‘పది’పరీక్షల్లో ఇలా చేస్తే..10/10 ఖాయమే..!
Sakshi Education
పరీక్షల నెల మార్చి వచ్చేసింది...! తెలంగాణలో మార్చి 19 నుంచి, ఏపీలో
మార్చి 31 నుంచి పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. దీంతో ప్రస్తుతం విద్యార్థులంతా ప్రిపరేషన్‌ల్లో మునిగితేలుతున్నారు. 10/10 గ్రేడ్ లక్ష్యంగా
ప్రిపరేషన్‌ను పరుగులెత్తిస్తున్నారు. పరీక్షల ముంగిట నిలిచిన విద్యార్థులు
అందుబాటులో ఉన్న ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలా.. ఆయా సబ్జెక్టుల్లో ఏయే అంశాలపై దృష్టిపెట్టాలి.. పరీక్షలోపజంటేషన్ ఎలా ఉండాలి.. టాప్ గ్రేడ్ సాధించేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం...
ఆంధ్రప్రదేశ్ :
ఏపీలో సంస్కరణలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జరుగుతున్న పదోతరగతి పరీక్షలివి..! కొత్త విధానంలో... గతంలో ఉన్న అంతర్గత మార్కుల(20 మార్కులు) విధానం తొలగించి.. పూర్తిగా వందకు వంద మార్కులు సాధించే అవకాశం విద్యార్థి చేతికే ఇచ్చారు. గతంతో పోలిస్తే టాప్ గ్రేడ్ సాధించడం ఇప్పుడు పూర్తిగా విద్యార్థి హార్డ్‌వర్క్, ప్రిపరేషన్‌పై ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. హిందీ మినహా ప్రతి పేపర్ 50 మార్కులకు ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ముందు పరీక్ష స్వరూపంపై అవగాహనకు రావాలి. దీంతోపాటు చక్కటి ప్రణాళికతో ప్రిపరేషన్ సాగిస్తే పదికి పది పాయింట్లు సాధించవచ్చు. ప్రతి పేపర్‌లోనూ గరిష్ట మార్కులు సాధించడం ద్వారా మంచి గ్రేడ్‌ను సొంతం చేసుకోవచ్చు. అర మార్కు, ఒక మార్కు ప్రశ్నల విషయంలో విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
తెలంగాణ :
ప్రతి సబ్జెక్టులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 నలభై మార్కులకు, పేపర్ 2 నలభై మార్కులకు ఉంటుంది. అంతర్గత మూల్యాంకనకు 20 మార్కులు ఉంటాయి. వీటిని నోట్ బుక్ రైటింగ్, ప్రాజెక్టు వర్క్, ల్యాబ్ రికార్డు మెయింటెనెన్స్ తదితరాల ఆధారంగా ప్రకటిస్తారు. గణితం :
పేపర్ 1 :
జనరల్ సైన్స్ :
విషయావగాహన,ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం,ప్రయోగ నైపుణ్యాలు-క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్టు పనులు, బొమ్మల ద్వారా భావ ప్రసారం, నిజ జీవిత వినియోగం-అనువర్తనాలు... విద్యాప్రమాణాల ఆధారంగా ప్రిపరేషన్ సాగిస్తే.. జనరల్ సైన్స్‌లోని రెండు పేపర్లలో అత్యధిక మార్కులు పొందవచ్చు.
ఫిజికల్ సైన్స్(పేపర్ 1) :
వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు, ఉష్ణం, సమతల తలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుడి కన్ను-రంగుల ప్రపంచం, మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ అయస్కాంతత్వం, లోహసంగ్రహణ శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
జీవశాస్త్రం(పేపర్ 2) :
డార్విన్ సిద్ధాంతం, కిరణజన్య సంయోగక్రియ-కాంతి, నిష్కాంతి దశలు, మూత్రం ఏర్పడే విధానం, పిండిపై లాలాజలం చర్య(ప్రయోగం), రక్తస్కంధనం, ఆకు అంతర నిర్మాణాల పటం-భాగాలు తదితరాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
ఇంగ్లిష్ :
రెండు పేపర్లలో రీడింగ్ కాంప్రహెన్షన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు తొలుత సదరు ప్యాసేజ్‌లను జాగ్రత్తగా చదవాలి. ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానాలు ప్యాసేజ్‌లోనే ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకు సొంతంగా సమాధానం (ఓపెన్ ఎండెడ్‌గా) రాయాల్సి ఉంటుంది.
