Skip to main content

9. మన పర్యావరణం - మన బాధ్యత

9. మన పర్యావరణం - మన బాధ్యత


ముఖ్యాంశాలు:
మనం నివసించే జీవ, నిర్జీవ ప్రాకృతిక ప్రపంచాన్ని ‘పర్యావణం’ (Evnvironment) అంటారు. జీవజాలం మీద ప్రభావం చూపే జీవ, భౌతిక, రసాయనిక కారకాలన్నింటితో మనుగడ సాగించడానికి ఈ కారకాలు తోడ్పడతాయి. ఒక ఆవాసంలో నిర్ధిష్టంగా నివసించే జీవరాశులసమూహమును ‘ఆవరణ వ్యవస్థ’ అంటారు. ఆవరణ వ్యవస్థ (Ecosystem) భావనను ప్రపంచ ప్రసిద్ధ పర్యావరణ వేత్త ఎ.జి టాన్‌స్లే ప్రతిపాదించాడు.
  • గాలి, నీరు నేల, కాంతి మొదలైన భౌతిక కారకాలను నిర్జీవ కారకాలు అని, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కలిపి సజీవకారకాలు అంటారు.
  • ఒక జీవి నుండి మరొక జీవికి శక్తి ప్రసారమయ్యే విధానాన్ని ఆహార జాలకం తెలియజేస్తుంది. ఆహారపు గొలుసులో బాణాలు ఆహారాన్ని, దానిని తినే జీవికి మధ్యగల సంబంధాన్ని సూచిస్తాయి.
  • వివిధ పోషక స్థాయిలలో ఆవరణ వ్యవస్థనిర్మాణాన్ని పిరమిడ్ రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని ‘జీవావరణ పిరమిడ్’ అంటారు. బ్రిటిష్ ఆవరణ శాస్త్రవేత్త చార్లెస్ ఎల్టన్ ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖా చిత్రాలను 1927 లో ప్రవేశపెట్టారు.
  • ఆవరణ శాస్త్ర పిరమిడ్లు ఒక జీవి నుండి మరొక జీవికి జరిగే శక్తి ప్రసరణను తెలుపుతాయి. ఇవి 3 రకాలు
    1. సంఖ్యా పిరమిడ్లు
    2. జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు
    3. శక్తి పిరమిడ్లు
  • కిరణజన్య సంయోగ క్రియలో సూర్యరశ్మి సహాయంతో CO2 స్థాపన ద్వారా ఏర్పడిన జీవ సంబంధ కార్బన్ పదార్థమే జీవద్రవ్యరాశి
  • తెగుళ్ళ నివారణకు పంటలలో ఉపయోగించే క్రిమిసంహారక రసాయనిక మందులు విషపూరితమైనవి. ఇవి పర్యావరణానికి తీవ్రమైన హాని కలుగ జేస్తున్నాయి.
  • ఆహారపు గొలుసులోనికి కాలుష్యాలు ప్రవేశించడాన్ని ‘జైవిక వ్యవస్థాపన’ అంటారు. ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి కారకాలు ప్రవేశించి ఏర్పడిన నిల్వను ‘జైవిక వృద్ధీకరణం’ అంటారు.
  • పంటల ద్వారా అధిక ఉత్పత్తి పొందడానికి పంట మార్పిడి, జీవ నియంత్రణ, సహజ ఎరువుల వాడకం మొదలైన పద్ధతులు పురుగుల మందులకు ప్రత్యామ్నాయంగా పనిచేస్తాయి.

క్విక్ రివ్యూ
ఆహారపు గొలుసు:
ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక స్థాయి నుండి మరొక స్థాయికి మారే శక్తి స్థాయిలను సూచించేది. ప్రధాన శక్తి వనరు అయిన సూర్యుని నుండి గ్రహింపబడిన శక్తి, ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయికి అందించబడుతూ ఆవరణ వ్యవస్థ అంతా ప్రసరిస్తుంది.

పోషక స్థాయిలు: ఆహార గొలసులు శక్తి బదిలీని తెలియ జేస్తాయి. కాబట్టి ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారుల నుండి 3 స్థాయిలు (ప్రధమ, ద్వితీయ, తృతీయ, వినియోగదారులు) వరకే శక్తి మొత్తం ఇతర జీవులకు బదిలీ అవుతుంది. అందువల్ల ఆహారపు గొలుసులు నాలుగు స్థాయిల వరకే ఉంటాయి.

జీవద్రవ్యరాశి పిరమిడ్: శక్తిగా మార్చడానికి వీలైన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని జీవద్రవ్యరాశి అంటారు. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి దారుల నుండి ప్రాధమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారుల వైపు వెళుతున్నప్పుడు క్రమేపి వ్యవస్థలో ఉండే శక్తి తగ్గిపోతుంది. దీనిని సూచించేదే జీవ ద్రవ్యరాశి పిరమిడ్.

