Govt Junior College: మా కళాశాలలో చేరండి.. ఉన్నత భవిత పొందండి
ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తాం’ అంటూ రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ప్రచారం చేస్తుండడం ఆకట్టుకుంటోంది. 2024–25 విద్యా సంవత్సరంలో అడ్మిషన ్ల సంఖ్య పెంచుకోవడంలో భాగంగా అధ్యాపకులు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం పట్టణంలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్న 6 కేంద్రాల వద్దకు వెళ్లి విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేశారు.
చదవండి: After Inter Best Courses : ఇంటర్ తర్వాత.. బెస్ట్ కోర్సులు ఇవే..! ఈ కోర్సుల్లో జాయిన్ అయితే..
చాక్లెట్లు సైతం పంపిణీ చేసి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరేష్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రైవేటు కళాశాలల వైపు దృష్టి సారించకుండా ఉండడానికి ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గతానికి, ప్రస్తుతానికి ప్రభుత్వ కళాశాలల్లో వసతులు మెరుగయ్యాయని, అధ్యాపకులు సంఖ్య కూడా పెరిగిందన్నారు. హాస్టల్ వసతి, దూరప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం, రోజూ స్టడీ అవర్స్ తదితర సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తమ కళాశాలలో చేరి భవితకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.