ఏపీ విద్యార్థులు ఇలా..
సాంఘిక శాస్త్రం :
ఏపీలో బిట్ పేపర్ లేదు. కాబట్టి సబ్జెక్టులోని ప్రతి అంశాన్ని కచ్చితత్వంతో గుర్తుపెట్టుకున్నప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి. తెలంగాణ విద్యార్థులకు బిట్ పేపర్ ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశాల చివర ఇచ్చిన, గత ప్రశ్నపత్రాల్లో అడిగిన బిట్‌లను ప్రిపేరవడం లాభిస్తుంది.
పేపర్-1లో సుస్థిరాభివృద్ధి, అవ్యవస్థీకృత రంగం-స్థితిగతులు, భూతాపం, భూగర్భజలాలు, లింగవివక్ష, ప్రపంచీకరణ ఫలితాలు, భారతదేశ పటం.. పేపర్-2లో యుద్ధాలు-పరిణామాలు, వియత్నాం యుద్ధం, దేశ విభజన నాటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితి, సంకీర్ణ ప్రభుత్వాలు, భోపాల్ విషాదం, సమాచారహక్కు, ప్రపంచపటంపై ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు వివిధ సాంఘిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి సూచనలు రాయమని అడగవచ్చు. అదేవిధంగా వివిధ సంస్థలు, వ్యక్తుల కృషిని తెలపమని అడిగే అవకాశం ఉంది. వీటితోపాటు లింగ వివక్ష, హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల విద్యా విప్లవం, వలసదారుల ఇబ్బందులు, ఆహార భద్రతలో పీడీఎస్ పాత్ర, ప్రపంచశాంతి, వియత్నాం విజయం, గాంధీజీ తదితరాలపై దృష్టిపెట్టాలి.
ఇవెంతో కీలకమైనవి...
ప్రస్తుతం విద్యార్థులు అత్యంత కీలక దశకు చేరుకున్నారు. ఈ సమయంలో సబ్జెక్టు అంశాలతోపాటు మరికొన్నింటిపైనా శ్రద్ధపెట్టాలి.
కూల్‌గా..
పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. కొంతమంది పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇవ్వగానే హడావిడిగా సమాధానాలు రాయడం మొదలుపెడతారు. ఇది సరికాదు. బాగా ప్రిపేర్ అవడం ఎంత ముఖ్యమో.. పరీక్ష రోజు సమాధానాలు రాయడం అంతే ప్రధానం. కాబట్టి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి..రాయగలనా.. లేదా..? అనే సందేహాలను పక్కన పెట్టేయండి. అలాగే ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాత ప్రశాంత చిత్తంతో సమాధానాలు రాసేందుకు ఉపక్రమించాలి. చాయిస్‌లను ఎంచుకొనే క్రమంలో ఆచితూచి వ్యవహరించాలి.
వేగం.. కచ్చితత్వం :
కొంతమంది విద్యార్థులు సమాధానాలను నెమ్మదిగా రాస్తుంటారు. తీరా సమయం దగ్గరపడుతుందనగా కంగారు పడుతూ...వేగంగా రాస్తూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల చేతిరాత దెబ్బతిని మార్కులు కోల్పోయే ఆస్కారం ఉంది. కాబట్టి వేగం-చేతి రాతలను సమన్వయం చేసుకుంటూ పరీక్ష రాయాలి. పరీక్షకు ముందే దీనిపై దృష్టిపెట్టాలి. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం రాయడం పూర్తయిన తర్వాత రెండు లైన్‌లు గ్యాప్ ఇచ్చి.. మరో ప్రశ్నకు సమాధానం రాయాలి. ప్రయోజనాలు, అనువర్తనాలను రాసేటప్పుడు పాయింట్ల విధానంలో రాయాలి.