పిరమిడ్- శీర్షాభి ముఖం: పిరమిడ్ల అడుగు భాగంలో ఉత్పత్తి దారులు అధిక సంఖ్యలో ఉంటాయి. వీటి ద్రవ్యరాశి చాలా ఎక్కువ. ఉత్పత్తి దారుల నుండి మాంసాహారుల వరకు వెళ్ళే కొద్ది జీవద్రవ్యరాశి క్రమంగా తగ్గుతుంది. అందువల్ల పిరమిడ్లు ఎల్లప్పుడు శీర్షాభి ముఖంగానే ఉంటాయి.

పర్యావరణ హితమైన పంట దిగుబడి పద్ధతులు:-
1. పంట మార్పిడి పద్ధతులు
2. జైవిక నియంత్రణ పద్ధతులు
3. తెగుళ్ళను తట్టుకునే జన్యు సంబంధ పంట వంగడాలు వాడటం
4. తెగుళ్ళను వ్యాప్తి చేసే కీటాకాల పునరుత్పత్తి ఆటంకపరచడం.

4 మార్కుల ప్రశ్న జవాబులు

  1. జీవ ద్రవ్యరాశి అనగా నేమి? ఏదైనా ఒక ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకొని, జీవద్రవ్యరాశి పిరమిడ్ చిత్రం గీయండి (AS-2)
    జ: కిరణజన్య సంయోగ క్రియలో కాంతి సహాయంతో CO2 స్థాపన ద్వారా ఏర్పడిన సంక్లిష్ట కర్బన పదార్థమే జీవద్రవ్యరాశి. శక్తిగా మార్చడానికి కావలసిన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని ‘జీవద్రవ్యరాశి’ అంటారు.
    Tenth Class
  2. పోషక స్థాయి అంటే ఏమిటి? జీవారణ పిరమిడ్‌లో అది దేనిని సూచిస్తుంది?
    జ: ఆహారపు గొలుసులోని వివిధ సోపానముల ద్వారా శక్తి ప్రవాహం నిరంతరం జరుగుతుంది. ఈ శక్తి బదిలీ జరిగే సోపానాలను పోషక స్థాయిలు అంటారు.
    1. జీవావరణ పిరమిడ్ యందు ఉత్పత్తి దారులు (మొక్కలు) పీఠభాగాన్ని ఆక్రమిస్తాయి.
    2. మొక్కలను ఆహారంగా స్వీకరించే శాఖాహార జంతువులు (ప్రధమ వినియోగదారులు) ద్వితీయ పోషక స్థాయిని సూచిస్తాయి.
    3. ఈ శాఖాహార జంతువులను ఆహారంగా తీసుకునే చిన్న మాంసాహారులు (ద్వితీయ వినియోగదారులు) తృతీయ పోషక స్థాయిని సూచిస్తాయి.
    4. చిన్న మాంసాహార జీవులను ఆహారంగా తీసుకునే ఉన్నత శ్రేణి మాంసాహారులు (తృతీయ వినియోగదారులు) చతుర్థ పోషక స్థాయిని సూచిస్తాయి.
      ఆహార గొలుసులోని వివిధ పోషకస్థాయిలను రేఖా చిత్ర రూపంలో చూపగా.....
    Tenth Class
    Tenth Class

  3. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నీవేమి ప్రశ్నలు రూపొందిస్తావు? (AS-2)
    1. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తి దారులు ఏవి?
    2. సౌరశక్తిని మొక్కలు ఎంత శాతం వినియోగించుకుంటాయి?
    3. శక్తి ప్రసరణం అంటే ఏమిటి?
    4. శక్తి ప్రసరణ ఎలా రవాణా జరుగుతుంది?
    5. ఆహారపు గొలుసులో ఎన్ని రకాల పోషక స్థాయిలు ఉంటాయి.
    6. ఆవరణ వ్యవస్థలో ఉన్న శక్తి చివరికి ఎక్కడికి చేరుతుంది?
    7. ఆవరణ వ్యవస్థలో శక్తి పిరమిడ్ ఏ ఆకారంలో ఉంటుంది?
    8. ఆహారపు గొలుసులో ప్రతి స్థాయి వద్ద శక్తి నష్టం ఎంత ఉంటుంది.?

