Skip to main content

4 విసర్జన- వ్యర్థపదార్థాల తొలగింపు వ్యవస్థ

Tenth Classక్విక్ రివ్యూ
క్రియాటిన్:
నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థం. ఇది విసర్జన క్రియలో బయటికి పంపించబడుతుంది.

క్రియాటినిన్: ఇది రక్తము మరియు మూత్రములో ఉన్న నత్రజని సంబంధితవ్యర్థి పదార్థము

సమీపస్థ సంవళిత నాళం: ఇది వృక్క నాళికలోని మొదటి భాగం. మూత్రంలోని వ్యర్థ పదార్థాలు భౌమన్ గుళిక నుండి సమీప సంవళిత నాళికను చేరగానే దానిలోని ఉపకళా కణాలు అవసరమైన పదార్థాలను ‘వరణాత్మక పునఃశోషణం’’ చేసి వాటిని తిరిగి రక్తంలోకి చేరుస్తాయి.

దూరస్థ సంవళిత నాళం: ఇది వృక్క నాళికలోని చివరి భాగం ఇది సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది.

అభివాహి ధమని: ఇది వృక్కధమని శాఖ. రక్తం దీని నుండి రక్తకేశనాళికా గుచ్చంలోకి ప్రవహిస్తుంది.

అపవాహి ధమని: ఇది రక్తకేశ నాళికా గుచ్ఛం నుండి ఏర్పడుతుంది. ఇది అభివాహి ధమని కంటే చిన్నగా ఉండడం వల్ల వ్యర్థం పదార్థాల వడపోత సాధ్యమవుతుంది. దీని నుండి ఏర్పడిన రక్తకేశనాళికలన్నీ కలిసి వృక్కసిరగా మారతాయి.

కేలిసిస్: మూత్రపిండం యొక్క దవ్వలో 9 నుండి 12 వరకు బోర్లించిన సూచీ స్తంబాల లాంటి నిర్ణాణాలు ఉంటాయి. ఇవి పుష్పంలోని రక్షక పత్రాల (Calyx) వలె ఉండడం వల్ల ఈ నిర్మాణాన్ని కేలిసిస్ అంటారు.

మూత్రనాళికలు: మూత్ర నాళికలు(Nephrons) మూత్రపిండాల యొక్క నిర్ణాణాత్మక మరియు క్రియాత్మ ప్రమాణాలు. ప్రతి మూత్రపిండంలో సుమారు 10 మిలియన్ల మూత్రనాళికలు ఉంటాయి.

హీమో డయాలిసిస్: మూత్రపిండాలు పనిచేయని వారిలో కృత్రిమంగా డయాలిలిస్ యంత్రం ‘డయలైజర్’ తో రక్తాన్ని వడకడతారు. ఇలా కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ‘హీమో డయాలసిస్’ అంటారు.

ESRD : మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ESRD (End Stage Renal Disease)అంటారు. మూత్ర పిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండి పోతాయి. ఈ స్థితిని ‘యురేమియ’ అంటారు. కాళ్ళు, చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధికకపోవడం వలన నీరసం, అలసట వస్తాయి.

మూత్రపిండ మార్పిడి: మూత్రపిండాలు పనిచేయని వారికి శాశ్వత పరిష్కారం చూపే ప్రక్రియనే మూత్రపిండమార్పిడి అంటారు. వీరికి అవసరమైన మూత్రపిండం దగ్గరి బంధువు (ధాత) నుండి స్వీకరించాల్సి ఉంటుంది. పాడైన మూత్రపిండమునకు దిగువగా, మూత్రాశయానికి కొంచెం ఎగువగా దాత మూత్ర పిండమును అమర్చుతారు.

ఆల్కలాయిడ్స్: నత్రజనితో కూడిన ఉప ఉత్పన్నాలు. ఇవి మొక్కలకు విషపూరితమైనవి. అయినప్పటికీ ఇవి మానవునికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి.

జీవ ఇంధనం: మొక్కల నుండి వచ్చే ఇంధనాలను ‘జీవ ఇంధనాలు అంటారు. ఉదా॥జట్రోపా మొక్క నుండి బయోడీజిల్ తయారు చేస్తారు.

 

 

 

4 విసర్జన- వ్యర్థపదార్థాల తొలగింపు వ్యవస్థ


విసర్జనలో ముఖ్యాంశాలు:
‘‘శరీరంలో ఏర్పడిన నిరుపయోగమైన వ్యర్థాలను బయటకు తొలగించబడడాన్ని ‘విసర్జన’ అంటారు.
శక్తి అవసరాలకు జీవులు ‘కిరణజన్య సంయోగక్రియపై ఎలా ఆధారపడతాయో, శరీరంలో ఏర్పడే అనవసర వ్యర్థాల తొలగింపుకోసం విసర్జన క్రియపై కూడా అంతే స్థాయిలో ఆధారపడతాయి.

