Skip to main content

SI Achievement: ఎస్‌ఐ కొలువు కోసం కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా..!

ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలన్న పట్టుదల వీడకుండా ఉన్న ఉద్యోగానికి రాజీనామా పలికాడు. అనంతరం, ఎస్‌ఐ కొలువుకు పరీక్షను రాసేందుకు సిద్ధమయ్యాడు. ఇలా, తన గమ్యానికి చేరాడు..
GSeleted as SI Gundreddy Jagadesh  Journey to SI position    Preparation for the Police Sub-Inspector test

తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐ (సబ్‌ఇన్‌స్పెక్టర్‌) కొలువు సాధించారు గరుగుబిల్లి మండలం, పెద్దూరుకు చెందిన గుండ్రెడ్డి జగదీష్‌. ఎలాగైనా ఎస్‌ఐ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో 2019లో సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 

ఆ తర్వాత రైల్వే ఉద్యోగం సాధించి, చేసినా తృప్తి చెందలేదు. ఎస్‌ఐ జాబ్‌ కోసం రాత్రింబవళ్లు శ్రమించి, జోన్‌-2 ఎస్‌ఐ పరీక్ష ఫలితాల్లో 250 మార్కులతో 20వ ర్యాంక్‌ సాధించి, ఎస్‌ఐగా ఎంపికయ్యారు. తల్లిదండ్రులు రామినాయుడు, పార్వతిలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం జగదీష్‌ను గ్రామస్తులతో పాటు పార్వతీపురం మన్యం జిల్లా అడిషనల్‌ ఎస్పీ దిలీప్‌కిరణ్‌ అభినందించారు.

 

Published date : 25 Dec 2023 02:09PM

Photo Stories