  4. ఆవరణ వ్యవస్థకు నష్టం కలిగించే విపత్తులపై ‘పర్యావరణ వేత్త’ ను కలిసి ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? (AS-2)
    జ:
    1. 2005లో సునామీ ఏ ప్రాంతాలలో ఏర్పడింది?
    2. భూకంపాలు ఏర్పడటానికి కారణాలు ఏమిటి?
    3. ఇటీవల ఏర్పడిన (అక్టోబర్ 12) హుద్ హూద్ తుఫాను వల్ల జరిగిన నష్టం ఎంత?
    4. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏమిటి?
    5. ఓజోన్ పొరకు చిల్లు ఏర్పడితే జరిగే నష్టం ఎలా ఉంటుంది?
    6. ప్రకృతి వైపరీత్యాలను శాస్త్రవేత్తలు ముందుగా గుర్తించలేరా?
    7. ప్రకృతి వైపరీత్యాలకు జీవ వైవిధ్యానికి సంబంధం ఏమిటి?
    8. ఆరోగ్యకరమైన ఆవరణ వ్యవస్థకోసం మనం ఏం చేయాలి?
    9. కృత్రిమ ఎరువులకు, క్రిమిసంహారక మందులకు ప్రత్యామ్నాయం ఏమిటి?
    10. పర్యావరణ నైతికత అంటే ఏమిటి?

  5. క్రిమి సంహారక మందుల (పెస్టిసైడ్స్) నిర్మూలనకు నీవు సూచించే ప్రత్యామ్నాయ చర్యలు ఏమిటి? (AS-6)
    జ: క్రిమి సంహారకాలను వాడటం వల్ల అపాయకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కావున వీటి వాడకం తగ్గించడమే తక్షణ చర్యగా కన్పిస్తుంది. ఈ దీర్ఘకాలిక సమస్యకు కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయి.
    1. పంట మార్పిడి: ప్రతీ ఏటా ఒకే పంటను కాకుండా వేర్వేరు పంటలను పండించే పంట మార్పిడి విధానం పాటించడం వల్ల తెగుళ్ళను, వాటి వల్ల కలిగే నష్టాన్ని నివారించవచ్చు.
    2. తెగుళ్ళ పూర్వాపరాలు తెలుసుకోవటం: పంటలకు ఏఏ తెగుళ్ళు సోకుతాయి. అవి ఎలా వ్యాపిస్తాయి? దీనికి మూల కారణాలు ఏమిటి? అనే విషయాలను అర్థం చేసుకుంటే పంట నష్టాన్ని నివారించవచ్చు.
    3. వంధ్యత్వం: తెగుళ్ళు కలిగించే క్రిమికీటకాల పురుషజీవుల పునరుత ్పత్తి సామర్థ్యం కోల్పోయేలా వంధ్యత్వం చేయడం ద్వారా వాటి వ్యాప్తిని అరికట్టవచ్చు.
    4. జైవిక నియంత్రణ: తెగుళ్ళు కలిగించే కారకాలను తినే పరాన్న జీవులను నిశాచర మాంసాహారులు (Nocturnal Predators )ప్రవేశ పెట్టడం ద్వారా తెగుళ్ళను నివారించవచ్చు.
    5. జన్యు ఉత్పరి వర్తన రకాలు: తెగుళ్ళను, వాతావరణ పరిస్థితులను తట్టుకునే జన్యుసంబంధ వంగడాలను అభివృద్ధి చేయడం ద్వారా పురుగు మందులు వినియోగాన్ని తగ్గించవచ్చు.
    6. పర్యావరణ నైతికత: మానవ కార్యకలాపాలు పర్యావరణం, సహజ వాతావరణంపై ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి. కావున పర్యావరణం పట్ల నైతిక విలువలు కలిగి ఉండాలి? పర్యావరణం పరంగా ఏది సరియైనదో నైతికంగా ఆలోచించి ప్రవర్తించాలి.

  6. ‘మన పర్యావరణం-మనబాధ్యత’ పాఠం ద్వారా విషపూరిత పదార్థాల వాడకం ఆవరణ వ్యవస్థను ఏవిధంగా ప్రభావితం చేస్తున్నాయో మీకు తెలిసిన విషయాలు రాయండి? (AS-1)
    జ:
    1. విచక్షణారహితంగా పురుగు మందులను, గుల్మనాశనులను పంట పొలాలపై వాడటం వల్ల ఎక్కువ సంఖ్యలో పరిసర ప్రాంతాల జీవులను నాశనం చేస్తాయి. వీటిలో క్రిములను ఆహారంగా తీసుకునే కీటకాలు మరియు ఇతర జీవులు కూడా నాశనం అవుతాయి.
    2. పెస్టిసైడ్లు ఆహారపు గొలుసులలో అనూహ్యమైన మార్పులు కలుగజేస్తూ, ఆవరణ వ్యవస్థ సమతుల్యతను దెబ్బతీస్తాయి.
    3. విషపూరితమైన క్రిమిసంహారకాల వాడకం వల్ల నేల కాలుష్యం ఏర్పడుతుంది.
    4. పాదరసం, ఆర్సెనిక్, సీసం కలిగి ఉన్న పెస్టిసైడ్లు చాలాకాలం పాటు పంటలపై ఉండి వాటిని జంతువుల శరీరాలలోకి రవాణా చెంది ఆహారపు గొలుసులో చేరుతున్నాయి.
    5. వీటిని స్ప్రే చేస్తున్నప్పుడు మానవులకు కూడా చేరి ఎలర్జీ, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతున్నారు.

