AP SI Prelims Exam 2023 : ఎస్‌ఐ ప్రిలిమినరీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ రూల్స్ పాటించాల్సిందే..
ఇందులో భాగంగా ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 19వ తేదీన (ఆదివారం) నిర్వహించనున్నారు. ప్రిలిమినరీ పరీక్షలో పేపర్–1ను ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు, పేపర్–2ను మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తారు.
1.71 లక్షల మంది అభ్యర్థులు..
ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 291 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే 1.71 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ నేపథ్యంలో రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు పోలీసు నియామక మండలి సూచనలు జారీ చేసింది.
AP ఎస్‌ఐ : స్టడీ మెటీరియల్ | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | వీడియోస్
ఎస్‌ఐ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ సూచనలు పాటించాల్సిందే..
☛ పరీక్ష రోజు గాబరా పడకుండా ఒక రోజు ముందుగానే తమ పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవాలి.
☛ పేపర్–1కు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి, పేపర్–2కు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు.
☛ హాల్‌టికెట్‌తో పాటు బ్లూ/బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తెచ్చుకోవాలి.
☛ గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డు, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు కార్డు, రేషన్ కార్డుల్లో ఏదైనా తీసుకురావాలి.
☛ మొబైల్ ఫోన్, టాబ్లెట్/ల్యాప్‌టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, లాగ్ టేబుల్, వాలెట్, పర్సు, నోట్స్, చార్ట్‌లు వంటివాటితో పాటు ఎలాంటి కాగితాలు, రికార్డింగ్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. వాటిని భద్రపరిచేందుకు పరీక్ష కేంద్రం వద్ద ఎలాంటి ఏర్పాట్లూ చేయడం లేదు.