Skip to main content

స్కూళ్ల ప్రారంభంపై పాఠశాల విద్యా శాఖ జారీచేసిన మార్గదర్శకాలుఇవే..!

సాక్షి, అమరావతి: కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ 4 ఆదేశాలను అనుసరించి స్కూళ్లను తెరవడంపై పాఠశాల విద్యా శాఖ తాజాగా మార్గదర్శకాలను ఇచ్చింది.

దీంతో ప్రభుత్వ యాజమాన్యాల్లోని ఆయా విభాగాలు తమ పరిధిలోని స్కూళ్లను తెరిపించడంపై దృష్టి సారిస్తున్నాయి. వీటిపై ఎలాంటి చర్యలు చేపట్టాలో విద్యా శాఖ తన మార్గదర్శకాల్లో స్పష్టతనిచ్చింది.

  • కంటైన్‌మెంట్ జోన్లకు బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ విద్యాసంస్థలను మాత్రమే తెరవాలి. వాటిలో ఆన్‌లైన్ టీచింగ్, టెలీకౌన్సెలింగ్, విద్యావారధి తదితర కార్యక్రమాల కోసం 50 శాతం మంది టీచర్లు హాజరుకావచ్చు.
  • కోవిడ్-19 నుంచి విద్యార్థులు, సిబ్బందిని రక్షించడానికి అన్ని ప్రజారోగ్య చర్యలను పాఠశాలల హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్లు చేపట్టాలి.
  • ఒకరికొకరు కనీసం ఆరడుగుల దూరం పాటించేలా చూడాలి. ప్రతి ఒక్కరూ ఫేస్‌మాస్కు ధరించడం తప్పనిసరి.
  • దగ్గు, జలుబు, శ్వాస సంబంధ సమస్యలుంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటివారు వినియోగించే టిష్యూ పేపర్లు, కర్చీఫ్‌లను నిర్దేశిత ప్రదేశంలో దూరంగా పడేసేలా చూడాలి. పరిశుభ్రంగా ఉంచాలి
  • తరగతి గదులు, లేబొరేటరీలు, ఇతర వినియోగ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి.
  • నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు, వాటర్‌బాటిళ్లు ఇచ్చిపుచ్చుకోవడాన్ని అనుమతించరాదు.
  • 1-8 తరగతుల విద్యార్థులు ఇళ్ల వద్దనే అభ్యసనం కొనసాగించాలి. వారెవరినీ స్కూళ్లకు రప్పించకూడదు. అవసరమైతే వారి తల్లిదండ్రులు, సంరక్షకులను పిలిచి మాట్లాడాలి.
  • ఆన్‌లైన్, విద్యావారధి, విద్యామృతం వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు అభ్యసనం కొనసాగించాలి. అక్టోబర్ 5 వరకు ఇవి కొనసాగుతాయి.
  • యాప్‌లో వర్క్‌షీట్లు
  • 1-8 తరగతుల పిల్లలకు సంబంధించిన వర్క్‌షీట్లను అభ్యాస యాప్‌లో పొందుపరిచారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని అభ్యసనం కొనసాగించేలా మార్గనిర్దేశం చేయాలి.
  • ఈ నెల 21 నుంచి కంటైన్‌మెంట్ జోన్ల బయట తెరిచే స్కూళ్లు, కాలేజీల్లోకి 9-12 తరగతుల పిల్లలను మాత్రమే సందేహాల నివృత్తికి అనుమతించాలి. ఇందుకు తల్లిదండ్రుల అనుమతి ఉండాలి.
  • ఈ తరగతులు బోధించే టీచర్లు.. విద్యార్థుల స్థాయిని అనుసరించి హైటెక్, లోటెక్, నోటెక్‌గా విభజించాలి. అందుకు తగ్గట్టు ప్రణాళికలు రూపొందించుకొని మార్గనిర్దేశం చేయాలి.
  • గురుకుల స్కూళ్లు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థుల విషయంలో టీచర్లు వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేయించి గెడైన్స్ ఇవ్వాలి. ఈ విద్యార్థులు తమకు సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌కు వెళ్లి సూచనలు తీసుకోవచ్చు.
  • ఈ నెల 21 నుంచి 30 వరకు 9-12 తరగతుల విద్యార్థుల కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను కూడా విద్యా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పొందుపరిచారు.
Published date : 17 Sep 2020 01:39PM

Photo Stories