School Education Department: బోధనలో గురువులకు ఏ పరికరాలూ ప్రత్యామ్నాయం కాదు
Sakshi Education
సాక్షి, అమరావతి: విద్యా బోధనలో గురువులకు ప్రత్యామ్నాయంగా నిలవగలిగే పరికరాలు ఏవీ ఈ ప్రపంచంలో లేవని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ కమిషనర్ ఎస్. సురేష్ కుమార్ చెప్పారు.
విజయవాడలో రెండ్రోజుల పాటు జరిగిన సీబీఎస్‌ఈ విద్యపై రిసోర్సు పర్సన్లకు శిక్షణ డిసెంబర్ 16న ముగిసింది. ఈ సదస్సులో సురేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
చదవండి: Andhra Pradesh : టీచర్ల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్.. నిబంధనలు ఇవే..
రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను దశలవారీగా సీబీఎస్‌ఈకి అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత విద్యా సంవత్సరానికి 1000 పాఠశాలలను సంపూర్ణ నాణ్యత ఉండేలా మలచడానికి ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు.
చదవండి: School Education Department: గురువుల సేవలు ఇక పూర్తిగా విద్యకే పరిమితం
Published date : 17 Dec 2022 05:39PM