పరీక్షలకు సాయం వద్దు...మేమే రాస్తాం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్/వెంగళ్‌రావునగర్: అవిభక్త కవలలు వీణావాణిలు మార్చి 19 నుంచి నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.
విద్యాశాఖ వేర్వేరుగా జారీ చేసిన హాల్ టికెట్లను పాఠశాల అధ్యాపకులు మార్చి 13న వారికి అందజేశారు. జబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ వీణావాణిలకు మినహాయింపు ఇచ్చారు. వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వారిద్దరికీ వెంగళ్‌రావునగర్ స్టేట్‌హోంకు సమీపంలోని మధురానగర్‌కాలనీలో ప్రతిభా హైస్కూల్‌లో పరీక్ష కేంద్రం కేటాయించారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నేలపై కూర్చొని పరీక్ష రాయనున్నారు. స్టేట్‌హోం సిబ్బంది ప్రతి రోజూ వీరిని ప్రత్యేక వాహనంలో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి, పరీక్ష పూర్తైన తర్వాత మళ్లీ హోంకు తీసుకెళ్లనున్నారు.
వేర్వేరు అడ్మిషన్లు.. వేర్వేరు హాల్‌టికెట్లు..
ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో సుమారు 75 వేల మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, వీరిలో వీణావాణిలు కూడా ఉండటం విశేషం. పుట్టకతోనే రెండు తలలు అతుక్కుని జన్మించిన వీణావాణిలను 2017 జనవరిలో స్టేట్‌హోంకు తరలించారు. మహిళా శిశుసంక్షేమ అధికారులు 2018 విద్యా సంవత్సరంలో వీరికి వెంగళ్‌రావునగర్ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కల్పించారు. వీరికి వేర్వేరు అడ్మిషన్ నంబర్లు ఇచ్చారు. ఇటీవల వారు ఎస్‌ఎస్‌సీ బోర్డుకు దరఖాస్తు చేసుకోగా, పరీక్ష రాసే అర్హత, శక్తిసామర్థ్యాలు వారికి ఉన్నట్లు నిర్ధారించుకున్న అధికారులు ఇద్దరికీ వేర్వేరు హాల్‌టికెట్లు జారీ చేశారు. వారు కోరితే స్క్రైబ్(సహాయకులు)ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తమకు ఎవరి సహాయం అవసరం లేదని, తామే స్వయంగా పరీక్ష రాస్తామని వీణావాణిలు స్పష్టం చేసినట్లు తెలిసింది.
ప్రత్యేక గదిని సిద్ధం చేస్తాం :
వీణావాణిలు మా పాఠశాలలో పరీక్షలు రాయనున్నట్లు ఈరోజే తెలిసింది. విద్యాశాఖ వారికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేయమని సూచిస్తే ఆ మేరకు చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఓ గదిని ఏర్పాటు చేశాం. మిగిలిన విద్యార్థులతో కలిపి కూర్చోబెట్టినా ప్రత్యేక బల్లలు, ఇతర సౌకర్యాలను కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం.
- రాంబాబు, ప్రతిభా హైస్కూల్ చైర్మన్

Published date : 14 Mar 2020 04:53PM