విసర్జనలో ముఖ్యమైన అంశాలు:
ఎ. మానవునిలో విసర్జక వ్యవస్థ
బి. డయాలసిస్ - అవయవధానం
సి. మొక్కలలో విసర్జన
  • మానవునిలో మూత్రపిండాలు ప్రధాన విసర్జక అవయవాలు. ఒక జత మూత్రపిండాలు, ఒక జత మూత్రనాళాలు. ఒక మూత్రాశయం ఉంటాయి.
  • ప్రతి మూత్రపిండం సుమారు 10 మిలియన్ల మూత్రనాళికలు (నెఫ్రానులు)కలిగి ఉంటాయి. ఇవి మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణాలు.
  • మూత్రపిండాలు మన శరీరంలో పేరుకుపోయిన నత్రజని వ్యర్థాలను తొలగిస్తాయి. నీటి సమాతాస్థితిని నెలకొల్పుతాయి. లవణగాఢత pH, మరియు రక్తపీడనాన్ని నియంత్రిస్తాయి.
  • వేరు వేరు జీవులలో భిన్నమైన, ప్రత్యేకమైన విసర్జక అవయవాలు ఉన్నాయి.
  • డయాలసిస్ విధానం అనేది కృత్రిమ విసర్జన ప్రక్రియ. ఇందులో ‘డయాలైజర్’ యంత్రం రక్తంలో ఏర్పడిన మలినాలను తొలగిస్తుంది. మూత్రపిండాలు పనిచేయని వారిలో మూత్రపిండాల మార్పిడి చేయాలి.
  • మొక్కలలో ప్రత్యేక విసర్జకావయవాలు లేవు. ఇవి ఆకులలో బెరడులో, పండ్లలో, విత్తనాలలో వ్యర్థాలను నిల్వచేసి పక్వానికి వచ్చాక మొక్కల నుండి రాలిపోతాయి.

మొక్కలలో జీవక్రియా ఉత్పన్నాలు రెండు రకాలు:
1. ప్రాథమిక జీవక్రియా ఉత్పన్నాలు
ఉదా॥కార్బోహైడ్రేటులు, ప్రొటీన్లు, క్రొవ్వులు
2. ద్వితీయా జీవక్రియా ఉత్పన్నాలు
ఉదా॥ఆల్కలాయిడ్లు, లేటెక్స్, రెసిన్లు, జిగుర్లు, టానిన్లు (ఇవి ఆర్థిక ప్రాముఖ్యతను కలిగినవి)
 

4 మార్కుల ప్రశ్న జవాబులు

  1. నెఫ్రాన్ పటం గీసి గుచ్ఛగాలనం, వరణాత్మక పునః శోషణం జరిగే భాగలను గుర్తించండి. (As-5)
    Tenth Class
    1. గుచ్ఛగాలనం: అభివాహిధమని కలిగించే పీడనం వల్ల రక్తకేశనాళికా గుచ్ఛం (Glomerolus)గుండా రక్తం ప్రవహిస్తుంది. ఈ పీడనం ఫలితంగా రక్తం వడబోయబడుతుంది. వ్యర్థ పదార్థ అణువులు, పోషక అణువులు, నీరు వడబోబడి భౌమన్స్ గుళికకు చేరుతాయి.
    2. వరణాత్మక పునః శోషణం: ప్రాథమిక మూత్రంలో ఉండే ఉపయుక్త పదార్థాలను పరికేశనాళికా వల తిరిగి శోషిస్తుంది. గ్లూకోజ్, అమైనోఆమ్లాలు, విటమిన్ -C,K,ca, Nacl లు, 75% నీరు పునః శోషించబడతాయి.
    3. నాళికా స్రావం: రక్త కేశనాళికల నుండి మూత్ర నాళికలోనికి - వ్యర్థ పదార్థాలు స్రవించబడతాయి. రక్తంలో ఉండే యూరియా, యూరి కామ్లం, క్రియాటినిన్ , పొటాషియం, సోడియం లవణాలు స్రవించబడతాయి. ఇవి మూత్రం యొక్క గాఢతను pH నియంత్రిస్తాయి.
  2. ప్ర: మూత్రపిండాలోని నెఫ్రాన్‌లో రక్తం నుండి అనేక వ్యర్థ పదార్థాలు తొలగించబడతాయి. విసర్జక వ్యవస్థలో నిన్ను అత్యంత ఆశ్చర్యానికి గురిచేసిన అంశాలు ఏమిటి? (As-6)
    1. శరీరంలో వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడిన CO2,యూరియా, యూరిక్ ఆమ్లం, క్రియాటినైన్, క్రియాటిన్ వంటి వ్యర్థ పదార్థాలను నియామానుసారంగా శరీరం నుండి బహిష్కరించుట ఒక గొప్ప పరిణామము.
    2. ఈ వ్యర్థ పదార్థాలను శరీరం నుండి బహిష్కరించకపోతే అవి విషపదార్థాలు గా మారి శరీరానికి హాని కలుగజేస్తాయి.
    3. మూత్రపిండంలో నిమిషానికి సుమారు 120 మి.లీ మూత్రము ఏర్పడుతుంది. ఒక రోజులుకు సుమారు 175 లీటర్ల మూత్రము ఏర్పడే సామర్థ్యం ఉన్నా, ఇదంతా విసర్జించబడదు. 1 లేదా 2 లీ. మూత్రము మాత్రమే విసర్జించబడుతుంది. మిగిలినతందా శరీరంలో పునః శోషణ మవుతుంది.
    4. మూత్రపిండాల యొక్క క్రియాత్మక, నిర్మాణాత్మక ప్రమాణాలు-నెఫ్రానులు. కావున నెఫ్రానులలో జరిగే క్రియ అత్యద్భుతమైనది.
    5. రక్తకేశనాళికా గుచ్ఛంలోని, రక్తకేశ నాళికలలో రక్తం ప్రవహించినపుడు రక్తకేశనాళికల కుడ్యాలలోని రంధ్రాల ద్వారా వడబోయపడుతుంది. నా దృష్టిలో ఇది చాలా క్లిష్టమైన పని.
    6. మూత్రపిండాలు ప్రతినిత్యం రక్తాన్ని వడబోస్తూ, వాటిలో అవసరమైన పదార్థాలను తిరిగి శోషించుకోవటం అనేది అద్భుతమైన విషయంగా భావిస్తారు.
      "డయాలసిస్ విధానాన్ని కనుగొనడంతో మానవాళికి అది చేసిన కృషిని ఎలా ప్రశంసిస్తావు? (As-6)" ఇలాంటి ప్రశ్న అడిగే అవకాశం ఉండవచ్చు
  3. ప్ర: వివిధ రకాల మొక్కల నుండి లభించే ఆల్కలాయిడ్‌లను, వాటి ఉపయోగాలను పట్టిక ద్వారా నివేదిక తయారు చేయండి.? (As-4) & (As-1)