    2 మార్కుల ప్రశ్న జవాబులు

    1. ‘పర్యావరణం’ అనగా నేమి? పర్యావరణ కారకాలు ఏవి? (AS-1)
      జ:
      జీవ జాలంపై ప్రభావం చూపే భౌతిక, రసాయన కారకాలతో పాటు, నిర్జీవ కారకాలతో గల పరస్పర సంబంధాన్ని పర్యావరణం అంటారు.
      జీవ కారకాలు: మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు
      భౌతిక కారకాలు: గాలి, నీరు, నేల, కాంతి మొదలైనవి.

    2. ‘ఆహారపు గొలుసు’ అంటే ఏమిటి? మీరు పరిశీలించిన ఆహారపు గొలుసుకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి (AS-2)
      జ: ఒక ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మారుతూ ఉంటుంది. ఇలా మారే శక్తి స్థాయిలను ‘ఆహారపు గొలుసు ’ అంటారు. ఆహారపు గొలుసులో ఉత్పత్తి దారులు, ప్రధమ, ద్వితీయ, తృతీయ వినియోగదారుల మధ్య ఆహార సంబంధాలు ఉంటాయి.
      ఉదా ||
      Tenth Class
    3. ఆహారపు గొలుసు (Food Chain), ఆహార జాలకం (Food Web) ల మధ్య మీరు గుర్తించిన భేదాలేవి?(AS-2)
      జ:
      మొక్కలను ఆధారంగా జీవులు ఒక దానిపై మరొకటి ఆధారపడుతూ జీవించడం ఆహారపు గొలుసుగా సూచిస్తాము. కొన్ని ఆహారపు గొలుసుల సమూహమును ఆహార జాలకం అంటారు. ఆహార గొలుసులలో జీవుల సంబంధాలు సవ్యదిశలో ఉంటాయి. ఆహార జాలకంలో అపసవ్య దిశలో అనగా పోషకస్థాయిలో ఒక జీవి కొన్ని జీవులను స్వీకరించవచ్చు లేదా కొన్ని జీవులకు ఆహారంగా మారవచ్చు.

    4. ‘సంఖ్యాపిరమిడ్’ అంటే ఏమిటి? ఇది ఏ అంశాలను తెలియ జేస్తుంది.? (AS-1)
      జ:
      ఆహారపు గొలుసులోని ప్రతి పోషక స్థాయిలో ఉన్న జీవుల సంఖ్యను చూపించే - జీవావరణ పిరమిడ్‌ను ‘సంఖ్యా పిరమిడ్’ అంటారు. జీవావరణ శాస్త్ర పిరమిడ్లు ఒక జీవి మరొక జీవిపై ఆధారపడిన విధము, ఒక జీవి నుంచి మరొక జీవికి జరిగే శక్తి ప్రసరణను తెలుపుతాయి.

    5. విచక్షణారహితంగా క్రిమి సంహారక మందులు (ఫెస్టిసైడ్స్) వాడకం వల్ల కలిగే నష్టాలు ఏమిటి? (AS-1)
      జ:
      1. పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల ఇతర జంతువులపై కూడా ప్రభావం ఉంటుంది.
      2. క్రిములతో పాటు, పంటలకు ఉపయోగపడే కీటకాలు ఇతర జంతువులు కూడా నశిస్తాయి.
      3. ఫలితంగా ఆహార గొలుసులో అనూహ్యమైన మార్పులు - చోటు చేసుకుంటాయి. ఆవరణ వ్యవస్థ సమతుల్యత దెబ్బ తింటుంది.
      4. పెస్టిసైడ్స్ వల్ల నేల కాలుష్యానికి గురై, సారవంతం తగ్గుతుంది.

    6. ఆవరణ వ్యవస్థ నుంచి ఉత్పత్తిదారులను తొలగిస్తే ఏం జరుగుతుందో ఊహించి రాయండి. (AS-2)
      జ: ఏ ఆవరణ వ్యవస్థలో నైనా ఉత్పత్తి దారులే ప్రధానమైన శక్తి వనరులు. ఆ ఆవరణ వ్యవస్థ నుంచి గడ్డి మరియు మొక్కల వంటి ఉత్పత్తి దారులను తొలగించినట్లయితే, వీటిపై ఆధారపడి జీవించే శాఖాహార జీవులు, శాఖాహారులపై ఆధారపడే మాంసాహార జీవులకు ఆహారం లభించదు. వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. ఆ ఆవరణ వ్యవస్థ యందు శక్తి ప్రవాహం విచ్ఛిన్నం అవుతుంది. కాబట్టి ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులు ఉంటేనే జీవులన్నీ మనుగడ సాగిస్తాయి.

