Written Test for SI Posts: తుది రాత పరీక్షకు ఎంపికైన ఎస్ఐ అభ్యర్థులు
సాక్షి ఎడ్యుకేషన్: రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో 18వ రోజు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో మంగళవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 922 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత వీరికి బయోమెట్రిక్, ఛాతీ, ఎత్తు కొలతలను నిర్వహించారు. అనంతరం శారీరక సా మర్థ్య పరీక్షలు నిర్వహించగా 1600 మీటర్ల పరుగులో 717 మంది, 100 మీటర్లు పరుగులో 473 మంది, లాంగ్ జంప్‌లో 541 మంది ప్రతిభను కనపరచి ఉత్తీర్ణులయ్యారు. అన్ని ఈవెంట్లలో 578 మంది అర్హత సాధించి తుది రాత పరీక్ష కు అర్హత సాధించారు.
NCC Cadets Selections: ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ
గైర్హాజరు అభ్యర్థులకు 21న అవకాశం...
ఎస్‌ఐ ఉద్యోగుల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి (ఆగస్టు 25వ తేదీ నుంచి) ఇప్పటి వరకు గైర్హాజరైన మహిళా అభ్యర్థులు, ఏదైనా సమస్య, ఇతర కారణాలతో అప్పీల్ చేసుకున్న మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 21వ తేదీన మాత్రమే హాజరు కావాలని కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ పేర్కొన్నారు.