    క్ర .మం

    ఆల్కలాయిడ్

    మొక్కపేరు

    మొక్కలోని భాగాలు

    ఉపయోగం

    1.

    క్వినైన్‌
     
    ఆఫిసినాలిస్‌

    (సింకోనా)

    బెరడు

    మలేరియా నివారణ

    2.

    నికోటిన్

    నికోటియా నా టొబాకమ్(పొగాకు)

    ఆకులు

    క్రిమిసంహారిణి

    3.

    రిసర్పిన్

    రావుల్ఫియా సర్పైంటైన్

    వేర్లు

    పాముకాటు నుండి రక్షణ

    4.

    మార్ఫిన్ కొకైన్

    పపావర్ సోమ్నిఫెరమ్ (గంజాయి)

    ఫలం

    మత్తుమందు,నొప్పి నివారిణి

    5.

    కెఫిన్

    కాఫియాఅరాబికా(కాఫీమొక్క)

    విత్తనాలు

    నాడీవ్యవస్థ ఉత్తేజ కారకం

    6.

    నింబిన్

    అజాడి రక్తా ఇండికా (వేప)

    విత్తనాలు బెరడు, ఆకులు

    యాంటిసెప్టిక్

    7.

    స్కోపోలమైన్

    దతురా మెటల్(ఉమ్మెత్త)

    పండ్లు, పువ్వులు

    మత్తుమందు

    8.

    పైరిత్రాయిడ్స్

    ట్రైడాక్స్ ప్రోకంబెన్స్(గడ్డిచామంతి)

    పువ్వులు

    కీటకనాశనులు


     
  4. ప్ర: మూత్రపిండం నిలువుకోత పటం గీసి, భాగలను గుర్తించుము (As-5)
    Tenth Class
     
  5. ప్ర: మూత్రపిండాల పనితీరును తెలుసుకోవాలంటే యురాలజిస్టు (మూత్ర సంబంధ వ్యా నిపుణుడు)ని సంప్రదించి ఏఏ ప్రశ్నలు అడుగుతావు? (As-2)
    జ: మూత్రపిండములు ఎక్కువ ఆరోగ్యంగా ఉండాలంటే యూరాలజిస్టును సంప్రదించాలి.
    1. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    2. మూత్రపిండాల పనితీరుకు, తాగే నీటికి ఏమైనా సంబంధం ఉందా?
    3. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    4. పాలకూర, టమాటతో కలిపిన వంటకం (కూర) తింటే మూత్రపిండం లో రాళ్ళు వస్తాయంటారు. నిజమేనా?
    5. మూత్రం పసుపురంగులో ఎందుకు ఉంటుంది?
    6. అధిక మోతాదు ఆంటి బయాటిక్స్, స్టిరాయిడ్స్ వాడటం వలన మూత్రపిండాలపై ప్రభావం ఏమిటి?
     
