Skip to main content

AP Inter Exams : ఏపీ ఇంట‌ర్ ప‌రీక్ష‌ల తేదీలు మార్పు.. కొత్త తేదీలు ఇవే.. ప్రాక్టికల్స్ మాత్రం..

సాక్షి, ఎడ్యుకేష‌న్ : ఇంటర్‌ పరీక్షలకు కొత్త తేదీలను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ విద్యాశాఖ ప్రకటించింది.
Adimulapu Suresh
Adimulapu Suresh

జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్‌ పరీక్షల షెడ్యూలు ప్రభావం రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ పరీక్షలపై పడటంతో తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్‌ 22 నుంచి పరీక్షలు మొదలై మే 12 వరకు జరుగుతాయి. 

​​​​​​​ఇంట ర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

జేఈఈ మెయిన్ కోసం..
ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ఏప్రిల్‌ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్‌ పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం.. కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ కొత్త తేదీలను ప్రకటించారు.

ఇంట ర్మీడియెట్ స్టడీ మెటీరియల్

ఇంటర్‌ ప్రాక్టికల్స్ మాత్రం..
మరోవైపు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే(మార్చి 11 నుంచి మార్చి 31వరకు) జరుగుతాయని మంత్రి సురేశ్‌ తెలిపారు. 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి స‌మ‌స్య‌లు లేవని మంత్రి చెప్పారు.

ఇంట ర్మీడియెట్ మోడల్ పేపర్స్

ఈ అభిప్రాయంతోనే మార్పు..
జేఈఈ తొలి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో జరుగుతాయి. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఇంటర్మీడియెట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28వ తేదీవరకు జరుగుతాయి. వీటిలో ఇంటర్ సెకండియర్ ఇయ‌ర్‌ సంబంధించి 16న మేథమెటిక్స్ పేపర్–2ఏ, బోటనీ పేపర్–2, సివిక్స్ పేపర్–2, 19న మేథమెటిక్స్ పేపర్–2బీ, జువాలజీ పేపర్–2, హిస్టరీ పేపర్–2, 21న ఫిజిక్సు పేపర్–2, ఎకనమిక్స్ పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. ఇవే తేదీల్లో జేఈఈ పరీక్షలు వచ్చాయి. ఈ మూడు రోజుల ఇంటర్ పరీక్షలను వేరే తేదీల్లో నిర్వహించడంపై సమీక్షలో చర్చించారు. దీనివల్ల పరీక్షల మధ్యలో అంతరాయం కలిగి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇంటర్, జేఈఈ రెండింటినీ సమర్థంగా రాయలేరన్న అభిప్రాయం వ్యక్తమైంది.

కొత్త ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

AP Inter 1st Year Exams 2022 Time Table :

AP Inter 2nd Year Exams 2022 Time Table :

​​​​​​​​​​​​​​ఇంటర్మీడియట్ సిల‌బ‌స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, మోడ‌ల్ పేప‌ర్స్‌, స్ట‌డీమెటీరియ‌ల్ మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 03 Mar 2022 06:59PM

Photo Stories