సమయ ‘విభజన’ :
సమయాన్ని ఎంత తెలివిగా వినియోగించుకున్నామనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉన్న సమయాన్ని సబ్జెక్టులు, టాపిక్‌ల ప్రాధాన్యతల ఆధారంగా విభజించుకోవాలి. పరీక్షలు దగ్గర పడే కొద్దీ చాలామంది గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. అలాకాకుండా ప్రతిరెండు గంటలకు 10-15 నిమిషాలు చొప్పున విరామం ఇవ్వడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
రివిజన్ :
విద్యార్థులు పరీక్షల సమయంలో తమకు రాని అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టి వచ్చిన వాటిని పట్టించుకోరు. ఎంత బాగా వచ్చిన అంశాలైనా కొన్నిరోజులకు మర్చిపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా కాకపోయినా కొంతమేరయినా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వచ్చిన అంశాలను కూడా తరచూ రివిజన్ చేయాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ :
ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయగలరు. ఆత్మవిశ్వాసంతోనే పరీక్షలో విజయం సిద్ధిస్తుంది. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్‌లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. అలాగే తగిన నిద్రతోపాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.

- మొదటి ఏడు చాప్టర్లు పేపర్ 1లో ఉంటాయి. వాస్తవ సంఖ్యలు పాఠ్యాంశంలో యూక్లిడ్ భాగహార న్యాయం, ప్రధాన కారణాంకాల లబ్ధం, కరణీయ సంఖ్యలు, సంవర్గమానాలు, ప్రధాన సంఖ్యలపై ప్రశ్నలు వస్తాయి. సమితులు పాఠ్యాంశంలో తక్కువ భావనలు ఉంటాయి. దీంతో ఈ చాప్టర్‌లో ఎక్కువ స్కోరు చేసేందుకు అవకాశం ఉందని చెప్పొచ్చు. సమితి రూపం, ఉపసమితి, శూన్యసమితి, సమితుల ఛేదనం, సమ్మేళనం, బేధం తదితరాలపై దృష్టిపెట్టాలి.
- బహుపదులు పాఠ్యాంశంలో బహుపదులు కనుగొనడం,బహుపది రేఖాచిత్రాలు, బహుపది శూన్యాలు, గుణకాల మధ్య సంబంధం, బహుపదుల భాగహారం తదితరాలపై దృష్టిపెట్టాలి. రెండు చలరాశులలో రేఖీయ సమీకరణాల జత పాఠ్యాంశంలో ఏదైనా సమస్యను ఇచ్చి రేఖీయ సమీకరణాల జతగా రాయమని అడుగుతారు. ఈ చాప్టర్‌లో మంచి మార్కులు సాధించాలంటే.. గుణకాలపై పట్టు సాధించడం తప్పనిసరి. వర్గసమీకరణాల పాఠ్యాంశంలో వర్గసమీకరణాల మూలాలు కనుగొనడంపై దృష్టిపెట్టాలి. శ్రేడులు చాప్టర్‌లో ఇచ్చిన శ్రేడిని గుర్తించడం.. అంక, గుణ శ్రేడులలో ఎన్‌వ పదం కనుగొనడంపై దృష్టిపెట్టాలి. నిరూపక జ్యామితి పాఠ్యాంశంలో ఎక్కువ సూత్రాలు ఉంటాయి. కాబట్టి సూత్రాలను కంఠస్థం చేయాలి. ఇందులో రెండు బిందువుల మధ్య దూరం క నుగొనడంపై తప్పనిసరిగా ప్రశ్న వస్తుంది.