  6. ప్ర: డయాలసిసన్ వ్యక్తిం ఏ సందర్భంలో అవసరం? దానిలో ఇమిడి ఉన్న సూత్రం ఏమిటి? (As-1) Tenth Class
    జ: 1. మూత్రపిండాలు పనిచేయని ఆరిలో డయాలసిస్ యంత్రంతో రక్తాన్ని వడకడతారు. కృత్రిమంగా ఇలా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను ‘హీమోడయాలసిస్’ అంటారు.
    2. ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా బయటికి తెచ్చి రక్తస్కందనాన్ని నిరోధించే హెపారిన్‌ను డయలైజర్ యంత్రంలోకి పంపే ఏర్పాటు చేస్తారు.

    3. డయాలసిస్ యంత్రంలో రక్తం కొన్ని గొట్టాల వంటి సెల్లోఫెన్‌తో తయారైన నాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఈ నాళికలు డయలైజింగ్ ద్రావణంలో మునిగి ఉంటాయి.
    4. ఒక సన్నని పొర నాళికలోని డయలైజింగ్ ద్రావణాన్ని, రక్తాన్నివేరు చేస్తుంది నాళాలలో రక్తం, నాళాల బయట ఉన్న డయలైజింగ్ ద్రావణాలు ఒకే విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. తేడా కేవలం నత్రజని వ్యర్థాలే.
    5. డయలైజింద్ ద్రావణంలో నత్రజని వ్యర్థాలుండవు. కనుక డయలైజర్‌లో రక్తం ప్రవహించేటపుడు నత్రజని వ్యర్థాలు వేరై రక్తం శుద్ధిచేయబడుతుంది. ఈ ప్రక్రియనే ‘డయాలసిన్’ అంటారు.
    6. ఈ ప్రక్రియ మూత్రపిండాల పనితీరుకు సారుప్యంగా ఉంటుంది. కానీ పునశ్శోషణ జరుగదు. శుద్ధి చేయబడిన రక్తం తిరిగి శరీరంలోకి ఎక్కిస్తారు. ఒకసారి డయాలసిస్‌కు 3-6 గంటల సమయం పడుతుంది.
  7. ప్ర: మూత్రపిండ అంతర్నిర్మాణ పటం గీసి, భాగాలను గుర్తించుము. (As-5)
    Tenth Class
     
  8. ప్ర: వివిధ జీవులలో విసర్జక వ్యవస్థలను తెల్పుము. (As-1)

    క్రమసంఖ్య

    జీవిపేరు/వర్గము

    విసర్జక వ్యవస్థ

    1.

    ప్రోటోజువా

    క‌ణ ఉప‌రితలం నుండి వ్యాపనం ద్వారా

    2.

    పొరిఫెరా/సీలెంటరేటా

    నీటి ప్రసరణ అన్ని కణాల ద్వారా జరగడం వలన

    3.

    ప్లాటి, నిమాటి హెలిథిస్‌లు

    జ్వాలా కణాలు

    4.

    అనెలిడా

    వృక్కాలు (నెఫ్రిడియా)

    5.

    ఆర్థ్రోపొడా

    మాల్ఫీజియస్ నాళికలు, హరిత గ్రంథులు

    6.

    మొలస్కా

    మధ్య వృక్షాలు, (మెటానెఫ్రిడియా)

    7.

    ఇఖైనోడర్మెటా

    జల ప్రసరణ వ్యవస్థ

    8.

    సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు

    మూత్రపిండాలు.

  9. ప్ర: మొక్కలు విసర్జించే ద్వితీయ ఉత్పన్నాల యొక్క ఆర్థిక ప్రయోజనాలు తెల్పుము. (As-6)
    ఆల్కలాయిడ్స్: వివిధ రకాల ఔషధ మొక్కల నుండి ఆల్కలాయిడ్స్ లభిస్తాయి.
    ఉదా॥క్వినైన్, నింబిన్, కెఫిన్, నికోటిన్, రిసర్పిన్ మొదలైనవి. వీటికి మందుల తయారీకి వాడతారు.
    జిగుర్లు: వేప, తుమ్మ,మద్ది చెట్ల నుండి లభిస్తాయి. వీటని- కాగితం అతుకుటకు, ఆహార పదార్థాల (బంకను) తయారీకి, మందుల తయారీకి వాడతారు.
    టానిన్లు: తుమ్మ, తంగేడు నుండి లభిస్తాయి. వీటిని తోళ్ళను పదును చేయడానికి (టానింగ్), మరియు మందులలోను వాడతారు.
    రెసిన్లు: పైనస్ వంటి వివృత బీజ మొక్కల నుండి లభిస్తాయి. వీటని వార్నిష్‌లలో, రంగు అద్దకాలలో వాడతారు.
    లేటెక్స్: తెల్లని పాలు గారే చెట్ల నుండి లభిస్తాయి. (యూఫోర్భియేసి కుటుంబం), హీవియా-రబ్బరు, జట్రోప - బయోడీజిల్, తాటి - కల్లు పానీయం.

