Skip to main content

Inter: ఇంటర్‌ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లు భేష్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిర్వహిస్తున్న ఇంట ర్మీడియెట్‌ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లు బేషుగ్గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ, మానిటరింగ్‌ కమిషన్, ఎడ్యుకేషన్ రీఫామ్‌ కమిషన్ సభ్యుడు జస్టిస్‌ బి.ఈశ్వరయ్య అన్నారు.
Inter
ఇంటర్‌ అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఏర్పాట్లు భేష్‌

ఇంటర్‌ పరీక్షల నిర్వహణ తీరును సెప్టెంబర్‌ 17న ఆయన జిల్లాలోని పలు కేంద్రాల్లో పరిశీలించారు. విజయవాడలోని సిద్ధార్థ మహిళా కళాశాల, నారాయణ, చైతన్య తదితర కాలేజీలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. కేంద్రాల వద్దకు విద్యార్థులతో సహాయకులుగా వచి్చన వారితో కూడా మాట్లాడి, పరీక్షల నిర్వహణపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ కోవిడ్‌ కారణంగా పరీక్షలు రద్దు చేసి, విద్యార్థులందరినీ ఉత్తీర్ణులను చేసిన ప్రభుత్వం, వారికి మరింత మేలు చేకూర్చేలా అడ్వాన్స్ డ్‌ సప్లిమెంటరీ నిర్వహించటమనేది దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్‌ కోసమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందన్నారు. ప్రతీ కేంద్రంలో థర్మల్‌ స్క్రీనింగ్, విద్యార్థులంతా మాస్కులు ధరించేలా చూడటం బాగుందన్నారు. కోవిడ్‌ అనుమానితుల కోసమని ప్రత్యేకంగా కేంద్రాల్లో ఐసోలేషన్ గదులను ఏర్పాటు అభినందనీయమన్నారు. పరీక్షల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా మంచి స్పందన లభించిందన్నారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఆయన వెంట ఇంటరీ్మడియెట్‌ బోర్డు జిల్లా పర్యవేక్షణ అధికారి పి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

చదవండి: 

పరీక్షల వేళ జాగ్రత్తలు తీసుకోండి: కమిషనర్

Students: 273 మంది విద్యార్థులకు గాను ఒక్కరే హాజరయ్యారు!

Published date : 18 Sep 2021 01:12PM

Photo Stories