- సరూప త్రిభుజాలు చాప్టర్‌లో నిర్వచనాలు, ఉదాహరణలు, సరూప త్రిభుజ ధర్మాలపై దృష్టిపెట్టాలి. స్పర్శరేఖలు-ఛేదన రేఖలు పాఠ్యాంశంలో వృత్తానికి బాహ్య బిందువు నుంచి గీసిన స్పర్శ రేఖ.. అల్ప, అధిక వృత్త ఖండముల వైశాల్యాలు, సిద్ధాంతాలు కీలకం. త్రికోణమితి చాప్టర్‌లో త్రికోణమితి నిష్పత్తులు, వాటి మధ్య సంబంధం, త్రికోణమితీయ సర్వసమీకరణ నిరూపణలు- అనువర్తనాలు, పూరక కోణాల త్రికోణమితీయ నిష్పత్తులు తదితరాలు కీలకంగా నిలుస్తాయి. త్రికోణమితీయ అనువర్తనాల పాఠ్యాంశం నుంచి ఊర్థ్వ, నిమ్న కోణాలు, ఎత్తులు-దూరాలకు సంబంధించిన సమస్యలు తదితరాలపై ప్రశ్నలు వస్తాయి.
- సంభావ్యత పాఠ్యాంశంలో సంభావ్యత భావన, నిర్వచనం, సులభమైన సమస్యలు-నిత్యజీవిత సంఘటనలతో అన్వయం, పూరక ఘటనలు తదితరాలు కీలకంగా ఉంటాయి. పాచికలకు సంబంధించిన ప్రశ్నలను బాగా ప్రాక్టీస్ చేయాలి. క్షేత్రమితి పాఠ్యాంశంలో ఉపరితల వైశాల్యాలు, ఘనపరిమాణాలు, ఘనాకృతలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. సాంఖ్యాకశాస్త్రంలో మధ్యగతము, బాహుళకము, సగటు, ఓజిన్ వక్రాలను ఉపయోగించి విలువలు కనుగొనడంపై దృష్టిపెట్టాలి.
- అన్ని అధ్యాయాల్లోని సమస్యలు, ఉదాహరణలు, పటాలు, నిర్మాణాలను ప్రణాళికాబద్ధంగా అధ్యయనం చేయాలి. అధ్యాయంలో ఉండే ‘ఇవి చేయండి’, ‘ప్రయత్నించండి’ వంటి వాటిని సాధన చేస్తే.. నూతన సమస్యలను సైతం సులభంగా సాధించగలుగుతారు.
- ఏపీలో గతంలో ఉన్న బిట్ల స్థానంలో ఒక పదం/వాక్యరూపంలో రాయగలిగే 12 ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలను పాఠ్యపుస్తకంలో ఉన్న భావనల ఆధారంగా రూపొందిస్తారు. అతి లఘు సమాధాన ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, వ్యాసరూప సమాధాన ప్రశ్నలు గతంలో ఇచ్చిన విధంగానే విద్యాప్రమాణాల ఆధారంగా ఇస్తారు.
జనరల్ సైన్స్ :
విషయావగాహన,ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం,ప్రయోగ నైపుణ్యాలు-క్షేత్ర పరిశీలనలు, సమాచార నైపుణ్యాలు-ప్రాజెక్టు పనులు, బొమ్మల ద్వారా భావ ప్రసారం, నిజ జీవిత వినియోగం-అనువర్తనాలు... విద్యాప్రమాణాల ఆధారంగా ప్రిపరేషన్ సాగిస్తే.. జనరల్ సైన్స్‌లోని రెండు పేపర్లలో అత్యధిక మార్కులు పొందవచ్చు.