2మార్కుల ప్రశ్న జవాబులు

  1. విసర్జన అనగా నేమి? (As-1)
    జ: జీవులలో వివిధ రకాల జీవక్రియలు జరుగుతున్నప్పుడు రకరకాల ఉత్పన్నాలు ఏర్పడతాయి. వీటిలో కొన్ని హాని కల్గించే పదార్థాలు కూడా ఉంటాయి. ఇటువంటి వ్యర్థ పదార్థాలను బయటికి పంపి వేయడాన్ని విసర్జన అంటారు.
     
  2. ‘‘నెఫ్రాన్‌లు, మూత్రపిండాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం’’ అని నీవెలా సమర్థిస్తావు? (As-1)
    జ: ప్రతి మూత్రపిండం సుమారు 10 మిలియన్ల నెఫ్రానులను కలిగిన నిర్మాణాత్మక ప్రమాణం. అలాగే ఈ నెఫ్రానులే రక్తాన్ని వడబోసి మూత్రం ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి క్రియాత్మక ప్రమాణాలు కూడా. అందువల్ల నెఫ్రానులను మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మక ప్రమాణంగా అంగీకరిస్తాను.
     
  3. ప్ర: శరీరంలో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు బయటికి విసర్జించక పోతే ఏమవుతుందో ఊహించండి? (As-2)
    జ: శరీరంలో అయానుల తులస్థితిని కాపాడటయే విసర్జన క్రియ లక్షణము. శరీరంలో వినియోగించబడగా తిరిగి గ్రహించలేని వ్యర్థ పదార్థాలను బహిష్కరించక పోతే విషపదార్థాలుగా మారి శరీరానికి హాని కలుగజేస్తాయి.
     
  4. మానవునిలో మూత్రపిండం కాకుండా ఇంకా ఏమైనా విసర్జకావయవాలు ఉన్నాయా? ఉంటే ఆ విసర్జక వ్యర్థాలను తెల్పండి? (As-1)
    జ: మానవునిలో విసర్జకావయవాలుగా మూత్రపిండాలే కాకుండా వాతావరణ పరిస్థితులను బట్టి క్రింద తెలిపిన భాగాలు కూడా విసర్జనకు సహాయపడతాయి. అవి
    1. చర్మం - స్వేదము, లవణాలు
    2. ఊపిరితిత్తులు - CO2, నీటిఆవిరి
    3. కాలేయము - యూరియా, పైత్యరస వర్ణకాలు
    4. పెద్దప్రేగు - మలము.
  5. తగినన్ని నీళ్లు త్రాగడం మంచిదని సూచిస్తుంటారు. ఎందుకు? (As-2)
    జ:జీవక్రియలు జరగటానికి నీరు త్యవసరం. తగినంత నీరు లేకుంటే కణాలలో ఏర్పడిన వ్యర్థి పదార్థాలను తొలగించలేము.ఇవి శరీరంలో పేరుకుపోయి మూత్ర సంబంధ వ్యాధులు వస్తుంటాయి. ద్రవాహారము ఎక్కువగా తీసుకునే వారి రక్తంలో నీరు అధికంగా చేరటం వల్ల రక్తంలోని విసర్జక పదార్థాలు నీటిలో కరిగి మూత్రరూపంలో విసర్జింపబడతాయి ఘనాహారం/మిశ్రమాహారం తీసుకునేవారు రోజుకు సగటున 4-5 లీటర్ల నీరు తీసుకుంటే జీర్ణాశయంలో ఆమ్ల గాఢతను తగ్గించవచ్చు. కావున వైద్యులు తగినన్ని నీళ్ళు త్రాగడం మంచిదని సూచిస్తుంటారు.
     
  6. లేటెక్స్ అనగా నేమి? (As-6)
    జ:1. లేటెక్స్ జిగురుగా, తెల్లగా పాలవలె ఉండే ద్రవపదార్థం
    2. దీనిని స్రవించే మొక్కలు యూపోర్భియేసి, ఎపోసైనేసి, పఫావరేసి కుటుంబానికి చెందినది.
    3. ఈ పదార్థం లేటెక్స్ కణాలలో గాని, లేటెక్స్ నాళాలలోగాని నిల్వ ఉంటుంది. ఉదా॥జట్రోవా నుంచి బయోడీజిల్, హీవియా-రబ్బరు, తాటి- కల్లు.
     
  7. ప్రజల్లో అవయవదానం గురించి అవగాహన కల్పించడానికి కొన్ని నినాదాలు వ్రాయండి. (As-6)
    జ: 1. అవయవదానం - ప్రాణదానం
    2. ఒకరి అవయవదానం - మరొకరికి పునర్జన్మ
    3. నేత్రదానం చేయండి - అంధులకి వెలుగు నివ్వండి.
    4. రక్తదానం - మహాదానం
    5. అవయవదానం చేద్దాం - పాటి మానవునిగా జీవిద్దాం
    6. అవయవదానం - మానవత్వానికి సూచిక.
     
