Skip to main content

సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ

న్యూఢిల్లీ: 12వ తరగతి పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఆ తరగతి విద్యార్థుల ఫలితాలను నిర్ధారించే విధానాన్ని రూపొందించడానికి 13 మంది సభ్యులతో ఒక కమిటీని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఏర్పాటు చేసిం ది.
ఆ కమిటీ 10 రోజుల్లోగా నివేదిక సమర్పించనుందని శుక్రవారం సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ తెలిపారు. కమిటీలో తనతో పాటు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి విపిన్‌ కుమార్, కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ కమిషనర్‌ నిధి పాండే, నవోదయ విద్యాలయ సమితి కమిషనర్‌ వినాయక్‌ గార్గ్, సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ (ఐటీ) అంత్రిక్ష జోహ్రి, సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ (అకడమిక్‌) జోసెఫ్‌ ఇమ్మాన్యుయేల్‌ తదితరులు సభ్యులుగా ఉంటారన్నారు. ఒకవేళ ఎవరైనా విద్యా ర్థుల పరీక్ష రాయాలనుకుంటే వారికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత పరీక్షలను నిర్వహించాల ని కూడా ఆ సమావేశంలో నిర్ణయించారు. 10వ తరగతి పరీక్షలను సీబీఎస్‌ఈ ఇప్పటికే రద్దు చేసి, విద్యార్థుల మార్కుల నిర్ధారణకు ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించిన విషయం తెలిసిందే.
Published date : 05 Jun 2021 02:03PM

Photo Stories