AP TET 2021 : Telugu Practice Test-1
1. ‘కవితా కళానిధి’ బిరుదున్న ఆధునిక కవి?
a) జాషువా
b) జ్ఞానానంద కవి
c) కరుణశ్రీ
d) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: c
2. మద వృషభమ్ములు కొమ్ములు గ్రుమ్ముచు. ఈ వాక్యంలో “వృషభం” అను పదానికి అర్థం
a) ఆవు
b) ఎద్దు
c) దున్నపోతు
d) ఖడ్గమృగం
- View Answer
- సమాధానం: b
3. దేవరకొండ బాలగంగాధర తిలక్ రచించిన 'అమృతం కురిసిన రాత్రి' కవితా గ్రంథానికి వచ్చిన పురస్కారం
a) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
b) జ్ఞానపీఠ అవార్డు
c) నోబుల్ పురస్కారం
d) ఏదీకాదు
- View Answer
- సమాధానం: a
4. “దేవాలయం' పర్యాయపదాలు
a) దేవళము, గుడి
b) స్వర్గం, గుడి
c) దేవలోకం, కోవెల
d) దైవం, సురాలయం
- View Answer
- సమాధానం: a
5. మనిషికి నిజమైన అలంకారం
a) బంగారు నగలు
b) సుగంధ జలస్నానం
c) వాక్కు
d) పుష్పాలంకరణ
- View Answer
- సమాధానం: c
ధరణి ధేనువు బిదుకంగదలచితేని
జనుల బోషింపుమధిపవత్సములమాడ్కి
జనుల పోషింపబడుచుండజగతికల్ప
లత తెఱంగునసకలఫలంబులొసగు
''జగతికల్పలత'' అనే సమాసపదానికి విగ్రహవాక్యం
a) జగతి యొక్క కల్పలత
b) జగతియందు కల్పలత
c) జగతి అనెడు కల్పలత
d) జగతియును, కల్పలతయును
- View Answer
- సమాధానం: c
7. ఉభయాక్షరాలు
1. క, చ, ట, త, ప
2. గ, జ, డ, ద, వ
a)
b)
- View Answer
- సమాధానం: a
8. 'నేను .. మీ ప్రియనేస్తాన్ని' - అనే పాఠం యొక్క ప్రక్రియ
a) కథ
b) గేయం
c) ఆత్మకథ
d) సంభాషణ
- View Answer
- సమాధానం: c
9. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెబితే ఆ అలంకారం
a) ఉపమాలంకారం
b) రూపకాలంకారం
c) ఉత్ర్సేక్షాలంకారం
d) వృత్యనుప్రాసాలంకారం
- View Answer
- సమాధానం: c
10. సూర్యుని రథసారధి
a) కశ్యపుడు
b) గరుత్మంతుడు
c) అనూరుడు
d) కర్కోటకుడు
- View Answer
- సమాధానం: c
11. ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పే వ్యవహార రూపం
a) కథ
b) కథానిక
c) వ్యాసం
d) నాటిక
- View Answer
- సమాధానం: c
12. ఒక పనిని చేయవద్దనే అర్థాన్ని సూచించే వాక్యం
a) అనుమత్యర్థక వాక్యం
b) విద్యర్థక వాక్యం
c) నిషేధార్థక వాక్యం
d) సామర్థ్యార్థక వాక్యం
- View Answer
- సమాధానం: c
13. "ప్రపంచ చరిత్రలోన బంధుర తర కీర్తిగొన్నభరతోర్వర నా జనయిత్రి యంచుపాడరా!'' అనిసందేశమిచ్చిన కవి
a) యస్. టి. జ్ఞానానందకవి
b) నార్ల వేంకటేశ్వరరావు
c) సి. నారాయణరెడ్డి
d) వినోబాభావే
- View Answer
- సమాధానం: a
14. 'అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసిన సందర్భంలో ఉపయోగించే జాతీయం
a) బెల్లం కొట్టిన రాయి
b) తేలు కుట్టిన దొంగ
c) కొండలు పిండి గొట్టు
d) వెన్నుజూపు
- View Answer
- సమాధానం: c
15. “ఎప్పుడు సంపద గలిగిన అప్పుడు బంధువులు వత్తురు
తెప్పలుగచెరువునిండిన కప్పలు పదివేలు చేరును” ఈ వాక్యాలలో
బంధువులను కవి పోల్చినది.
a) చెరువుతో
b) సంపదతో
c) కప్పలతో
d) తెప్పలతో
- View Answer
- సమాధానం: a
16. మధువనం పాఠం మొల్ల రామాయణంలోని ఈ కాండలోనిది.