ఫిజికల్ సైన్స్(పేపర్ 1) :
వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, విద్యుత్ ప్రవాహం, కార్బన్ దాని సమ్మేళనాలు, ఉష్ణం, సమతల తలాల వద్ద కాంతి వక్రీభవనం, మానవుడి కన్ను-రంగుల ప్రపంచం, మూలకాల వర్గీకరణ-ఆవర్తన పట్టిక, రసాయన బంధం, విద్యుత్ అయస్కాంతత్వం, లోహసంగ్రహణ శాస్త్రం పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
జీవశాస్త్రం(పేపర్ 2) :
డార్విన్ సిద్ధాంతం, కిరణజన్య సంయోగక్రియ-కాంతి, నిష్కాంతి దశలు, మూత్రం ఏర్పడే విధానం, పిండిపై లాలాజలం చర్య(ప్రయోగం), రక్తస్కంధనం, ఆకు అంతర నిర్మాణాల పటం-భాగాలు తదితరాలపై ఎక్కువ దృష్టిపెట్టాలి.
- రెండు గ్రూపుల మధ్య తేడాను గుర్తించడం, వర్గీకరణ/ఫ్లోచార్టు/ గ్రాఫ్‌లు/ కాన్సెప్ట్ మ్యాపింగ్, ఉదాహరణలు ఇవ్వడం, వ్యాక్యాన్ని సరిచేసి తిరిగి రాయడం, సందర్భాన్ని గుర్తించడం, ఇచ్చిన పేరాలో ఖాళీని గుర్తించడం, చిత్రం గురించి ప్రశ్నించడం, విశదీకరించి రాయడం, శాస్త్రవేత్తలు -పరిశోధనలు, జతపరచడంపై ప్రశ్నలు వస్తాయి.
ఇంగ్లిష్ :
రెండు పేపర్లలో రీడింగ్ కాంప్రహెన్షన్స్ ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు విద్యార్థులు తొలుత సదరు ప్యాసేజ్‌లను జాగ్రత్తగా చదవాలి. ఒకటి, రెండు ప్రశ్నలకు సమాధానాలు ప్యాసేజ్‌లోనే ఉంటాయి. మిగిలిన ప్రశ్నలకు సొంతంగా సమాధానం (ఓపెన్ ఎండెడ్‌గా) రాయాల్సి ఉంటుంది.
- రెండు పేపర్లలో సెక్షన్ బి గ్రామర్‌పై ఉంటుంది. ఇందులో టెన్సెస్, రిపోర్టెడ్ స్పీచెస్, యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, వెర్బ్ ఫామ్స్, వర్డ్ ఆర్డర్, కోఆర్డినేషన్ రూల్, కాంకర్డ్ రూల్, క్వశ్చన్ ట్యాగ్... ఇలా దేనిపైనైనా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించగలిగినప్పుడే.. ఈ సెక్షన్‌లో మంచి మార్కులు సాధించగలరు.
- సెక్షన్ సిలో మేజర్ డిస్‌కోర్స్‌కు చాయిస్ ఉంటుంది. ప్రతి డిస్‌కోర్స్‌కు కనీసం ఒక మోడల్‌ను ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్వ్యూ, స్పీచ్, బయోగ్రాఫికల్ స్కెచ్ తదితరాలకు ఒక్కో మోడల్ చొప్పున ప్రాక్టీస్ చేయాలి. పేపర్1లో మైనర్ డిస్‌కోర్స్‌కు సంబంధించి మెసేజ్, నోటీస్, డైరీలలో ఒకటి... పేపర్ 2లో పోస్టర్, ఇన్విటేషన్, ప్రొఫైల్స్ నుంచి ఒకటి వస్తుంది. మైనర్ డిస్‌కోర్స్‌ను సింగిల్ పేజీలో రాస్తే సరిపోతుంది. మేజర్ డిస్‌కోర్స్‌ను ఐదు పేజీల్లో రాయాలి. వీటిని రాసేటప్పుడు ఆయా డిస్‌కోర్స్ ఫీచర్స్‌ను ఫాలో అవ్వాలి.
ఏపీ విద్యార్థులు ఇలా..
