AP Polycet Results : త్వరలోనే పాలిసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మే 29వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పాలీసెట్‌ను నిర్వహించిన విషయం తెల్సిందే. ఇప్పటికే పాలిసెట్-2022 ఆన్సర్ కీని కూడా ఎస్‌బీటీఈటీ విడుదల చేసింది. ఫలితాలను విడుదల చేసిన రోజే ర్యాంక్ కార్డ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని బోర్డ్ తెలిపింది. రిజిస్ట్రేషన్ వివరాలు, పుట్టిన తేదీని నమోదు చేసుకొని ఈ ఫలితాలను పొందవచ్చును. ఈ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్( www.sakshieducation.com )లో చూడొచ్చు. ఒకవేళ అర్హత మార్కులలో ఎవరికైనా సమానంగా మార్కులు వచ్చినట్లయితే మ్యాథమాటిక్స్, ఫిజిక్స్, పుట్టిన తేదీల వారీగా సరిచూసి ర్యాంకును కేటాయిస్తారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో కనీసం 25 శాతం మార్కులు పొందిన వారికి ర్యాంకులు కేటాయిస్తామని బోర్డ్ తెలిపింది. అభ్యర్థులు తమ ర్యాంక్ కార్డును https://polycetap.nic.in/ లేదా http://sbtetap.gov.in/ వెబ్‌సైట్ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Direct link for AP Polycet results 2022
1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా..
పాలీసెట్-2022 పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 404 పరీక్ష కేంద్రాలను, 52 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 1,37,371 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 1.25 లక్షల మంది విద్యార్థులు హాజరై పరీక్ష రాశారు. పరీక్ష పూర్తి అయిన కొద్ది రోజుల్లోనే ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగానే ర్యాంక్‌ను కేటాయించడం జరుగుతుందని బోర్డ్ తెలిపింది.