a) అరణ్యకాండ
b) సుందరకాండ
c) యుద్ధకాండ
d) ఉత్తరకాండ
- View Answer
- సమాధానం: b
17. “ఎలుక విందు” గేయ కథ రచయిత
a) గిడుగు రాజేశ్వరరావు
b) కొండపల్లి శేషగిరిరావు
c) దాశరథి కృష్ణమాచార్య
d) వానమామలైవరదాచార్యులు
- View Answer
- సమాధానం: c
18. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. విభిన్న ఆకృతుల్లో, ఆకట్టుకునే రంగుల్లో, చూడముచ్చటగా ఉండే కొయ్యబొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణాజిల్లాలోని కొండపల్లి కొయ్యబొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారులు వంశపారంపర్యంగా ఈ బొమ్మలు తయారుచేస్తున్నారు. స్థానికంగా దొరికే కుమ్మరపొనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
తాతముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం
a) వంశ పారంపర్యం
b) పెట్టింది పేరు
c) ఉట్టిపడుట
d) చూడముచ్చట
- View Answer
- సమాధానం: a
19. “నేస్తం” అనే పదానికి పర్యాయపదాలు
a) వాస్తవం, నిజం
b) సత్యం, నిక్కం
c) మిత్రుడు, స్నేహితుడు
d) చెట్టు, వృక్షం
- View Answer
- సమాధానం: c
20. ఆమె నటనలో నవరసాలు ఒలికిస్తుంది. గీత గీసిన పదం యొక్క సమాసం
a) ద్వంద్వ సమాసం
b) ద్విగు సమాసం
c) బహువ్రీహి సమాసం
d) తత్పురుష సమాసం
- View Answer
- సమాధానం: b
21. తెలివితేటలకు పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అనే తేడాలేదు. చిన్న పిల్లలు తమ మేధాశక్తితోపెద్దవాళ్ళనుఆశ్చర్యపరిచే ప్రతిభను కనుపరుస్తారన్నఇతివృత్తం గల కథ
a) వర్షాలు
b) బాల తిమ్మరుసు
c) సూదికథ
d) సరోజినీ నాయుడు
- View Answer
- సమాధానం: b
22. 'పరిణయం' అనే పదానికి సమానార్థకాలు
a) అనురాగం - సంబంధం
b) పరిమళం - దుర్గంధం
c) మనువు - వివాహం
d) పెళ్ళి - అనుబంధం
- View Answer
- సమాధానం: c
23. కింది వాక్యాలలో శత్రర్థక వాక్యాన్ని గుర్తించండి.
a) మాధవి ఆలోచించి పుస్తకం చదివింది.
b) మాధవి ఆలోచించదు. పుస్తకం చదవదు.
c) మాధవి ఆలోచిస్తూ పుస్తకం చదువుతూంది
d) మాధవి, పుస్తకం చదవదు
- View Answer
- సమాధానం: c
24. “అన్నార్తులు అనాధలుండని
ఆ నవయుగ మదెంతదూరమో
కరువంటూ కాటకమంటూ
కనుపించనికాలాలెపుడో’’
ఈ గేయ పంక్తులు దాశరధి రచించిన “ఆలోచనం' పాఠంలోనివి.
ఈ గేయపంక్తులలోని ఇతివృత్తం
a) వర్ణన
b) ఇతిహాసం
c) పురాణం
d) సామాజిక చైతన్యం
- View Answer
- సమాధానం: d
25. “ఇక్కడ మేమంతా క్షామం' - అన్న కథా రచయిత
a) చిన్నయసూరి
b) శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి
c) మధురాంతకం రాజారాం
d) చిలుకూరి దేవవ్రత
- View Answer
- సమాధానం: c
26. జాషువాకు కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించిన గ్రంథం ఏది?
a) గబ్బిలం
b) ఫిరదౌసి
c) బాపూజీ
d) క్రీస్తు చరిత్ర
- View Answer
- సమాధానం: d
27. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
సృష్టికర్త అయిన బ్రహ్మకు హంసను వాహనంగా చెబుతాయి పురాణాలు. పరమహంస అంటే అత్యున్నతమైన హంస అని అర్థం. పవిత్రమైన ఈ హంసకు నీళ్ళు కలిసిన పాలలోంచి నీళ్ళను వేరు చేసేశక్తి ఉందని చెబుతారు. అంచేత అది ఆధ్యాత్మిక వివేకానికి ప్రతీక అయింది. అహం-స అంటే 'నేనే ఆయన' అని అర్థం. శక్తివంతమైన ఈ సంస్కృత శబ్దాలకు శ్వాస నిశ్వాసలతోస్పందకసంబంధముంది. ఆ విధంగా మానవుడు ప్రతిశ్వాసతోనూ 'నేనే ఆయన్ని' అన్న తన ఉనికిని గురించిన సత్యాన్ని అనుకోకుండా నొక్కి చెబుతుంటాడు.