    7. ఆహారపు వల నుంచి మాంసాహారులను తొలగిస్తే ఏమవుతుంది? (AS-2)
      జ:
      1. ఆహారపు వల నుంచి మాంసాహారులను తొలగిస్తే శాఖాహారుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.
      2. అసంఖ్యాకమైన శాఖాహారులకు సరిపోయే శక్తిని ఉత్పత్తి దారులు అందించలేవు.
      3. కాబట్టి అన్ని శాఖాహారులకు ఆహారం సరిపోక పోతే, అవి చనిపోయే ప్రమాదం ఉంది.
      4. దీని వలన ఆహార గొలుసు గతి తప్పుతుంది. మొత్తంగా జీవావరణ సమతుల్యత దెబ్బతింటుంది.

    8. చైనాలో పిచ్చుకలను నిర్మూలించడం వల్ల జరిగిన నష్టమేమిటి? (AS-2)
      జ:
      1. విచక్షణా రహితంగా పిచ్చుకలను చంపడం వల్ల, పంటలపై దాడి చేసే క్రిమి కీటకాల సంఖ్య బాగా పెరిగింది.
      2. పిచ్చుకలు లేకపోవడం వల్ల, అవి తినే మిడతల సంఖ్య పెరిగి పంటలపై మిడతల దాడి పెరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితి వల్ల చైనాలో అతి పెద్ద కరువు సంభవించింది.
      3. ఈ మిడతలను చంపడానికి విచక్షణా రహితంగా క్రిమిసంహారకాలను వాడటంతో భూసారం క్షీణించింది.
      4. పొలాలలో పనిచేయాల్సిన రైతులకు, కూలీలకు ఉపాధి పనులు దొరకక పట్టణాలలోని కర్మాగారాలలో కార్మికులుగా పనిచేయడానికి వలస వెళ్ళారు.

    9. ‘ఆపరేషన్ కొల్లేరు’ అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యతను తెలపండి? (AS-1)
      జ: కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ మంత్రిత్వశాఖ‘‘ఆపరేషన్ కొల్లేరు’ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గోదావరి నదుల మధ్య విస్తరించి ఉన్న కొల్లేరు ప్రకృతి ప్రసాదించిన మంచినీటి సరస్సు. ఈ సరస్సు పూడిక వల్ల వరదలు రావడం, కాలుష్యం వల్ల జీవజలానికి ముప్పు వాటిలడం సర్వసాధారణమయ్యింది. కొల్లేరులో జీవ సంపదను కాపాడటం ద్వారా అక్కడి ప్రకృతి సమతుల్యాన్ని పరిరక్షించడం అనివార్యము. ఎన్నో వేల కి.మీ. నుంచి వలస వచ్చే 193 రకాల పక్షి జాతులను రక్షించ గలిగితే అక్కడ అపురూపమైన జీవ వైవిధ్యం నెలకొంటుంది.

    10. పర్యావరణం పై ప్రజల్లో చైతన్యం కలిగించడానికి ‘పర్యావరణ స్నేహ పూర్వక కృత్యాలు (Friendly Eco Clubs) నిర్వహణకు కొన్ని నినాదాలు వ్రాయండి(AS-7)
      జ:
      1. వృక్షో రక్షతి రక్షితః
      2. పచ్చని చెట్లు - మానవ ప్రగతికి మెట్లు
      3. పచ్చని చెట్లను పెంచు - పది మందికి ఆరోగ్యం పంచు
      4. పరిసరాలు కాపాడండి - పది కాలాలు జీవించండి.
      5. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం - ఆరోగ్య సమాజాన్ని నిర్మిద్దాం.
      6.సేంద్రియ ఎరువులను వాడుదాం - కాలుష్యరహిత ఫలసాయం పొందుదాం.
      7. క్రిమిసంహారకాలు వద్దు - జైవిక నియంత్రణ ముద్దు.

    11. పర్యావరణ నైతికత అంటే ఏమిటి? (AS-2)
      జ: మానవుని కార్యకలాపాల వల్ల ప్రకృతి వనరులు మరియు పర్యావరణం చాలా తీవ్రమైన ప్రభావాలకు గురి అవుతున్నాయి. కనుక మన పర్యావరణం పట్ల బాధ్యతగా మెలగాలి. పర్యావరణం పట్ల నైతిక విలువలను పాటించాలి. పర్యావరణంపై అవగాహన సదస్సులను ఏర్పాటు చేసి పర్యావరణాన్ని సంరక్షించాలి.

