AP Grama Sachivalayam Jobs Eligibility : 14000 లకు పైగా ఏపీ గ్రామ/వార్డు సచివాలయల ఉద్యోగాలు.. అర్హతలు.. పరీక్షా విధానం..ఎంపిక ఇలా..
ప్రభుత్వ ఉద్యోగం సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇదో గొప్ప అవకాశం. గ్రామీణ, పట్టణ స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్షల్లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అంశాలు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు.. పరీక్షావిధానం, ఎంపిక చేసే విధానం మీకోసం..
ఏపీ గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగాల సమగ్ర సమాచారం ఇలా..
గ్రామ సచివాలయ ఉద్యోగాల వివరాలు ఇవే..
1. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-5 :
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీ విభాగాలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏ 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు- 75 ప్రశ్నలుంటాయి. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ కూడా 75 నిమిషాల కాల వ్యవధితో 75 మార్కులకు 75 ప్రశ్నలుంటాయి. ఇందులో హిస్టరీ, ఎకానమీ, జాగ్రపీ, పాలిటీ తదితర సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత ఉంటుంది.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
2. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్(గ్రేడ్-2) :
అర్హత : పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత లేదా ఐటీఐ(సివిల్-డ్రాఫ్ట్స్‌మెన్) ఉత్తీర్ణత ఉండాలి.
పరీక్ష విధానం : రాతపరీక్షలో పార్ట్-ఏ, పార్ట్-బీలు 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో 50 మార్కులకు- 50 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలొస్తాయి. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో సర్వే అండ్ డ్రాయింగ్ సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
3. ఏఎన్‌ఎం/మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు)-గ్రేడ్ 3 :
అర్హత : ఎస్‌ఎస్‌సీ లేదా ఏదైనా గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతోపాటు ఎమ్‌పీహెచ్‌ఏ కోర్సు లేదా రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ కోర్సు పూర్తి చేసుండాలి. అనంతరం ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసుండాలి.
పరీక్ష విధానం : పార్ట్-ఏ,పార్ట్-బీలు మొత్తం 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50నిమిషాలు. పార్ట్-బీలో సెన్సైస్, ఫండమెంటల్స్ ఆఫ్ నర్సింగ్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
4. యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ :
అర్హత : ఎస్వీ యూనివర్సిటీ అందిస్తున్న రెండేళ్ల యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ కోర్సు ఉత్తీర్ణత లేదా డెయిరీయింగ్ అండ్ పౌల్ట్రీ సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు/రెండేళ్ల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : రాతపరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్-ఏ 50 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. యానిమల్ హస్బెండరీ సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
5. విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ :
అర్హత : ఫిషరీస్ పాలిటెక్నిక్ డిప్లొమా లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫిషరీస్/ఆక్వాకల్చర్ లేదా నాలుగేళ్ల బీఎఫ్‌ఎస్సీ డిగ్రీ లేదా బీఎస్సీ (ఫిషరీస్/ఆక్వాకల్చర్) లేదా ఎంఎస్సీ (ఫిషరీస్ సైన్స్/ఫిషరీ బయోలజీ/ఆక్వాకల్చర్ /క్యాప్చర్ అండ్ కల్చర్ ఫిషరీస్/మెరైన్ బయాలజీ/కోస్టల్ ఆక్వాకల్చర్/ఓషనోగ్రఫీ/ ఇండస్ట్రియల్ ఫిషరీస్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : పార్ట్-ఏ, బీ కలిపి 150 మార్కులకు ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 50 నిమిషాలు. పార్ట్-బీ 100 మార్కులకు ఉంటుంది. ఇందులో బయాలజీ ఆఫ్ ఫిష్ అండ్ ఫ్రాన్, ఆక్వాకల్చర్, సీడ్ ప్రొడక్షన్, పాండ్ మేనేజ్‌మెంట్, ఫిష్ అండ్ ఫ్రాన్ ఫీడ్ మేనేజ్‌మెంట్, మెరైన్ ఫిషరీస్, గేర్ అండ్ క్రాఫ్ట్, హెల్త్ మేనేజ్‌మెంట్, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఫిషరీ ఎకనామిక్స్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
6. విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ :
అర్హత : బీఎస్సీ హార్టికల్చర్/బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్/బీటెక్ హార్టికల్చర్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో జరిగే రాతపరీక్షలో పార్ట్-ఏ, బీ రెండు విభాగాలుంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలిస్తారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో హార్టికల్చర్ సబ్జెక్ట్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
7. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ (గ్రేడ్-3) :
అర్హతలు : బీఎస్సీ-అగ్రికల్చర్ లేదా బీఎస్సీ-కమర్షియల్ అగ్రికల్చర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ లేదా బీటెక్-అగ్రికల్చర్ ఇంజినీరింగ్ లేదా రెండేళ్ల డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ/ఆర్గానిక్ ఫార్మింగ్/అగ్రికల్చర్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో హార్టికల్చర్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
8. విలేజ్ సెరీకల్చర్ అసిస్టెంట్ :
అర్హత : ఇంటర్ వొకేషనల్ కోర్స్ ఇన్ సెరీకల్చర్/బీఎస్సీ-సెరీకల్చర్/బీఎస్సీ విత్ పీజీ డిప్లొమా ఇన్ సెరీకల్చర్/ఎంఎస్సీ-సెరీకల్చర్/ఎంఎస్సీ-సెరీ బయోటెక్నాలజీ/ ఎంఎస్సీ-అప్లయిడ్ సెన్సైస్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సెరీకల్చర్ నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