  8. మీ పరిసరాలలో జిగురునిచ్చే మొక్కలేవి? జిగుర్ల ఉపయోగం తెల్పండి? (As-1)
    జ: జిగురునిచ్చే మొక్కలు: వేప, తుమ్మ, మద్ది, తవిసి మొ॥వీటి కాండం పై గాటు వేసినపుడు జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. ఈ జిగురు నీటిని పీల్చుకొని ఉబ్బి పోయి మొక్క గాయాన్ని మాన్పుతుంది. ఈ జిగుర్లను (వేప, మద్ది, తవిసి) ఆహారంగా, ఆయుర్వేదంగా, పేపర్ బైండింగ్‌లోనూ వాడతారు.
     
  9. మూత్రవిసర్జన గురించి వ్రాయుము? (As-1)
    జ: 1. మూత్రాశయంలో గరిష్టంగా 700-800 మి.లీ. మూత్రం నిల్వ ఉంటుంది.
    2. దాదాపు 300-400 మి.లీ. మూత్రం చేరగానే మూత్రాశయం ఉబ్బి, మూత్రాశయ గోడల మీద ఒత్తిడి/పీడనం పెరుగుతుంది.
    3. ఫలితంగా మూత్రం విసర్జించాల‌నే కోరిక కలుగుతుంది.
    4. మూత్రాశయం సంకోచించడం మూలంగా మూత్రం ప్రసేకం ద్వారా బయటికి వెలుతుంది. ఈ ప్రక్రియనే ‘‘ మూత్రవిసర్జన’ అంటారు.
     
  10. విసర్జన, స్రవించడం మధ్య బేధాలను వ్రాయుము. (As-1)
    జ:

    విసర్జన:

    స్రావం:

    1. ఉపయోగం లేని వ్యర్థాలను శరీరం నుండి బహిష్కరించుట 1. పదార్థాలు శరీంరంలో ఒక చోట నుండి మరొక చోటకు కదిలించబడుట
    2. నిష్క్రియాత్మక మైనది. 2. క్రియాత్మమైనది ఉదా॥హార్మోనులు, ఎంజైములు
    3. బెరడు, ఆకులను రాల్చడం ద్వారా మొక్కలు విసర్జనను ప్రదర్శిస్తాయి. 3. మొక్కలలో లేటెక్స్, రెసిన్స్, జిగుర్లు స్రావాలుగా వెలువడతాయి.
    (ఈ విధంగా కూడా ప్రశ్న అడ‌గ‌వ‌చ్చు)
  11. (ఈ విధంగా కూడా ప్రశ్న ఉండవచ్చు) విసర్జన, స్రవించడం రెండూ ఒకే రకమైన వేనా? నీవెలా అంగీకరిస్తావు? (As-1)
    జ: విసర్జన, స్రావం రెండూ ఒక రకమైనవే. ఈ రెండింటిలోనూ అవసరం లేని పదార్థాలను బయటికి పంపించడమే. విసర్జన అనేది జీవులలోని వ్యర్థపదార్థాల తొలగింపు కాగా, స్రావం అనేది ఒక ప్రదేశం నుండి మరో చోటికి వ్యర్థ పదార్థా కదలికలు చెందడం. అందుకే విసర్జన నిష్క్రి యాత్మకమైనది. స్రావం క్రియాత్మకమైనదిగా పరిగణించవచ్చు.
    ఉదా:
    1. విసర్జితాలు: మానవునిలో కన్నీళ్ళు, చెమట, CO2
    2. స్రావాలు: ఎంజైములు, హార్మోనులు, లేటెక్స్ .
  12. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయకపోతే ఏమి జరుగుతుంది?
    మూత్ర పిండాలు పనిచేయక పోవడాన్ని ESRD అంటారు. దీని వల్ల శరీరంలో నీరు, నత్రజని వ్యర్థాలు పేరుకు పోయి కాళ్ళు, చేతులు ఉబ్బిపోతాయి. రక్తం శుద్ధి కాకపోవడం వల నీరసం, అలసట వస్తాయి. దీనికి ప్రత్యామ్నాయంగా డయాలసిస్ యంత్రాన్ని ఉపయోగించి రక్తాన్ని వడకడతారు.

 

1 మార్కు ప్రశ్న జవాబులు

 

1. విసర్జన అనగానేమి?
జ: శరీరంలో జరిగే జీవక్రియల ఫలితంగా అనేక పదార్థాలు ఏర్పడతాయి శరీరానికి నిరుపయోగమైన పదార్థాలను వేరుచేసి బయటకు పంపడాన్ని ‘విసర్జన’ అంటారు.

2. మానవునిలో మూత్ర సంఘటనం తెల్పండి.
మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు, 1.5 % అకర్బన పదార్థాలు ఉంటాయి.