    12. కొంత మంది పిల్లలు ఒక పచ్చని ఆవరణ వ్యవస్థలో పూల మీద వాలే సీతాకోక చిలుకలను ఆనందం కోసం చంపుతున్నారు. వారిని ఎలా వాదిస్తావు? కారణాలు తెల్పండి.
      జ: సీతాకోక చిలుకలను చంపడం మహా పాపం అని పిల్లలకు తెలియజేస్తాను. సీతాకోక చిలుకలు కీటకాలు, రైతులకు నేస్తాలు. ఎందుకంటే పూలపై, పంట మొక్కలపై వాలి ఫలధీకరణకు తోడ్పడతాయి. దీని వల్ల అధిక ఫలసాయం పొందవచ్చు. అని చెప్పి పిల్లలను వాటిని చంపకూడదని వారిస్తాను.

    1. మార్కు ప్రశ్న జవాబులు

    1. ఆహారపు గొలుసులో స్థాయిలను తెల్పండి.
      జ: ఒక ఆహారపు గొలుసులో స్థాయిలు క్రింది విధంగా ఉంటాయి.
      Tenth Class
    2. ఆహార జాలకం (Food web) అంటే ఏమిటి?
      జ: అనేక ఆహారపు గొలుసుల కలయికను ఆహార జాలకం అంటారు. ఇది జీవుల మధ్య గల ఆహార సంబంధాన్ని తెలుపుతుంది.

    3. నిచ్ (Niche) అనగా నేమి?
      జ:
      ఆహార జాలకంలో ప్రతి జంతువు ఒక నిర్ధిష్ట స్థానాన్ని కలిగి ఉంటుంది. దీనిని ఆ జంతువు ‘ఆహార జాలకపు ఆవాసం’ లేదా నిచ్ అంటారు.

    4. యూట్రిఫికేషన్ అనగా నేమి?
      జ: నీటి ఆవాసంలోకి పోషక కలుషితాలు అధికంగా వచ్చి చేరటం వలన కలుపు మొక్కలు విపరీతంగా పెరుగుతాయి. ఈ స్థితిని ‘యూట్రిఫికేషన్’ అంటారు. దీని వల్ల జలావాసం పాడుకావడమే గాక, జలచర జీవులకు ఆక్సీజన్ అందక మరణిస్తాయి.

    5. BOD అనగా నేమి?
      జ: BOD అనగా Biological Oxygen Demand ఇది ఆవాసంలోని ఆక్సీజన్ మోతాదును తెలుపుతుంది. ఆక్సీజన్ సగటు కంటే తగ్గితే జీవులు మరణించే ప్రమాదం ఉంటుంది.

    6. పంట మార్పిడి వల్ల ప్రయోజనం ఏమిటి?
      జ:
      1. ఒకే నెలలో ఒకే రకమైన పంటే వేస్తే నేలలో సూక్ష్మ పోషకాల నిష్పత్తి సర్దుబాటు కాక క్రమంగా నేలసారం తగ్గుతుంది.
      2. పంట మార్పిడి వల్ల ఈ వ్యత్యాసం ఉండదు. పంట దిగుమతి పెరుగుతుంది.
      3. ఒక పంటకు సోకిన తెగుళ్లు మరో పంటకు సోకవు.

    7. జీవ ఇందనం (Bio-Mass) అనగా నేమి?
      జ:
      శక్తిగా మార్చడానికి కావలసిన వృక్ష, జంతు సంబంధ పదార్థాన్ని ‘‘జీవ ద్రవ్యరాశి’’ (BiO-Mass) అంటారు. శక్తి ఉత్పత్తి కోసం ఉపయోగించే జీవ ద్రవ్యరాశి జీవశక్తి అవుతుంది.

    8. ఆహారపు గొలుసును పునర్నిర్మించేవి? ఏవి? వాటి పాత్ర తెల్పండి.
      జ:
      ఆహారపు గొలుసును పునః ప్రారంభించేవి బ్యాక్టీరియాలు లేదా శీలీంధ్రాలు. వీటిని విచ్ఛిన్న కారులు అంటారు. ఆహారపు గొలుసులో ఉన్నత శ్రేణి వినియోగదారులు మరణిస్తే వాటి శరీరాలను మట్టిలో కుళ్ళ గొట్టి ‘హ్యూమస్’ తయారు చేస్తారు. దీని ద్వారా ఆహారపు గొలుసు మొదలవుతుంది.

