AP EAPCET-2022 : సెప్టెంబర్ 13 నుంచి ‘ఈఏపీ సెట్’ వెబ్ ఆప్షన్లు
Sakshi Education
ఏపీ ఈఏపీ సెట్ (ఎంపీసీ విభాగం) కౌన్సెలింగ్ ప్రక్రియలో వెబ్ ఆప్షన్ల నమోదు సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
AP EAPCET Web Counselling
ఈ నేపథ్యంలో ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరడానికి విద్యార్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేయొచ్చు. ఈ మేరకు కన్వీనర్ సి.నాగరాణి షెడ్యూల్ విడుదల చేశారు.
ఈఏపీ సెట్‌లో 1వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు విద్యార్థులు ఈ నెల 17 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేయొచ్చు. ఆప్షన్ల నమోదులో మార్పులు చేర్పులకు ఈ నెల 18న అవకాశం ఉంది. 22న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందినవారు సెల్ఫ్ రిపోర్టింగ్‌తోపాటు ఆయా కాలేజీల్లో ఈ నెల 23 నుంచి 27లోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 26 నుంచి కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయి.