AP Police Jobs : సీఎం జగన్ సంచనలన నిర్ణయం.. కానిస్టేబుల్ పోస్టుల్లో వీరికి రిజర్వేషన్..
ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వ్(ఏఆర్), ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్, కానిస్టేబుళ్ల పోస్టులతోపాటు పోలీసు శాఖలో కమ్యూనికేషన్స్, ఫిట్టర్–ఎలక్ట్రీషియన్, మెకానిక్స్, డ్రైవర్ పోస్టుల నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు.
5 శాతం నుంచి 25% వరకు ..
సివిల్, ఏఆర్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు వర్తింపజేశారు. ఏపీఎస్పీ, ఎస్‌ఏఆర్ సీపీఎల్, ఫిట్టర్ ఎల్రక్టీషియన్, మెకానిక్స్, డ్రైవర్ కేటగిరీల్లో పురుష కానిస్టేబుల్ పోస్టులే భర్తీ చేస్తారు. కాబట్టి ఆ విభాగాల పోస్టుల భర్తీలో పురుష హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించారు. కానిస్టేబుల్ నియామకాల్లో కేటగిరీలవారీగా 5 శాతం నుంచి 25% వరకు హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం.ఈమేరకు ‘ఆంధ్రప్రదేశ్ పోలీస్ రూల్స్ 1999’కి సవరణ చేస్తూ హోంశాఖ ఉత్తర్వులిచ్చింది. ఇక నుంచి కానిస్టేబుల్ నియామకాల్లో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తారు. త్వరలో 6,511 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్న తరుణంలో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. దీనివల్ల రాష్ట్రంలో 15 వేల మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది.
Competitive Exams: కోచింగ్ తీసుకోకుండా గ్రూప్స్, ఎస్‌ఐ తదితర పరీక్షల్లో విజయం సాధ్యమా..? కాదా..?
హోంగార్డులకు ముఖ్యమంత్రి వరం ఇదే..
హోంగార్డులకు ప్రయోజనం కలిగిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తగిన సమయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీర్ఘకాలంగా పని చేస్తున్నప్పటికీ పోలీసు శాఖలో హోంగార్డులు తగిన గుర్తింపునకు నోచుకోలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హోంగార్డుల జీతాలు పెంచింది. అప్పటివరకు నెలకు రూ.18 వేలు మాత్రమే ఉన్న హోంగార్డుల జీతాన్ని రూ.21,300కి పెంచుతూ 2019 అక్టోబరులో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు వారికి మరింత మేలు చేకూరుస్తూ కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పోలీసు నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది. అంతకంటే ముందే హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం చట్ట సవరణ చేయడం వారికి వరంగా మారనుంది.
Gandrathi Satish, SI: ఇంటర్, డిగ్రీలో ఫెయిల్..ఈ కసితోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టానిలా..
6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్..
ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈమేరకు పోలీసు శాఖ రూపొందించిన నియామక ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించింది. మొదటి దశ కింద ఈ ఏడాది 6,511 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ను ఖరారు చేసింది.
GK & Current Affairs: పోలీసు ఉద్యోగాల రాతపరీక్షలో.. కరెంట్ అఫైర్స్, జీకే పాత్ర..
దరఖాస్తు ప్రక్రియ ఇలా..
డిసెంబర్ నాటికి దరఖాస్తుల స్వీకరణ, స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేయనుంది. 2023 ఫిబ్రవరిలో రాత పరీక్ష, అనంతరం దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించి ఫలితాలు ప్రకటించనుంది. ఎంపికైన అభ్యర్థులకు 2023 జూన్‌లో పోలీసు శిక్షణ ప్రారంభించి 2024 ఫిబ్రవరి నాటికి వారికి పోలీసు శాఖలో పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.
Inspiring Story: నేను ఎస్‌ఐ అయ్యానిలా.. అమ్మ కూలి పనులు చేస్తూ..
అత్యధిక ఉద్యోగాలు ఈ విభాగంలోనే..
రిజర్వ్ విభాగంలో 96 ఎస్సై పోస్టులను, అలాగే సివిల్ విభాగంలో 315 ఎస్సై పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ విభాగంలో 2520 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. అలాగే సివిల్ విభాగంలో 3580 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 6511 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఒకే సారి ఇచ్చే అవకాశం ఉంది. అత్యధికంగా సివిల్ విభాగంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కొన్నేళ్లుగా పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది నిరుద్యోగులకు త్వరలోనే ఊరట లభించనున్నది.
Madhavi, CI : పొట్టకూటి కోసమే ఈ పోలీసు ఉద్యోగంలో చేరా.. కానీ