Skip to main content

టెన్త్‌లో పేరుకే పరీక్ష ఫీజు మినహాయింపు.. అడ్డగోలుగా నిబంధనలు!

సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రభుత్వం ఏటా పేరుకే ఫీజు మినహాయింపు ప్రకటిస్తోంది తప్ప అమలు చేసే వీలు కల్పించట్లేదు.
పొంతన లేని ఆదాయ పరిమితిని విధించడంతో పరీక్ష ఫీజు మినహాయింపును విద్యార్థులు పొందలేకపోతున్నారు.

తెలంగాణ పదో తరగతి 2021 పరీక్షల టైం టేబుల్, సిలబస్, స్టడీ మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ప్రిపరేషన్ టిప్స్, కెరీర్ గెడైన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.

గ్రామీణ ప్రాంతాల్లో రూ.20 వేలు, పట్టణాల్లో రూ.24 వేలలోపు వార్షికాదాయం ఉన్న వారికే ఫీజు మినహా యింపు వర్తిస్తుందన్న నిబంధనతో దాదాపు 2.5లక్షల మంది నిరుపేద విద్యార్థులకు ప్రయోజనం చేకూరట్లేదు. రాష్ట్రంలో ఏ పథకమైనా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారికి ప్రభుత్వం వర్తింపజేస్తుంది. ఇందుకు గరిష్ట వార్షిక ఆదాయం రూ.లక్షకు పైనే ఉంది. కానీ పదో తరగతి పరీక్ష ఫీజు మినహాయింపు నకు ప్రత్యేక వార్షికాదాయాన్ని కొనసాగిస్తోంది. 2015లోనే దీన్ని మార్చాలని ప్రభుత్వ పరీ క్షల విభాగం అధికారులు ప్రభుత్వానికి లేఖ రాసినా మార్పు లేదు. ఇప్పుడు అదే నిబంధన కొనసాగిస్తూ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. దీంతో పరీక్షలకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈ మినహాయిం పు వర్తించే అవకాశం లేకుండా పోయింది.
Published date : 10 Feb 2021 02:56PM

Photo Stories