APPSC: పలు పోస్టులకు ఏపీపీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలన
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇండస్ట్రియల్ ప్రమోషన్ ఆఫీసర్స్(ఐపీఓ), ఏపీ గ్రౌండ్ వాటర్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ (జియో ఫిజిక్స్), మైనింగ్ అండ్ జియాలజీలో టెక్నికల్ అసిస్టెంట్, జిల్లా ప్రొహిబిషన్ ఆఫీసర్ (గ్రేడ్–2) పోస్టులకు నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థుల వివరాలను సర్వీస్ ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఆయా అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాలను డిసెంబర్ 20వ తేదీన పరిశీలించనున్నట్టు కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, జూనియర్ ట్రాన్స్‌లేటర్(తెలుగు) పోస్టులకు సంబంధించి అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను డిసెంబర్ 21న పరిశీలించనున్నట్టు ప్రకటించారు.
చదవండి: Group I Notification 2023 విడుదల.. ఇన్ని పోస్టులు భర్తీ చేయనున్న APPSC
అభ్యర్థులు ఆయా తేదీల్లో విజయవాడలోని కమిషన్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్‌సైట్ https://psc.ap.gov.inలో చూడాలని ఆయన పేర్కొన్నారు.
Published date : 09 Dec 2023 02:56PM