SI Main Exam: ఎస్‌ఐ మెయిన్ పరీక్షకు అభ్యర్థుల ఎంపిక.. పూర్తి వివరాలు ఇవే..
కర్నూలు: రాయలసీమ జోన్‌కు సంబంధించి ఎస్‌ఐ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష, మహిళా అభ్యర్థులకు కర్నూలు ఏపీఎస్పీ రెండవ పటాలంలో 20వ రోజు దేహదారుఢ్య పరీక్షలు జరిగాయి. కర్నూలు రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్, ఎస్పీ కృష్ణకాంత్, సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ప్రొద్దుటూరు ఏఎస్పీ ప్రేరణకుమార్ పర్యవేక్షణలో గురువారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 855 మంది పురుష అభ్యర్థులు, 231 మంది మహిళా అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత బయోమెట్రిక్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్టులు నిర్వహించారు. అనంతరం శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించగా 1,600 మీటర్ల పరుగులో 662 మంది, 100 మీటర్ల పరుగులో 290 మంది, లాంగ్‌జంప్‌లో 454 మంది ప్రతిభ కనపరచి అర్హత సాధించారు. అన్ని ఈవెంట్లలో ప్రతిభను కనపరచి 487 మంది అభ్యర్థులు ఎస్‌ఐ మెయిన్ పరీక్షకు అర్హత సాధించారు.
చదవండి: Digital Training: టీచర్లు, విద్యార్థులకు డిజిటల్ శిక్షణ