Skip to main content

Inter board: ఇంటర్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయ ఆధునికీకరణ.. నాడు–నేడుతో విప్లవాత్మక మార్పులు

Modernization of Interboard Regional Office

గుంటూరు ఎడ్యుకేషన్‌: శిథిల భవనాలు, పెచ్చులూడి పడుతున్న సీలింగ్‌, గతుకులమయంగా ఉండే ఫ్లోరింగ్‌, టాయిలెట్‌కు వెళ్లాలంటే దుర్గంధంతో ముక్కు మూసుకోవాల్సిన దుస్థితి. ఇవి గత ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ కళాశాలల్లో నిత్యకృత్యమైన పరిస్థితి. అభివృద్ధి అనేది మచ్చుకై నా కనిపించకుండా దశాబ్దాల తరబడి కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విద్యారంగ స్వరూపాన్ని సమూలంగా మార్చివేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు ప్రారంభించారు. ఆయన చొరవతో ప్రభుత్వ కళాశాలలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి.

నాడు–నేడుతో విప్లవాత్మక మార్పులు
ఒకనాడు వసతుల లేమితో ప్రవేశాలు కరువై దీనావస్థలో ఉన్న గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి పుణ్యమాని ఆధునిక వసతుల్ని సంతరించుకుంది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్ని కలలో సైతం ఊహించని విధంగా ఆధునికంగా తీర్చిదిద్దిన ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల రూపురేఖల్ని మార్చి వేసింది. గుంటూరు నగర నడిబొడ్డున సాంబశివపేటలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల చరిత్రలో ఎన్నడూ చూడని రీతిలో ఆధునిక హంగుల్ని సంతరించుకుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాస్థాయిలో అత్యధికంగా 1,100 మంది విద్యార్థినులతో కొనసాగుతున్న అతిపెద్ద ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు ప్రత్యేకంగా బాలికల కోసం ఉన్న ఏకై క కళాశాల సైతం ఇదే కావడం విశేషం.
ఉమ్మడి గుంటూరు జిల్లా నలుమూలల నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థినులు ఇక్కడ చదువుకుంటున్నారు. మౌలిక వసతుల కల్పన ఊసే లేకుండా దశాబ్దాల తరబడి కొనసాగిన కళాశాల రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిన ఫలితంగా నాడు–నేడు రెండో దశలో ఆధునికీకరణ బాట పట్టింది.

రూ.1.32 కోట్లతో ఆధునికీకరణ
నాడు–నేడు ద్వారా మంజూరు చేసిన 1.32 కోట్లతో కళాశాలలో అభివృద్ధి పనుల్ని చేపట్టారు. తరగతి గదుల ఆధునికీకరణ, విద్యుద్దీకరణ, సీలింగ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేయడంతో పాటు సాధారణ గచ్చుస్థానంలో గ్రానైట్‌తో ఫ్లోరింగ్‌, విద్యార్ధినుల సంఖ్యకు అనుగుణంగా రెండస్తుల్లో 42 టాయిలెట్లతో కూడిన బ్లాక్‌ నిర్మించారు. సురక్షితమైన తాగునీటిని అందించేందుకు మూడు ఆర్వో మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఏ చిన్న సదుపాయం కల్పించాలన్నా దాతల సహకారంపై ఆధారపడి దశాబ్దాల తరబడి కళాశాలను నడుపుతున్న అధ్యాపక బృందం ఇక ఎవ్వరి అవసరం లేకుండా విద్యార్థినులకు అవసరమైన సకల వసతుల్ని కల్పించింది.

నాడు–నేడు ద్వారా రూ.1.32 కోట్ల వ్యయంతో గుంటూరులోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఆధునికీకరణ ఇంటర్మీడియెట్‌ విద్యకు మహర్దశ 1,100 మంది విద్యార్థినులతో ఉమ్మడి జిల్లాస్థాయిలో ఇదే అతిపెద్ద కళాశాల నాడు–నేడు ద్వారా ఆధునిక వసతుల కల్పన తరగతి గదుల విద్యుద్దీకరణ, గ్రానైట్‌తో ఫ్లోరింగ్‌, మినరల్‌ వాటర్‌ ప్లాంటు ఏర్పాటు విద్యార్థినుల సంఖ్యకు అనుగుణంగా 42 టాయిలెట్లతో బ్లాక్‌ నిర్మాణం

విద్యార్థులకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు
గతంలో వసతుల లేమితో కొట్టుమిట్టాడిన కళాశాల ప్రస్తుతం ఆధునిక హంగులతో అభివృద్ధికి నోచుకుంది. నాడు–నేడు ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో కళాశాలలో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించాం. తరగతి గదుల్ని పటిష్టపరచి, విద్యుద్దీకరణ సదుపాయంతో పాటు ఎల్‌ఈడీ లైట్లు, సీలింగ్‌ ఫ్యాన్లు, టాయిలెట్లలో బ్రాండెడ్‌ శానిటరీ సామగ్రి ఏర్పాటు చేశాం. గ్రానైట్‌తో ఫ్లోరింగ్‌తో పాటు సురక్షితమైన తాగునీటి కోసం మూడు ఆర్వో వాటర్‌ ప్లాంట్లను ప్రభుత్వం సరఫరా చేసింది.

గర్నెపూడి సునీత, ప్రిన్సిపాల్‌
గుంటూరు సాంబశివపేటలోని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని సైతం ప్రభుత్వం ఆధునికీరించింది. ఆర్‌ఐవో కార్యాలయంతో పాటు డీవీఈవో, ఆర్జేడీ కార్యాలయాలు ఇదే భవనంలో ఉన్నాయి. ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఫ్లోరింగ్‌, భవన పట్టుత్వాన్ని పరిరక్షించే విధంగా ప్యాచ్‌ వర్క్‌లు, టాయిలెట్ల నిర్మాణ పనులతో పాటు పెయింటింగ్‌తో ఆహ్లాదకరంగా మారింది. దశాబ్దాల తరబడి వసతుల లేమితో కొట్టుమిట్టాడిన ఆర్‌ఐవో, ఆర్జేడీ, డీవీఈవో కార్యాలయాల భవన సముదాయం ప్రభుత్వం చొరవతో ఆధునికీకరణకు నోచుకుంది.

Published date : 15 Mar 2024 03:00PM

Photo Stories