    9. కాలుష్య నియంత్రణ చట్టాలు ఏవి? ఈ చట్టాల అమలు అధికారం ఎవరిది?
      జ:
      నీటి కాలుష్య నియంత్రణ చట్టం 1974, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981 అనేవి నేడు అమలులో ఉన్నాయి. ఈ కాలుష్య నియంత్రణ బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డులకు ఉంటుంది.

    10. ‘జీవ ఎరువులు’ అని వేటిని అంటారు?
      జ:
      జీవ ఎరువులు అనగా
      1. సేంద్రియ ఎరువు (వృక్ష జంతు విసర్జితాలు)
      2. వర్మికంపోస్టు (వానపాముల విసర్జితాలు)
      3. పచ్చి రొట్ట ఎరువు (జీలుగు, జనుము, వేరు శనగ మొ|| నవి)

    11. మీకు తెలిసిన లేదా మీరు విన్న ఏవైనా 2 పెస్టిసైడ్ల పేరు తెల్పండి.
      జ:
      మోనో క్రోటో ఫాస్, ఎండో సల్ఫాన్, మాలాధియాన్ మొద లైనవి.

    12. మినిమేటా వ్యాధి ఎలా సంభవిస్తుంది.
      జ: జపాన్‌లోని చిస్సో కార్పోరేషన్ వారి రసాయన పరిశ్రమ నుంచిషిరని సముద్రంలో మిథైల్ మెర్క్యురీతో కూడిన వ్యర్థాలు చేరుతున్నాయి. ఈ సముద్ర చేపలను మినిమేటా నగర ప్రజల ఆహారంగా తీసుకొనుట వల్ల అనారోగ్యం పాలవుతున్నారు.

    1/2 మార్కు ప్రశ్న జవాబులు

    1. సజీవులు నివసించే ఈ ప్రపంచాన్ని ఇలా పిలుస్తారు ( )
      ఎ. ఆహారపుగొలుసు
      బి. ఆహారజాలకం
      సి. జీవావరణం
      డి. ఆవరణ వ్యవస్థ
    2. ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేయు కారకం ( )
      ఎ. వర్షపాతం
      బి. ఉష్ణోగ్రత
      సి. సూర్యకాంతి
      డి.అన్నీ
    3. ‘‘గడ్డి ---కప్ప---పాము’’ ఆహారపు గొలుసులో లోపించింది. ఏమిటి? ()
      ఎ. సింహం
      బి. మిడత
      సి.మేక
      డి. ఏదికాదు.
    4. ‘‘జీవావరణ పిరమిడ్‌లు’’ - భావనను ప్రవేశ పెట్టినవారు ( )
      ఎ. లామార్క్
      బి. టాన్‌స్లే
      సి.చార్లెస్ ఎల్టన్
      డి. ఏదికాదు
    5. ‘ఎడారి ఓడ’ అని దేనికి పేరు? ( )
      ఎ. ఏనుగు
      బి. నక్క
      సి. సింహం.
      డి. ఒంటె
    6. ప్రతి పోషక స్థాయిలో జరిగే శక్తి నష్టం ( )
      ఎ. 10-20%
      బి.30-40%
      సి.60-40%
      డి. 80-90%
    7. క్రింది వాటిలో శిలాజ ఇంధనాలు ( )
      ఎ. బొగ్గు
      బి.పెట్రోలియం
      సి. డిజీల్
      డి. పైవన్నీ
    8. ఆవరణ వ్యవస్థలోని వినియోగ దారులు ఈ క్రింది అంశాల ఆధారంగా విభజించబడ్డాయి. ( )
      ఎ. తినే ఆహారం
      బి. పోషక స్థాయి
      సి. ఎ,బి
      డి. శక్తి
    9. మన పరిసరాలు శుభ్రంగా ఉండటానికి గడ్డి, పచ్చని మొక్కలు...తొలగించాలని మమత చెప్పింది. ఈ అభిప్రాయాన్ని రాజశేఖర్ నిరాకరించాడు ఎందుకనగా...( )
      ఎ. శ్రమతో కూడినది
      బి. సమయం బాగా తీసుకుంటుంది.
      సి. సమతుల్యతను దెబ్బ తీస్తుంది.
      డి. తాత్కాలికంగా కృత్రిమంగా ఉంటుంది.
    10. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుతారు ( )
      ఎ. జూన్ 21
      బి. జూన్ 5
      సి. అక్టోబర్ 16
      డి. డిశంబర్ 10
    11. ఆహార గొలుసుని పునర్మించేవి............ ( )
      ఎ. ఉత్పత్తి దారులు
      బి. వినియోగదారులు
      సి. విచ్ఛిన్న కారులు
      డి. ఏదికాదు.
    12. మన దేశంలో భారత ప్రధాని ప్రారంభించిన ‘స్వచ్ఛ్ భారత్’ కార్యక్రమం దేనికి సంబంధించినది ( )
      ఎ. వ్యవసాయ రంగం
      బి. పరిశ్రమలు
      సి. పర్యావరణం
      డి. ఏదికాదు
    13. మినిమేటా వ్యాధి ఈ దేశంలో సంభవించింది. ( )
      ఎ. చైనా
      బి. జపాన్
      సి. కొరియా
      డి. అమెరికా
    14. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం ....................... ద్వారా జరుగును.
    15. భూమిలో అవాయు విచ్ఛిన్న క్రియ ద్వారా ఏర్పడిన ఇంధనాలను...... అంటారు.
    16. చీడపీడలను నివారించేందుకు ఉత్తమమైన పద్ధతి.....................
    17. పాదరసం కలుషితం వలన కలిగే వ్యాధి..............
    18. BOD సంక్షిప్త రూపం .......................
    19. ఓజోన్ పొర..............ఆవరణంలో ఉంటుంది.
    20. ...............ఓజోన్ పొరను పలుచన చేస్తాయి.
    21. 1999లో భారత ప్రభుత్వం..................పక్షి సంరక్షణా కేంద్రంగా ప్రకిటించింది.
    22. కొల్లేరు సరస్సు పరిరక్షణ కొరకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకం ..................
    23. రొయ్యల, చేప పెంపకమును................అంటారు.
    24. ఏదులాబాద్ వాటర్ రిజర్వాయర్ తెలంగాణాలోని.............జిల్లాలో ఉంది.
    25. పిచ్చుకలపై దాడి జరిగిన దేశం .................
    26. FAO అంతర్జాతీయ భూముల పరిరక్షణ దినోత్సవంగా ...........ను ప్రకటించింది.


