Skip to main content

AP Polycet: పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్లకు నేడే ఆఖరు

Deadline for Reporting, ap polycet web options last date 2023, Polycet 2nd Counseling, Web Options,

మురళీనగర్‌: పాలిసెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో మాత్రమే హెల్ప్‌లైన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. శుక్రవారం నుంచే వెబ్‌ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభం కాగా.. శనివారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ నెల 4న సీట్లు కేటాయిస్తారు. అదే రోజు నుంచి 7వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ పత్రంతో పాటు సీటు కేటాయింపు పత్రాన్ని అందజేయాల్సి ఉంటుంది. కాగా.. ఈసెట్‌ కౌన్సెలింగ్‌ ముగిసిన నేపథ్యంలో విద్యార్థులకు గురువారం సీట్లు కేటాయించారు. వీరు ఈ నెల 4లోగా వారికి కేటాయించిన ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
 

Published date : 04 Sep 2023 09:31AM

Photo Stories