3. మూత్రం పసుపురంగులో ఉండుటకు కారణం ఏమిటి?
మూత్రం లేక పసుపు రంగులో ఉండటానికి కారణం యూరోక్రిమ్. రక్తంలోని హీమోగ్లోబిన్ విచ్ఛిన్న అయినపుడు యూరోక్రోమ్ వర్ణకం ఏర్పడ మరియు కాలేయం నుండి స్రవించబడిన వర్ణ పదార్థాలు ఏర్పడటం దీనికి కారణం.

4. అతి మూత్ర వ్యాధిని గూర్చి తెల్పండి
జ: వాసోప్రెసిన్ హార్మోన్ లోపం వల్ల అధిక మూత్ర విసర్జన జరుగుతుంది. అలాగే తక్కువ గాఢత గల మూత్రం (తెలుపు రంగు) విసర్జించాల్సి ఉంటుంది. దీనినే ‘అతిమూత్ర వ్యాధి’(డయాబెటిస్ ఇన్సిపిడస్) అంటారు.

5. రక్తంలో హెపారిన్ పని ఏమి?
జ: హెపారిన్ అనేది రక్తనాళాలలో రక్తం గడ్డకట్టకుండా చేస్తుంది.

6. మూత్రం ఏర్పడే విధానంలో ఎన్ని దశలు కలవు? అవి ఏవి?
జ: మూత్రం ఏర్పడటంలో నాలుగు దశలు ఉన్నాయి. అవి
1. గుచ్చగాలనం
2. వరణాత్మక పునఃశోషణం
3. నాళికా స్రావం
4. అతిగాఢత గల మూత్రం ఏర్పడటం.

7. ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు అనగా నేమి?
మొక్కల సాధారణ పెరుగుదలకు, అభివృద్ధికి కాకుండా ఇత విధులకు ఉపయోగపడే వాటిని ‘ద్వితీయ జీవక్రియా ఉత్పన్నాలు’ అంటారు.
ఉదా॥ఆల్కలాయిడ్స్, రెసిన్‌లు, జిగుర్లు, లేటెక్స్

8. మూత్రపిండాలు పనిచేయని పరిస్థితిని ఏమంటారు?
మూత్రపిండాలు పనిచేయని పరిస్థితిని ESRD( End stage Renal Disease)శరీరంలో హానికర పదార్థాలు పేరుకుపోతాయి. ఈ దశను ‘యూరేమియా’ అంటారు.

9. మూత్రపిండ మార్పిడి అవసరమైతే, మూత్రపిండాన్ని రోగికి ఎక్కడ అమరుస్తారు?
దాత నుండి సేకరించిన మూత్రపిండాన్ని పాడైన మూత్రపిండమునకు బాగా దిగువగా, మూత్రాశయమునకు కొంచెం ఎగువగా అమర్చి, రక్తనాళాలతో కలుపుతారు.

10. అమీబాలో విసర్జన ఎలా జరుగుతుంది?
అమీబాలో కణ ఉపరితలం నుండి వ్యాపనం ద్వారా విసర్జన జరుగుతుంది.

11. శరీరంలో మూత్రపిండం విధి ఏమిటి?
మన శరీరం నుండి నత్రజని సంబంధిత వ్యర్థాలను తొలగిస్తాయి. నీటి సమతాస్థిని కాపాడతాయి. లవణ గాఢత, pH, రక్తపీడనాన్ని క్రమబద్దీకరిస్తాయి.

12. రక్తకేశ నాళికా గుచ్ఛం అనగా నేమి?
భౌమన్ గుళికలోనిక ప్రవేశించిన రక్తకేశనాళిక ఒక వల లాంటి నిర్మాణాన్ని ఏర్పరచి భౌమన్ గుళిక నుండి బయటికి వస్తుంది. ఈ వల లాంటి నిర్మాణాన్ని ‘రక్త కేశనాళికా గుచ్ఛం’ అంటారు.
 

1/2 మార్కు ప్రశ్నజవాబులు

 

  1. మానవునిలో విసర్జక అవయవం యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం ( )
    ఎ. న్యూరాన్
    బి. నెఫ్రాన్
    సి. నెప్రిడియా
    డి. మెటానెఫ్రిడియా
  2. విసర్జకావయవాలు లోపించిన జీవి ( )
    ఎ.పక్షి
    బి. సరీసృపం
    సి అమీబా
    డి. ఏదీకాదు.
  3. మానవ శరీరంలో మూత్రం ప్రయాణించే మార్గం ( )
    i) మూత్రపిండాలు
    ii)మూత్రనాళాలు
    iii) పసేకం
    iv) మూత్రాశయం

