Skip to main content

Intermediate: ప్రాక్టికల్స్ షెడ్యూల్.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
Intermediate
ప్రాక్టికల్స్ షెడ్యూల్..

ఈ మేరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఇంటరీ్మడియెట్‌ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరిబాబు ప్రకటన విడుదల చేశారు. ఏప్రిల్‌ 7వ తేదీ వరకు ఈ ప్రాక్టికల్స్‌ కొనసాగనున్నాయి. ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు జరిగేలా ఇంతకు ముందు షెడ్యూల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. జంబ్లింగ్‌ విధానంలో ఈ పరీక్షలు నిర్వహించేలా ఉత్తర్వులు ఇచ్చారు. వీటిని న్యాయస్థానం కొట్టి వేసి జంబ్లింగ్‌ విధానాన్ని రద్దు చేసింది. దీంతో 11 నుంచి జరగాల్సిన పరీక్షలను బోర్డు వాయిదా వేయాల్సి వచ్చింది. తాజాగా 16వ తేదీ నుంచి ఈ ప్రాక్టికల్స్‌ నిర్వహించేలా కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. హాల్‌ టికెట్లను నేటి నుంచి(14వ తేదీ) డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఇంటర్‌ బోర్డు కల్పించింది.

AP Inter Second Year General Practical Hall Tickets 2022

చదవండి: 

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్

​​​​​​​ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

​​​​​​​Practicals : ఇంటి నుంచే ‘ప్రాక్టికల్స్‌’..వీళ్ల‌కు మాత్ర‌మే..

ఇంటర్ ప్రాక్టికల్స్‌లో మాల్ ప్రాక్టీసులను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు

ప్రాక్టికల్స్‌కు జంబ్లింగ్‌ వద్దు

ఇంటర్‌ రెండో సంవత్సరం ప్రాక్టికల్స్‌ పరీక్షలు జంబ్లింగ్‌ విధానంలో నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ ఇంటరీ్మడియెట్‌ బోర్డు ఈ మార్చి 3న జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ అమలును హైకోర్టు నిలిపివేసింది.
ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఇంటర్‌ బోర్డును ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్‌ 7కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ మార్చి 10న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పాత విధానంలోనే ఏ కాలేజి విద్యార్థులకు ఆ కాలేజీలోనే ప్రాక్టికల్స్‌ నిర్వహించవచ్చని మౌఖికంగా స్పష్టంచేశారు. విద్యార్థులు, విద్యా సంస్థల ప్రయోజనాలను పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. పాత విధానాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతారని వివరించారు. పాత విధానాన్ని మార్చడానికి అధికారులు ఎలాంటి సహేతుక కారణాలు చూపలేదని న్యాయమూర్తి ఆక్షేపించారు. ఇంటర్‌ బోర్డు ప్రొసీడింగ్స్‌ను సవాలు చేస్తూ అఫిలియేటెడ్‌ ప్రైవేటు జూనియర్‌ కాలేజీల యాజమాన్యాల సంఘం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది.

చదవండి: 

​​​​​​​Department of Education: ఇతర రాష్ట్రాలకు మన ‘పాఠాలు’

TISS: సాంకేతిక బోధనపై టీచర్లకు శిక్షణ

KTR: విద్యార్థినులకు కేటీఆర్ సాయం

Published date : 14 Mar 2022 02:54PM

Photo Stories