విద్యార్ధులు కాలాన్ని వృథా చేస్తే మిగిలేది కష్టాలే
Sakshi Education
సమయం ఎంతో విలువైనది. విద్యార్థి దశలో ఇది అత్యంత కీలకమైనది. ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. చక్కగా ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోవాలి.
వారానికి ఓ రోజు రివిజన్ చేసుకోవాలి. వార్షిక పరీక్షలు సమీపిస్తే ఎంత బాగా చదువుకుంటామో మొదటినుంచి అదే రీతిలో చదువుకోవాలి. ఎవరితోనూ వాదోపవాదం చేస్తూ కూర్చోకూడదు. వాదం చేయటం వల్ల వైరం పెరుగుతుంది. అది చివరికి ఎక్కడికైనా దారితీయొచ్చు. దానివల్ల నష్టపోయేది విద్యా ర్థులే. ఇప్పుడు కాలాన్ని వృథా చేసుకుంటే జీవితమంతా కష్టాలను అనుభవించక తప్పదని గుర్తుపెట్టుకోండి. వాగ్వాదానికి దిగేవారిని సరైన మార్గంలోకి రప్పించాలి. ఒకరు పోట్లాడుతున్నాడని మరో ఇద్దరు రావటం, వీరంతా పోట్లాడటం కట్టకడపటికి అసెంబ్లీ లో మాదిరిగా జుట్టుజుట్టు పట్టుకోవడం వంటివాటివల్ల విలువైన సమయం వృథా అవుతుంది. గడచిపోయిన కాలం మనది కాదు. అది తిరిగిరాదు. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పలేం.
Published date : 03 Mar 2020 03:59PM