    ఎ.i,ii,iv,iii
    బి.i,ii,iii,iv
    సి.iv,iii,i,ii
    డి. ii,iii,i,iv
  4. మూత్ర విసర్జనకు ప్రత్యక్ష సంబంధం కలిగిన హార్మోన్ ( )
    ఎ. ఎడ్రినలిన్
    బి. వాసోప్రెసిన్
    సి.పిట్యుటరీ
    డి. ఆక్సిటోసిన్
  5. మూత్రమును వడగట్టే మూత్రపిండ భాగము ( )
    ఎ. వృక్క నాళిక
    బి. వృక్కధమని
    సి. ప్రసేకము
    డి.మూత్రాశయం
  6. పాము కాటు నుండి రక్షణ కల్పించే ఆల్కలాయిడ్ ( )
    ఎ. మార్పిన్
    బి.నించిన్
    సి.కెఫిన్
    డి.రిస్పరిన్
  7. మలేరియా నివారణకు ఉపయోగించే ఔషదం ( )
    ఎ. క్వినైన్
    బి.నికోటిన్
    సి. రిస్పరిన్
    డి. మార్పిన్
  8. ఈ క్రింది వానిలో ఆల్కలాయిడ్ కానిది ( )
    ఎ. రిస్పరిన్
    బి.నించిన్
    సి. రెసిక్
    డి. స్కోపోలమైన్
  9. మొక్కలు తమ విసర్జక పదార్థాలను క్రింది వాటిలో నిల్వ ఉంచుతాయి? ( )
    ఎ. ఆకులు
    బి. వేర్లు
    సి.కాండము.
    డి.పైవన్నీ
     
  10. నాడీ వ్యవస్థకు ఉత్తేజకారకంగా ( stimules)పనిచేసేది ( )
    ఎ. నికోటిన్
    బి.కెఫెన్
    సి. పైరిత్రాయిడ్స్
    డి. స్కోపాలమైన్
  11. జలచరజీవుల యొక్క ప్రధాన విసర్జక పదార్థము ( )
    ఎ. యూరియా
    బి. అమ్మోనియా
    సి. యూరిక్ ఆమ్లం
    డి. ఏదీకాదు.
  12. నెఫ్రాన్‌లో రక్తం వడగట్టబడే ప్రదేశం ( )
    ఎ. భౌమన్స్ గుళిక
    బి.హెన్లీశక్యిం
    సి.సమీపస్థ సంవళితనాళిక
    డి. దూరస్థ సంవళితనాళిక


జవాబులు: 1)బి; 2)సి; 3)ఎ; 4)బి; 5)ఎ;
6)డి; 7)ఎ; 8)సి; 9)డి; 10)బి; 11)బి; 12)ఎ;

 

 

 

ఖాళీలు:-

 

 

 

  1. విసర్జన అనునది ఒక.........................................
  2. మూత్రపిండంపైన ఉన్న టోపీలాంటి నిర్మాణం ..............................
  3. U ఆకారంలో ఉన్న వృక్కనాళికా భాగం ..............................
  4. భౌమన్స్ గుళిక, రక్తకేశనాళికా గుచ్ఛాలను కలిపి ..............................అంటారు.
  5. తంగేటు యొక్క శాస్త్రీయనామం....................
  6. డయాలసిస్ విధానము కనుగొన్న శాస్త్రవేత్త ....................
  7. మొదటిసారి మూత్రపిండ మార్పిడి చేసిన వైద్యుడు ....................
  8. తెల్లటి పాల వంటి లేటెక్స్ ను ఇచ్చే తాటి చెట్టు శాస్త్రీయనామం ....................
  9. ESRD సంక్లిప్తనామము ....................


జవాబులు: 1)జీవక్రియ ;2) అధివృక్కగ్రంది; 3) హెన్లీ శిక్యం; 4) మాల్ఫీజియన్ దేహం; 5) కేషియా అరబికా ;
6) విలియం కాఫ్ ;7)డా॥చార్లెస్ హాఫ్ నగెల్ ;8) బొరాసస్; 9) End Stage Renal Disease;

 

 

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. బొద్దింక

( )

ఎ. మూత్రపిండాలు

2.నత్త

( )

బి. జలప్రసరణ వ్యవస్థ

3. మాననుడు

( )

డి. వృక్కాలు

4.వానపాము

( )

ఇ. మాల్ఫీజియన్ నాళికలు

5. సముద్రనక్షత్రం

( )

ఎఫ్. వాయునాళాలు.

 

 

 

 


జవాబులు: 1) ఎఫ్; 2)సి; 3)ఎ ;4)డి; 5)బి.

 

 

 

 

గ్రూప్-ఎ

 

గ్రూప్-బి

1. లేటెక్స్

( )

ఎ. పైనస్

2. జిగుర్లు

( )

బి. రబ్బరు

3. రెసిన్లు

( )

సి. నింబిన్

4. ఆల్కలాయిడ్స్

( )

డి. తంగేడు.

5. టానిన్లు

( )

)ఇ. తుమ్మ

 

 

ఎఫ్. పైకస్


జవాబులు: 1)బి; 2)ఇ; 3)ఎ; 4)సి; 5)డి.

 

Published date : 29 Nov 2023 01:36PM

Photo Stories