APPSC: పరీక్షలకు హాల్‌టికెట్లను సిద్ధం.. అధికారిక వెబ్‌సైట్‌లో..
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు పదోన్నతులు ఇతర ప్రయోజనాలకు సంబంధించి నిర్వహించే డిపార్టుమెంటల్ పరీక్షలు మార్చి 4 నుంచి 9 వరకు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఓ ప్రకటనలో పేర్కొంది.
APPSC Exams
ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 87,763 మంది హాజరుకానున్నారు. వీరందరి హాల్‌టికెట్లను సిద్ధం చేశామని, కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి వీటిని అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.