Skip to main content

AP Inter Supplementary Exams Dates: ఏపీ ఇంట‌ర్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్‌: ఇంటర్మీడియట్‌ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ జూన్ 22వ తేదీన విడుద‌ల చేశారు.
AP Inter Supplementary Exams
AP Inter Supplementary Exams 2022

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆగస్ట్‌ 3 నుంచి 12వ తేదీ వ‌ర‌కు సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ‌ని తెలిపారు. అలాగే ఈ సప్లిమెంటరీ ప‌రీక్ష‌లను ఉద‌యం 9:00 నుంచి 12:00 వ‌ర‌కు , మ‌ధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వ‌రకు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఈ ప‌రీక్ష‌లు రెండు సెషన్స్‌లో జరుగనున్నాయ‌న్నారు. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం 2022 ఆగస్ట్ 17 నుంచి ఆగస్ట్ 22 మధ్య జరుగనున్నాయి. సప్లిమెంటరీ పరీక్షకు 2022 జూలై 8లోగా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

ఉత్తీర్ణ‌త‌తో టాప్‌ జిల్లా ఇదే.. లాస్ట్ జిల్లా మాత్రం..
ఇంట‌ర్ ఫస్ట్‌ ఇయర్‌లో  4,45,604 రాస్తే 2,41,591 మంది అంటే 54 శాతం ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంట‌ర్‌ సెకండియర్‌లో 4,23,455 మంది రాస్తే.. 2,58,449 మంది పాస్‌ అయ్యారు.. అంటే 61 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సారి ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాల్లో బాలికలదే పైచేయి. రాష్ట్ర‌వాప్తంగా ఇంట‌ర్ ఫ‌లితాల్లో కృష్ణా జిల్లా 75 శాతం ఉత్తీర్ణ‌త‌తో టాప్‌గా నిల‌వ‌గా.. వైఎస్సార్ జిల్లా 55శాతం ఉత్తీర్ణ‌త‌తో చివ‌రి స్థానంలో నిలిచింది. ఇంట‌ర్ మొద‌టి సంవ‌త్స‌రం బాలురు 49శాతం మంది పాస్ అవ్వ‌గా.., బాలిక‌లు 60 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. అలాగే రెండో సంవ‌త్స‌రంలో  బాలురు 54 ఉత్తీర్ణ‌త‌ సాధించ‌గా.. బాలిక‌లు 68 శాతం మంది పాస్ అయ్యారు.

Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

రీకౌంటింగ్‌కు చివ‌రి తేదీ ఇదే..
ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు జూన్‌ 25 నుంచి జులై 5 వరకు రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం.

☛ AP Intermediate First Year Results 2022 (General) (Click Here)

☛ AP Intermediate Second Year Results 2022 (General) (Click Here)

 

➤ AP Intermediate First Year Results 2022 (Vocational) (Click Here)

➤ AP Intermediate Second Year Results 2022 (Vocational) (Click Here)

Published date : 22 Jun 2022 06:10PM

Photo Stories