గాంధీజీని ప్రభావితం చేసిన నాటకాలు
a) సత్యహరిశ్చంద్ర, శ్రవణకుమార చరిత్ర
b) చింతామణి, సత్యహరిశ్చంద్ర
c) కన్యాశుల్కం, వరవిక్రయం
d) కన్యాశుల్కం, చింతామణి
- View Answer
- సమాధానం: a
28. కింది వానిలో మహా ప్రాణాక్షరాలు
a) క, గ, చ, జ, ట, డ
b) జ, ద, ల, మ, త, వ
c) య, ర, ఱ, ల ళ, వ
d) ఖ, ఘ, ఛ, ఝ, ఠ
- View Answer
- సమాధానం: d
29. పిచ్చుక :సరిగ్గా చెప్పావు.
చెట్టు : మనల్ని కాపాడేది మనుషులే.
విద్యుత్ స్తంభం : ఎలా?
ఈ వాక్యాలుండేవ్యవహారరూపం
a) వ్యాసం
b) వచనకవిత
c) పద్యం
d) సంభాషణ
- View Answer
- సమాధానం: d
30. 'శత్రువు' అను పదానికి పర్యాయపదాలు
a) మిత్రుడు, సూర్యుడు
b) దుర్యోధనుడు, దుశ్శాసనుడు
c) అరి, వైరి
d) హరి, అసురవైరి
- View Answer
- సమాధానం: c
31. ‘పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?
a) బాల్య క్రీడలు
b) నిజం– నిజం
c) సందేశం
d) ఇల్లు – ఆనందాల హరివిల్లు
- View Answer
- సమాధానం: b
32. “కోడెనాగులై ఉరికే వాగులు
క్షీర ధారలై పారే తోగులు
భూసతి వానల తానము లాడి
పచ్చికకోకలపైటసవరించె”
ఈ గేయ పంక్తులు గల పాఠం
a) రైతు తెలివి
b) బొమ్మగుర్రం
c) చిన్నారికల
d) వర్షాలు
- View Answer
- సమాధానం: d
33. 'సుభాషిత రత్నావళి' రచించిన కవి
a) భర్తృహరి
b) పక్కిఅప్పలనర్సయ్య
c) ఏనుగు లక్ష్మణకవి
d) మారద వెంకయ్య
- View Answer
- సమాధానం: c
34. షోడశమహా దానాలలో ఒకటి కానిది
a) మహిషదానం
b) శరీరదానం
c) శయ్యాదానం
d) విద్యాదానం
- View Answer
- సమాధానం: b
35. కింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి.
a) ఆవు
b) కాగితం
c) యామం
d) అరక
- View Answer
- సమాధానం: d
36. ఉగాది తెలుగువారి నూతన వర్షం (గీతగీసిన పదానికి నానార్థాలు)
a) వాన, జడి
b) జడి, జల్లు
c) సంవత్సరం, ఏడాది
d) వాన, సంవత్సరం
- View Answer
- సమాధానం: d
37. ‘భ్రమరం’ అంటే అర్థం?
a) నెమలి
b) ఎలుక
c) తుమ్మెద
d) ఈగ
- View Answer
- సమాధానం: c
38. కింది వాటిలో అల్పప్రాణాక్షరాలు
a) ఖ, ఘ, ఛ, ఠ
b) క, గ, చ, జ
c) అ, ఇ, ఉ, ఋ
d) య, ర, ల, వ
- View Answer
- సమాధానం: b
39. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
గురజాడ కన్యాశుల్కం తరువాత సాంఘిక రాజకీయ ప్రయోజనాలు ఉద్దేశించిన మహాగ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ అనే జాతీయోద్యమ నాయకుడు రచించిన 'సంగవిజయం' నవల. వచనంలో వచ్చిన మొట్టమొదటి అభ్యుదయ రచన ఇది. ఆ నవలను ప్రజలు అభిమానించినందుకు బ్రిటీష్ ప్రభుత్వం దానిని నిషేధించింది. మాగ్జింగోర్కీ అమ్మకు ధీటైన నవల ఇది.