9. గ్రామ మహిళా సంస్కరణ కార్యదర్శి/వార్డు మహిళా సంస్కరణ కార్యదర్శి :
అర్హతలు : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : రాతపరీక్షలో రెండు విభాగాలు కలిపి 150 మార్కులకు ఉంటాయి. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు వస్తాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. పార్ట్-బీలో ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర విభాగాల నుంచి 75 ప్రశ్నలు 75 మార్కులకు ఇస్తారు. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
10. ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్-3) :
అర్హత : సివిల్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా లేదా సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో డిప్లొమా స్థాయిలో సివిల్/మెకానికల్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
11. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్-6 (డిజిటల్ అసిస్టెంట్) :
అర్హత : ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత. లేదా బీసీఏ/ఎంసీఏ,బీఎస్సీ (కంప్యూటర్స్)/బీకాం(కంప్యూటర్స్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇండియన్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రపీ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత ఇంజినీరింగ్ సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
12. విలేజ్ సర్వేయర్ గ్రేడ్-3 :
అర్హత : ఎన్‌సీవీటీ సర్టిఫికెట్ ఇన్ డ్రాఫ్ట్స్‌మెన్(సివిల్) లేదా సర్వేయింగ్ ప్రధాన సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత లేదా డిప్లొమా(సివిల్ ఇంజినీరింగ్) లేదా బీఈ/బీటెక్ (సివిల్) ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాలవ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
13. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ :
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇన్‌క్లూడింగ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్, కాంప్రెహెన్షన్-తెలుగు అండ్ ఇంగ్లిష్, జనరల్ ఇంగ్లిష్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ తదితర అంశాల నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు. పార్ట్-బీలో ఇండియా, ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, ఎకానమీ అండ్ ప్లానింగ్, సొసైటీ, సొషల్ జస్టిస్, రైట్స్ ఇష్యూస్, ఫిజికల్ జాగ్రపీ, ఏపీ రాష్ట్ర విభజన, రాష్ట్ర ప్రభుత్వ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్, ఉమెన్ ఎంపవర్‌మెంట్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ తదితర అంశాలపై 75 మార్కులకు 75 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 75 నిమిషాలు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వార్డు సచివాలయ కొలువులకు ఇలా.. :
1. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ :
అర్హత : ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 75 నిమిషాలు. పార్ట్-బీలో హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ తదితర విభాగాల నుంచి 75 మార్కులకు 75 ప్రశ్నలొస్తాయి. పరీక్ష సమయం 75 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
2. వార్డ్ ఎమినిటీస్ సెక్రటరీ (గ్రేడ్-2) :
అర్హత : సివిల్/మెకానికల్ విభాగాల్లో పాలిటెక్నిక్ డిప్లొమా ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులకు 50 ప్రశ్నలొస్తాయి. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలుంటాయి. పరీక్ష సమయం 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
3. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ :
అర్హత : సైన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ లేదా శానిటేషన్ సైన్స్, మైక్రో-బయాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బోటనీ, జువాలజీ, బయో-సెన్సైస్ విభాగాల్లో బీఎస్సీ/బీఎస్సీ(ఆనర్స్)/ఎంఎస్సీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
4. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ :
అర్హత : బీటెక్ కంప్యూటర్ సైన్స్/ఐటీ లేదా బీఈ/బీఎస్సీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా బీసీఏ/ఎంసీఏ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక: రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
5. వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-2) :
అర్హత : పాలిటెక్నిక్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్/ఎల్‌ఏఏ లేదా బీఆర్క్/బీ ప్లానింగ్ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టు నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
6. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-2) :
అర్హత : సంబంధిత విభాగంలో యూజీ లేదా పీజీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం : మొత్తం 150 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. పార్ట్-ఏలో 50 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష కాల వ్యవధి 50 నిమిషాలు. పార్ట్-బీలో సంబంధిత సబ్జెక్టుల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. పరీక్ష కాల వ్యవధి 100 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.
ఎంపిక : రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
☛ AP Grama/Ward Sachivalayam : ఈ మార్కుల ఆధారంగానే.. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు..