Skip to main content

SI Exam: పరీక్షకు 1.51లక్షల మంది హాజరు.. ‘ప్రాథమిక కీ’ విడుదల

సాక్షి, అమరావతి: ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
SI Exam
పరీక్షకు 1.51లక్షల మంది హాజరు.. ‘ప్రాథమిక కీ’ విడుదల

మొత్తం 411 ఎస్‌ఐ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 నగరాలు, పట్టణాల్లోని 292 కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షకు 1,51,243 మంది హాజరయ్యారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పేపర్‌–2 పరీక్ష నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ‘ప్రాథమిక కీ’ని ఫిబ్రవరి 20 ఉదయం 11గంటలకు చేశారు.

చదవండి: Inspiring Story : శెభాష్‌.. ఇద్దరు ఇద్ద‌రే.. ఒకేసారి మహిళా డీజీపీలుగా..

అభ్యర్థులు ఆ ప్రాథమిక ‘కీ’ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రాథమిక కీ’పై అభ్యంతరాలు ఉంటే ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11గంటలలోపు తమకు మెయిల్‌ ద్వారా తెలియజేయవచ్చని తెలిపింది. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన నిర్ణీత ఫార్మాట్‌లోనే అభ్యంతరాలను తమకు మెయిల్‌ చేయాలని కూడా పేర్కొంది. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో వెల్లడిస్తామని, అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్‌ కాపీలు కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని పోలీసు నియామక మండలి వెల్లడించింది. 

  • ప్రాథమిక కీ డౌన్‌లోడ్‌ చేసుకోడానికి వెబ్‌సైట్‌:  slprb.ap.gov.in
  • ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్‌లో పంపాల్సిన మెయిల్‌ ఐడీ:   SCTSI&PWT@slprb.appolice.gov.in

చదవండి: Success Story : ఖాకీ వ‌నంలో తుల‌సి మొక్క‌.. ఈమె పోలీస్‌ వృత్తితో పాటు..

 AP SI Prelims Question Paper with Official Key 2023 (Held on 19.02.2023) - Paper 1 Paper 2

Published date : 20 Feb 2023 01:55PM

Photo Stories