Students: 273 మంది విద్యార్థులకు గాను ఒక్కరే హాజరయ్యారు!
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని రెండు కళాశాలల్లో ఇంటర్ ద్వితీయ తెలుగు పరీక్షకు ఒక్కొక్క విద్యార్థిని మాత్రమే హాజరయ్యారు.
వీరఘట్టం ప్రభుత్వ జూనియర్ కళాశాల, రాజాం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సెప్టెంబర్ 15న జరిగిన తెలుగు పరీక్షకు ఒక్కొక్కరు మాత్రమే హాజరు కావడంతో అధికారులు అవాక్కయ్యారు. వీరఘట్టం కళాశాలలో మొత్తం 274 మంది విద్యార్థులకు 273 మంది గైర్హాజరు అయ్యారు. అలాగే రాజాం కళాశాలలో మొత్తం 270 మంది హాజరు కావాల్సి ఉండగా.. 269మంది గైర్హాజరయ్యారు. కాగా, వీరఘట్టం కళాశాలలో పరీక్ష కోసం 14 గదులను సిద్ధం చేశారు. పరీక్షలను పర్యవేక్షించేందుకు చీఫ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ చీఫ్ డిపార్ట్‌మెంట్ అధికారులతో పాటు ముగ్గురు స్క్వాడ్ అధికారులు వచ్చారు.
Published date : 16 Sep 2021 03:41PM