Intermediate Practical Exams 2024 : ఇంటర్ ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్/ ఆత్మకూరు: ఇంటర్ ఒకేషనల్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు 594 మంది విద్యార్థులకు గాను 572 మంది హాజరయ్యారు. 22 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 345 మంది విద్యార్థులకు గాను 334 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం విడతలో 245 మంది విద్యార్థులకు గాను 238 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తగా ఎక్కడా ఎలాంటి సమస్య తలెత్తకుండా ప్రశాంతగా జరిగాయని ఇంటర్ పరీక్షల జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ తెలిపారు. ఆత్మకూరు కేజీబీవీని వెంకటరమణనాయక్, డీఈసీ సభ్యుడు శంకరయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ వెంకటరమణనాయక్ మీడియాతో మాట్లాడుతూ ఒకేషనల్ విద్యార్థులకు 20వ తేదీ వరకు పరీక్షలు కొనసాగుతాయన్నారు. జనరల్ పరీక్షలు 11వ తేదీ నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.
Also Read: JEE Mains Session 2 Notification 2024
జిల్లాలో 142 కళాశాలలు ఉన్నాయని, అందులో 70 కళాశాలల్లో జనరల్ పరీక్షలు, 20 కళాశాలల్లో ఒకేషనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఫస్టియర్ జనరల్ పరీక్షలకు 22,378 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలు 2,068 మంది విద్యార్థులు రాస్తున్నారన్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ పరీక్షలు 15,992 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలు 1,118 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని చెప్పారు. అనంతరం ప్రిన్సిపాల్ శంకరయ్యతో కలిసి ‘నాడు– నేడు’ పనులను పరిశీలించారు.