SI Trainees: ఎస్ఐ ఉద్యోగ ఎంపికలకు దేహదారుఢ్య పరీక్షలు
Sakshi Education
ఎస్ఐ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. పరీక్షకు హాజరైనవారికి తగిన పరీక్షలను నిర్వహించి, వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. నిర్వహించిన పరీక్షల్లో జయించిన వారి సంఖ్య...
SI trainees attempting physical tests
సాక్షి ఎడ్యుకేషన్: ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్‌లో 16వ రోజు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, కర్నూలు, కడప ఎస్పీలు కృష్ణకాంత్, సిద్ధార్థ కౌశల్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ పర్యవేక్షణలో జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు శుక్రవారం 800 మందిని ఆహ్వానించగా 740 మంది హాజరయ్యారు.
వీరికి సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత బయోమెట్రిక్, ఎత్తు, ఛాతీ కొలతలను పరీక్షించారు. అనంతరం వారందరికీ శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించగా 1,600 మీటర్ల పరుగులో 601, 100 మీటర్ల పరుగులో 412 మంది, లాంగ్‌జంప్‌లో 489 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం అన్ని ఈవెంట్లలో 510 మంది అర్హత సాధించి మెయిన్స్ పరీక్షకు ఎంపికయ్యారు.