Skip to main content

Courses in Polytechnic College : పాలిటెక్నిక్ క‌ళాశాల‌లో ఆడ్ ఆన్ కోర్సులు.. ఇంజినీరింగ్, డిప్లొమా విద్యార్థుల‌కు..

కుప్పం పాలిటెక్నిక్‌ కళాశాలలో త్వరలో ఆడ్‌ ఆన్‌ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.జగన్నాథరావు శనివారం తెలిపారు.
Courses in polytechnic college for engineering and diploma and inter students

కుప్పంరూరల్‌: కుప్పం పాలిటెక్నిక్‌ కళాశాలలో త్వరలో ఆడ్‌ ఆన్‌ కోర్సులు ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ డా.జగన్నాథరావు శనివారం తెలిపారు. ఈ కోర్సుల్లో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), సాలిడ్‌ ఎడ్జ్‌ తదితర ఆధునిక సాంకేతికతతో కూడిన కోర్సులను అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. ఇంజినీరింగ్‌, డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు ఈ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Teachers Day 2024 : జిల్లాస్థాయి ఉత్త‌మ ఉపాధ్యాయుల పుర‌స్కారానికి ద‌ర‌ఖాస్తులు.. చివ‌రి తేదీ!

కోర్సులు 90 గంటలు మాత్రమే ఉంటాయని, కేవలం రూ.1500 నామమాత్రపు ఫీజుకే బోధించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్‌, వెబ్‌ డెవలప్‌మెంట్‌, ట్రైనీ బ్యూటీషియన్‌ కోర్సులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కోర్సులకు 18–35 ఏళ్ల వయసు కలిగి ఇంటర్‌ పాస్‌/ఫెయిల్‌ అయిన వారు అర్హులన్నారు. ఈ మూడు కోర్సులు ఉచితంగా అందించనున్నట్లు చెప్పారు. ఆసక్తిగల అభ్యర్థులు 25వ తేదీలోపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కో ఆర్డినేటర్‌ 9052507933 నంబరులో సంప్రదించాలని కోరారు.

Awareness Program in Agriculture : వ్య‌వ‌సాయ రంగంలో విద్యార్థుల‌కు అనుభ‌వ‌పూర్వ‌క అవ‌గాహ‌న క‌ల్పించాలి..

అదనపు వసతులకు వినతి..

అదేవిధంగా కళాశాలకు అవసరమైన వసతుల కోసం కడా పీడీకి ప్రతిపాదనలు పంపినట్లు ప్రిన్సిపాల్‌ జగన్నాథరావు చెప్పారు. కళాశాలకు అదనపు తరగతి గదులు, ల్యాబ్‌ పరికరాలు, కాంపౌండ్‌ వాల్‌, హాస్టల్‌ గదులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.

Published date : 18 Aug 2024 03:14PM

Photo Stories