AP Polycet Web options: పాలిసెట్ వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రారంభం

మురళీనగర్: పాలిటెక్నిక్ కాలేజీల ప్రవేశానికి సంబంధించి వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. అభ్యర్థులు వారి ఇంటి నుంచే నేరుగా ఇంటర్నెట్ ద్వారా వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. అయినప్పటికీ కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, కంచరపాలెం ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు విద్యార్థులు వచ్చి.. స్థానిక సిబ్బంది సహాయంతో వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నారు. కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ కేడీవీ నరసింహారావు, గైస్‌లో ప్రిన్సిపాల్ కె.వెంకటరమణ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వెబ్ ఆప్షన్లకు గడువు ఈ నెల 14 వరకు ఉంది. 16న ఆప్షన్ల మార్పు చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు, 19 నుంచి 23వ తేదీ వరకు సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టు ఇవ్వాల్సి ఉంటుంది.
చదవండి: Web options: నేటి నుంచి పాలిటెక్నిక్ ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు