Skip to main content

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే 17వ తేదీ నుంచి మే 26 వరకు పరీక్షలు జరపనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఫిబ్రవరి 9న ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున.... 11 పేపర్లు కాకుండా కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది.

ఫిబ్రవరి 25వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లించవచ్చని విద్యాశాఖ వెల్లడించింది. రూ.50 ఆలస్య రుసుంతో మార్చి 3 వరకు, రూ.200 ఆలస్య రుసుంతో మార్చి 12 వరకు, రూ.500 ఆలస్య రుసుంతో మార్చి 16 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొంది.

పరీక్షల షేడ్యూల్

17-05-2021

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ (గ్రూప్-ఏ) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కాంపోజిట్ కోర్సు) ఫస్ట్ ల్యాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)

18-05-2021

సెకండ్ లాంగ్వేజ్

19-05-2021

ఇంగ్లిష్

20-05-2021

గణితం

21-05-2021

ఫిజికల్ సైన్స్‌ బయోలాజికల్ సైన్స్‌

22-05-2021

సోషల్ స్టడీస్

24-05-2021

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్-1 (సంస్కృతం అండ్ అరబిక్)

25-05-2021

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్ ల్యాంగ్వేజ్ పేపర్-2 (సంస్కృతం అండ్ అరబిక్)

26-05-2021

ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు (థియరీ)


Published date : 09 Feb 2021 05:35PM

Photo Stories