Skip to main content

Andhra Pradesh: ఎస్‌ఐపీలో గిరిజన విద్యార్థుల ప్రతిభ

పెదబయలు: విజయవాడలో ఆగస్టు 28 నుంచి 30వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్‌ ఇన్నోవేషన్‌ ప్రోగ్రాం(ఎస్‌ఐపీ) గ్రాండ్‌ ఫినాలేలో అల్లూరి జిల్లా పెదబయలు మండల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.
Andhra Pradesh
ఎస్‌ఐపీలో గిరిజన విద్యార్థుల ప్రతిభ

తమ పాఠశాల విద్యార్థుల తయారుచేసిన ప్రాజెక్టులు ఎంపిక కావడం బహుమతులు అందుకోవడం ఆనందంగా ఉందని హెచ్‌ఎం, జిల్లా సైన్స్‌ అధికారి టి.నాగేశ్వరరావు చెప్పారు. ఈ పోటీల్లో సుమారు 3268 ప్రాజెక్టులు ప్రదర్శించగా, అందులో ఫైనల్స్‌కు 26 ప్రాజెక్టులు ఎంపిక కాగా, వాటిలో నాలుగో స్థానంలో తమ పాఠశాలలో 8వ తరగతికి చెందిన వి.చంద్రశేఖర్‌, పి.అవినాష్‌ విద్యార్థులు రూపొందించిన ఇన్స్‌లేటెడ్‌ ఎలక్ట్రికల్‌ పోల్‌ప్రాజెక్టుకు బహుమతి లభించినట్టు చెప్పారు.

చదవండి: Telangana: విద్యార్థుల‌కు ఐపీఎస్ అధికారిణి సూచ‌న‌లు

మెమొంటో, నగదు బహుమతులను కమిషన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ సురేష్‌కుమార్‌, ఏపీఎస్‌సీఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి అందజేశారన్నారు. ప్రాజెక్టు గైడ్‌ టీచర్‌ సీహెచ్‌.బాలకృష్ణకు కూడా మెమొంటో అందజేసినట్టు తెలిపారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాషా ఆయా విద్యార్థులను అభినందించారు. ఉపాధ్యాయులు నాయుడు, అనీల్‌ గణపతిరావు, చిరంజీవి, రామకృష్ణ, రవికుమార్‌, చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదవండి: Residential school: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో బోధన

Published date : 02 Sep 2023 04:03PM

Photo Stories