున చర్చజరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం వీటికి అధిక ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ అంశం నుంచి కూడా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
మన దేశంలోని శీతోష్ణస్థితిని ఏమని పిలుస్తారు?
- ప్రపంచ వ్యాప్తంగా (భారత్‌కు ప్రాధాన్యమిస్తూ...) ఐలాండ్ గ్యాస్ నిల్వలపై దృష్టిసారించాలి.
- యురేనియం నిక్షేపాలపైనా అవగాహన తప్పనిసరి.
భారతదేశాన్ని ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజించే జాతీయ రహదారి?
- సహజ వనరులు, రవాణా వ్యవస్థ, భూస్వరూపాలు, నదులు, వాతావరణం తదితర అంశాలపై దృష్టిసారించాలి.
- అట్లాస్ సహాయంతో ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏయే రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది?
Published date : 23 Mar 2022 12:37PM