Skip to main content

RGUKT IIIT Results 2023: ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల... కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే!

ట్రిపుల్‌ ఐటీ ప్రవేశాలకు అర్హుల జాబితా విడుదల. రాష్ట్రంలో నాలుగు క్యాంపస్‌లలో 4,400 సీట్లు, 38,355 మంది విద్యార్థులు దరఖాస్తు. కౌన్సెలింగ్‌ తేదీలు ఇవే!
RGUKT IIIT Admission Results 2023

రాష్ట్రంలో నూజివీడు, ఆర్కే వ్యాలీ(ఇడుపులపాయ), ఒంగోలు, శ్రీకాకుళం RGUKT IIIT క్యాంపస్‌లలో ఉన్న 4,400 సీట్లకు ఈ ఏడాది 38,355 మంది దరఖాస్తు చేశారన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 23,628(83శాతం) మంది, ప్రైవేటు పాఠశాలల నుంచి 14,727(17 శాతం) మంది విద్యార్థులు ఉన్నారని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీల్లో అత్యున్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

Career Opportunities After B.Tech: బీటెక్‌ తర్వాత పయనమెటు... ఉన్నత విద్య లేక ఉద్యోగమా?

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రతిభ, రిజర్వేషన్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌కు ఎంపిక చేశామన్నారు. 2023–24 విద్యా సంవత్సరానికి  ఆర్జీయూకేటీలో కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినవారి జాబితాను గురువారం మంత్రి బొత్స విజయ­వాడ­లో విడుదల చేశారు. కౌన్సెలింగ్‌కు ఎంపికైన టాప్‌–20లో ప్రభుత్వ విద్యార్థులే ఉన్నారని వెల్లడించారు. పదో తరగతిలో 600కి 599 మార్కులు వచ్చిన విద్యార్థి సైతం ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవడం గర్వకారణమన్నారు.

AP CM YS Jagan Mohan Reddy : విద్యావ్యవస్థలో 'ఏఐ' భాగం కావాలి.. ఎందుకంటే..

RGUKT IIIT కటాఫ్‌ మా­ర్కులు

కౌన్సె­లింగ్‌కు ఎంపికైన జనరల్‌ విద్యార్థుల కటాఫ్‌ మా­ర్కులు 583గా ఉన్నట్టు చెప్పారు. ట్రిపుల్‌ ఐటీల్లో ఇ­ప్ప­టికే పీజీ కోర్సులను అందుబాటులోకి తెచ్చా­మని గుర్తుచేశారు. వచ్చే ఏడాది నుంచి పీహెచ్‌డీ కోర్సులనూ ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు.

కౌన్సెలింగ్‌ తేదీలు (Important Dates)

నూజివీడు క్యాంపస్‌ జూలై 20, 21
ఆర్కే వ్యాలీ (ఇడుపులపాయ) జూలై 21, 22
ఒంగోలు (ఆర్కే వ్యాలీలో) జూలై 24, 25
శ్రీకాకుళం జూలై 24, 25

New Courses in IITs: మెషిన్‌ లెర్నింగ్‌, క్వాంటం టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. ప్రవేశం విధానం, కెరీర్‌ అవకాశాలు ఇవే..

మొత్తం అర్హుల్లో 3,345 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, 695 మంది ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులున్నారని చెప్పారు. ఆగస్టు మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయన్నారు.   కార్య క్రమంలో చాన్సలర్‌ ప్రొఫెసర్‌ కేసీ రెడ్డి, వైస్‌ చాన్స లర్‌ ప్రొఫెసర్‌ ఎం.విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

How to download call letter for Provisionally selected candidates?

  • Visit AP RGUKT IIIT official website https://admissions23.rgukt.in/
  • Click on Download call letter for Provisionally selected candidates under GENERAL, SPECIAL CATEGORY (PH, CAP AND BSG) for all campuses link available on home page
  • Enter your application number or halltickcet number and date of birth and submit
  • Your call letter will be displayed
  • Download call letter and save for further reference

AP RGUKT IIIT Selected Candidates List:

Published date : 14 Jul 2023 01:15PM

Photo Stories