'సంగవిజయం' నవల రచించిన కాలం
a) స్వాతంత్ర్యం ముందు
b) స్వాతంత్ర్యం తరువాత
c) వేదకాలం
d) 21వ శతాబ్దం
- View Answer
- సమాధానం: a
40. “ఈరోజు నుండి మేమందరం మా ఇళ్ళల్లో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞచేస్తున్నాం” ఈ వాక్యంలో ఉన్న స్పృహ
a) సామాజిక స్పృహ
b) ఆధ్యాత్మిక స్పృహ
c) నైతిక స్పృహ
d) పఠనాభిలాష స్పృహ
- View Answer
- సమాధానం: a
41. ‘తండ్రి గర గర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్న మాణిక్యాలు” ఈ పొడుపుకు సరైన విడుపు
a) పెదవులు
b) కనురెప్పలు
c) పనసపండు
d) చేతివేళ్ళు
- View Answer
- సమాధానం: c
42. కింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
తిమ్మనకు ఒక ప్రత్యేక శైలి ఉంది. లలితలలితములైన పదముల కూర్పులో ఒక శ్రావ్యతను సాధించాడు. ఉపమా, ఉత్ర్పేక్ష అలంకారాలు రెండూ తిమ్మనకు ఇష్టం. స్వభావోక్తి తిమ్మన వాక్కులో మనోహర నృత్యం చేస్తుందంటే అతిశయోక్తికాదు. ఛందస్సును గమనిస్తే వృత్తాలు, జాత్యుపజాతులుసర్వసాధారణమైనవే కథా గమనానికి వాడారు.
“పాకాల చెరువులోని పది గుంజలుఊపితే ఊగుతాయి పీకితే రావు” ఈ పొడుపుకు విడుపు
a) కనురెప్పలు
b) స్తంభాలు
c) చేతివేళ్ళు
d) పెదవులు
- View Answer
- సమాధానం: c
43. కింది అపరిచిత గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
బ్రతికే ప్రతి జీవిలోనూ తనను చూసుకోవడానికి మానవుడు గోవును పూజించాలని పెద్దల ఆదేశం. సనాతన ఋషులుగోవునుదైవసమానంగా భావించడం సహజమే! భారతదేశంలో మనిషికి ఆవు మంచి తోడు. అది సర్వసంపత్ర్పదాత్రి. అది పాలివ్వడమే కాకుండా సేద్యానికి కూడా ఉపయోగపడుతుంది. గోవు కరుణరసాత్మక కావ్యం. ఆ సాధుజంతువులో కరుణే కళ్ళకు కడుతుంది. మానవజాతిలో లక్షల మందికి రెండోతల్లి అది.
సర్వసంపత్ర్పదాత్రి అంటే
a) సర్వసంపదలూఇచ్చేది
b) సర్వసంపదలూతీసుకొనేది
c) భూమి అంత ఓపిక కలది
d) భూమికి మరో రూపం
- View Answer
- సమాధానం: a
44. నీరు మనకు అందకుండా
నదులే ప్రవహించకుంటే
ఎలా ఉంటుందో చెప్పండి
.... ఈ గేయ ఖండిక గల పాఠం
a) గోరుముద్దలు
b) ఏమవుతుందో
c) పారిపోయిన గిన్నెలు
d) తొలకరి చిరుజల్లులు
- View Answer
- సమాధానం: b
45. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.
నియత తపమును నింద్రియనిగ్రహంబు
భూరివిద్యయు శాంతికి గారణములు
వాటీయన్నిటికంటే మేలైన శాంతి
కారణము లోభముడుగుటకౌరవేంద్ర!
శాంతి కలగాలంటే అణచుకోవలసినది.
a) లోభగుణం
b) భూరి విద్య
c) నియత తపము
d) కారణం
- View Answer
- సమాధానం: a
46. “నిశ్చయం” - అను పదం యొక్క గణం
a) రగణం
b) సగణం
c) జగణం
d) తగణం
- View Answer
- సమాధానం: a
47. దొంగ తనను వదిలి పెట్టమని పోలీసు కాళ్ళావేళ్ళా పడ్డాడు.
ఈ వాక్యంలో ‘కాళ్ళావేళ్ళాపడు' జాతీయానికి అర్థం
a) భయ పెట్టు
b) అడ్డు పెట్టు
c) బతిమలాడు
d) నిరాకరించు
- View Answer
- సమాధానం: c
48. బస్సు కిందకి చేరిన ‘బాలు' కి చాలా వేడిగా అనిపించింది.
ఈ వాక్యంలో బాలు అనగా...
a) ఒక పిల్లవాడి పేరు
b) ఎలుగుబంటి పేరు
c) సైకిల్ పేరు
d) కుక్క పేరు
- View Answer
- సమాధానం: b
49. 'సీత ఇష్టాలు' అనే పాఠ్యభాగ ప్రక్రియ
a) హరికథ
b) కంజర కథ
c) బుర్రకథ
d) యక్షగానం
- View Answer
- సమాధానం: c
50. కింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు గుర్తించండి.
ధరణి ధేనువు బిదుకంగదలచితేని
జనుల బోషింపుమధిపవత్సములమాడ్కి
జనుల పోషింపబడుచుండజగతికల్ప
లత తెఱంగునసకలఫలంబులొసగు
ఆవు దూడను పోషించిన విధంగా ప్రజలను పోషించాల్సినవారు.
a) కల్పలతలు
b) రాజు
c) ధరణి
d) వత్సములు
- View Answer
- సమాధానం: b