పరీక్షల వేళ జాగ్రత్తలు తీసుకోండి: కమిషనర్
Sakshi Education
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న సమయంలో కాలేజీల యాజమాన్యాలు, విద్యార్థులు కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కోరారు.
ఈ మేరకు కమిషనర్ కాటమనేని భాస్కర్ ఓ ప్రకటన జారీ చేశారు. పరీక్ష హాలులోనూ, కళాశాల క్యాంపస్‌లోనూ, ఇతర బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రతి విద్యార్థి మాస్కు విధిగా ధరించాలని, కనీసం ఆరు అడుగుల భౌతిక దూరాన్ని పాటించాలని కోరారు. కాలేజీలో ఉన్నంత సేపూ తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, పరీక్ష హాలులో నుంచి బయటకు వచ్చేటప్పుడు భౌతిక దూరం పాటించాలన్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటించే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు వారిని చైతన్య పరచాలని కోరారు. నిబంధనలు పాటించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు శ్రద్ధ వహించాలని కోరారు.
Published date : 17 Sep 2021 12:38PM