    గ్రూప్-ఎ

     

    గ్రూప్-బి

    27. జీవావరణ పీరియడ్

    ( )

    ఎ. ఆహార సంబంధం

    28. శిలాజ ఇంధనం

    ( )

    బి. ఆహార జాలకంలోని ఆవాసం

    29. ఆహారపు గొలుసు

    ( )

    సి. అనేక ఆహారపు గొలుసు

    30. ఆహార జాలకం

    ( )

    డి. చార్లెస్ ఎల్టన్

    31. నిచ్

    ( )

    ఇ. పెట్రోలు

     

    ( )

    ఎఫ్. DDT



    గ్రూప్-ఎ

     

    గ్రూప్-బి

    32. కృత్రిమ ఆవరణ వ్యవస్థ

    ( )

    ఎ. భారలోహం

    33. మోనో కల్చర్

    ( )

    బి. ఎడారి.

    34. మినిమేటా

    ( )

    సి. 10% నియమము

    35. లిండేమాన్

    ( )

    డి. ఒకే రకమైన పంట

    36. కాడ్మియం

    ( )

    ఇ. మిధైల్ మెర్క్యురీ

     

    ( )

    ఎఫ్. పార్కు



    గ్రూప్-ఎ

     

    గ్రూప్-బి

    37. డయాటమ్స్

    ( )

    ఎ. ప్రాథమిక వినియోగదారు

    38. సూర్యుడు

    ( )

    బి. విచ్చిన్న కారులు p>

    39. పులి

    ( )

    సి. ఉత్పత్తి దారులు

    40. బ్యాక్టీరియాలు

    ( )

    డి. ప్రధాన శక్తి వనరు.

    41. కుందేలు

    ( )

    ఇ. ఉన్నతస్థాయి మాంసాహారి

     

    ( )

    ఎఫ్. ద్వితీయ వినియోగ దారు.



    జవాబులు:
    1)సి ; 2)డి ; 3)బి ; 4)సి ; 5)డి ; 6)డి; 7)డి ; 8)సి; 9)సి ; 10)బి ; 11)సి; 12)సి; 13)బి ; 14) ఆహార జాలకం ; 15)శిలాజాల ఇంధనాలు ;16)జైవిక నియంత్రణ ;17)మినిమేటా; 18)Biological Oxygen Demand ; 19)స్ట్రాటో ; 20) క్లోరో ఫ్లోరో కార్బన్‌లు; 21)కొల్లేరు సరస్సును ;22)ఆపరేషన్ కొల్లేరు ; 23)ఆక్వాకల్చర్ ; 24)రంగారెడ్డి ; 25)చైనా ;26)నవంబర్ 5; 27)డి ; 28)ఇ; 29)ఎ ; 30)సి ; 31)బి ; 32)ఎఫ్ ; 33)డి ; 34)ఇ ; 35)సి ; 36)ఎ ; 37)సి ; 38)డి ; 39)ఇ ; 40)బి ; 41)ఎ.
Published date : 16 Feb 2015 11:13AM

Photo Stories