AP Police Constable : కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రాథమిక 'కీ' విడుదల.. కొశ్చన్ పేపర్ ఇదే.. ఈ ప్రశ్నలకు మాత్రం..
రాష్ట్రవ్యాప్తంగా 997 కేంద్రాల్లో ఈ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అలాగే కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాతపరీక్ష ప్రాథమిక కీ ని కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ జనవరి 22వ తేదీ (ఆదివారం) రాత్రి 8:00 గంటలకు విడుదల చేసింది. ఈ ప్రాథమిక 'కీ' ఏమైనా అభ్యంతరాలు (objections) ఉంటే జనవరి 25వ తేదీ సాయత్రం 5:00 వరకు తెలపవచ్చును.
ఒక్కో పోస్టుకు ఎంత మంది ఉన్నారంటే..
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించారు. ప్రిలిమినరీ రాత పరీక్ష మొత్తం 200 ల మార్కులకు 3 గంటల వ్యవధి ఇచ్చారు. ఈ పోస్టులకు 5,03,487 మందికి హాల్‌టికెట్లను విడుదల చేశారు. ఈ పరీక్షకు మాత్రం 4,58,219 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అలాగే 45,268 మంది పరీక్షకు absent అయ్యారు. మొత్తం మీద పరీక్షకు 91 శాతం హాజరు నమోదైంది. అంటే ఒక్కో పోస్టుకు దాదాపు గరిష్టంగా 83 మంది పోటీపడుతున్నారు.
AP Police Constable Prelims Exam Preliminary Key Question Paper 2023 :