- ఏపీలో ప్రశ్నపత్రంలో కొత్తగా చేర్చిన ప్రశ్నలకు గతంలో మాదిరి చాయిస్ లేదు. సమాధానాలను జవాబుపత్రంలో రాసేటప్పుడు, ప్రశ్నపత్రంలో ఇచ్చిన వరుస క్రమంలో.. ఒకే చోట రాయాలి. లేదంటే మార్కులు కోల్పోయే ఆస్కారం ఉంటుంది. అలాగే గతంలో కాంప్రహెన్షన్ విభాగంలో అన్ని ప్రశ్నలూ 'wh' ప్రశ్నలు ఉండేవి. కానీ నూతన పద్ధతిలో 15 ప్రశ్నలకు 11 ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కనీసం ఆరు ఉన్నతశ్రేణి ఆలోచనా విధానాన్ని ప్రోత్సహించేలా ఉంటాయి. మిగిలిన ప్రశ్నలు సమాచారాన్నీ, అవగాహననూ పరీక్షించేవిధంగా ఉంటాయి.
- ఏపీలో గ్రామర్‌లో ఎక్కువ మార్పులు జరిగాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, డెరైక్ట్ స్పీచ్, ఇండెరైక్ట్ స్పీచ్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. టెన్సెస్‌కు వెయిటేజీ పెరిగి..ఎడిటింగ్‌కు వెయిటేజీ తగ్గింది. క్లోజ్ టెస్టును తొలగించి..ఆర్టికల్స్‌పై ప్రశ్నలు చేర్చారు. టెన్సెస్‌లో కంటిన్యూయస్, పర్‌ఫెక్ట్ టెన్సెస్‌పై దృష్టిపెట్టాలి. ఇండెరైక్ట్ స్పీచ్‌లో సంభాషణలపై దృష్టిపెట్టాలి. గ్రామర్‌కి సంబంధించి పాఠ్యపుస్తకంలోని ఉదాహరణలను బాగా ప్రాక్టీస్ చేయాలి.
సాంఘిక శాస్త్రం :
ఏపీలో బిట్ పేపర్ లేదు. కాబట్టి సబ్జెక్టులోని ప్రతి అంశాన్ని కచ్చితత్వంతో గుర్తుపెట్టుకున్నప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి. తెలంగాణ విద్యార్థులకు బిట్ పేపర్ ఉంటుంది. కాబట్టి పాఠ్యాంశాల చివర ఇచ్చిన, గత ప్రశ్నపత్రాల్లో అడిగిన బిట్‌లను ప్రిపేరవడం లాభిస్తుంది.
పేపర్-1లో సుస్థిరాభివృద్ధి, అవ్యవస్థీకృత రంగం-స్థితిగతులు, భూతాపం, భూగర్భజలాలు, లింగవివక్ష, ప్రపంచీకరణ ఫలితాలు, భారతదేశ పటం.. పేపర్-2లో యుద్ధాలు-పరిణామాలు, వియత్నాం యుద్ధం, దేశ విభజన నాటి పరిస్థితులు, అత్యవసర పరిస్థితి, సంకీర్ణ ప్రభుత్వాలు, భోపాల్ విషాదం, సమాచారహక్కు, ప్రపంచపటంపై ప్రశ్నలు అడుగుతారు. వీటితోపాటు వివిధ సాంఘిక, పర్యావరణ సమస్యల పరిష్కారానికి సూచనలు రాయమని అడగవచ్చు. అదేవిధంగా వివిధ సంస్థలు, వ్యక్తుల కృషిని తెలపమని అడిగే అవకాశం ఉంది. వీటితోపాటు లింగ వివక్ష, హిమాచల్ ప్రదేశ్‌లో పాఠశాల విద్యా విప్లవం, వలసదారుల ఇబ్బందులు, ఆహార భద్రతలో పీడీఎస్ పాత్ర, ప్రపంచశాంతి, వియత్నాం విజయం, గాంధీజీ తదితరాలపై దృష్టిపెట్టాలి.
