Skip to main content

Junior College Admissions: బాలికల కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. తేదీ విడుదల..!

రెండు జూనియర్‌ కళాశాలల్లో ప్రకటించిన తేదీలోగా దరఖాస్తులు చేసుకొని ప్రవేశ పరీక్షలు రాయాలని తెలిపారు పాఠశాల ప్రిన్సిపాల్‌. దరఖాస్తు వివరాలు..
Announcement   Admissions for tribal welfare girls junior college date announced   Kadiri and Tanakallu Tribal Welfare Girls Junior Colleges

గోరంట్ల: కదిరి, తనకల్లు గిరిజన సంక్షేమ బాలికల జూనియర్‌ కళాశాలల్లో 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని గోరంట్ల గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల ప్రిన్సిపాల్‌ వెంకట్రామనాయుడు తెలిపారు. ఈ నెల 25 తేదీలోపు www.aptgurkulam.ap.gov.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Gurukula school Admissions: గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

పై రెండు జూనియర్‌ కళాశాలల్లో 80 సీట్లు ఉన్నాయన్నారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులకు ఏప్రిల్‌ ఏడో తేదీన తనకల్లు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఎంపికైన అమ్మాయిలకు ఇంటర్‌ సిలబస్‌తో పాటు ఐఐటీ, నీట్‌కు కోచింగ్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 83090 05097 నంబర్‌లో సంప్రదించాలన్నారు.

Free training in beautician and fashion designing: బ్యూటీషియన్‌, ఫ్యాషన్‌ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ

Published date : 06 Mar 2024 11:14AM

Photo Stories