ఇవెంతో కీలకమైనవి...
ప్రస్తుతం విద్యార్థులు అత్యంత కీలక దశకు చేరుకున్నారు. ఈ సమయంలో సబ్జెక్టు అంశాలతోపాటు మరికొన్నింటిపైనా శ్రద్ధపెట్టాలి.
కూల్‌గా..
పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు ఒత్తిడికి లోనవుతుంటారు. కొంతమంది పరీక్ష హాల్లో ప్రశ్నపత్రం ఇవ్వగానే హడావిడిగా సమాధానాలు రాయడం మొదలుపెడతారు. ఇది సరికాదు. బాగా ప్రిపేర్ అవడం ఎంత ముఖ్యమో.. పరీక్ష రోజు సమాధానాలు రాయడం అంతే ప్రధానం. కాబట్టి పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి..రాయగలనా.. లేదా..? అనే సందేహాలను పక్కన పెట్టేయండి. అలాగే ప్రశ్నపత్రాన్ని పూర్తిగా చదివిన తర్వాత ప్రశాంత చిత్తంతో సమాధానాలు రాసేందుకు ఉపక్రమించాలి. చాయిస్‌లను ఎంచుకొనే క్రమంలో ఆచితూచి వ్యవహరించాలి.
వేగం.. కచ్చితత్వం :
కొంతమంది విద్యార్థులు సమాధానాలను నెమ్మదిగా రాస్తుంటారు. తీరా సమయం దగ్గరపడుతుందనగా కంగారు పడుతూ...వేగంగా రాస్తూ వెళ్తారు. ఇలా చేయడం వల్ల చేతిరాత దెబ్బతిని మార్కులు కోల్పోయే ఆస్కారం ఉంది. కాబట్టి వేగం-చేతి రాతలను సమన్వయం చేసుకుంటూ పరీక్ష రాయాలి. పరీక్షకు ముందే దీనిపై దృష్టిపెట్టాలి. అలాగే ఒక ప్రశ్నకు సమాధానం రాయడం పూర్తయిన తర్వాత రెండు లైన్‌లు గ్యాప్ ఇచ్చి.. మరో ప్రశ్నకు సమాధానం రాయాలి. ప్రయోజనాలు, అనువర్తనాలను రాసేటప్పుడు పాయింట్ల విధానంలో రాయాలి.
సమయ ‘విభజన’ :
సమయాన్ని ఎంత తెలివిగా వినియోగించుకున్నామనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అందుబాటులో ఉన్న సమయాన్ని సబ్జెక్టులు, టాపిక్‌ల ప్రాధాన్యతల ఆధారంగా విభజించుకోవాలి. పరీక్షలు దగ్గర పడే కొద్దీ చాలామంది గంటల తరబడి పుస్తకాల ముందు కూర్చుంటారు. అలాకాకుండా ప్రతిరెండు గంటలకు 10-15 నిమిషాలు చొప్పున విరామం ఇవ్వడం వల్ల మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది.
రివిజన్ :
విద్యార్థులు పరీక్షల సమయంలో తమకు రాని అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టి వచ్చిన వాటిని పట్టించుకోరు. ఎంత బాగా వచ్చిన అంశాలైనా కొన్నిరోజులకు మర్చిపోయే ప్రమాదం ఉంది. పూర్తిగా కాకపోయినా కొంతమేరయినా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు వచ్చిన అంశాలను కూడా తరచూ రివిజన్ చేయాలి.
ఆరోగ్యంపై శ్రద్ధ :
ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయగలరు. ఆత్మవిశ్వాసంతోనే పరీక్షలో విజయం సిద్ధిస్తుంది. కాబట్టి విద్యార్థులు ప్రిపరేషన్‌లో పడి ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకూడదు. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ప్రొటీన్లతో కూడిన ఆహారం తీసుకోవాలి. అలాగే తగిన నిద్రతోపాటు రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
Published date : 10 Mar 2020 01:30PM