పాఠశాలలకు టీచర్ల హాజరు..విద్యార్థుల సందేహాల నివృత్తి
Sakshi Education
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు పాటిస్తూ సోమవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ప్రభుత్వ, ప్రరుువేటు పాఠశాలలకు సోమవారం నుంచి 50 శాతం మంది చొప్పున టీచర్లు హాజరు కావచ్చని కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఇటీవల రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ కూడా కొన్ని సూచనలు జోడించిన సంగతి తెలిసిందే.
- ఆన్‌లైన్, దూరదర్శన్ ద్వారా బోధించే పాఠాలలోని సందేహాలను నివృత్తి చేసుకోవడం కోసం స్కూళ్లలోకి 9, 10 తరగతుల విద్యార్థులు, కాలేజీల్లోకి 11, 12 తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతించారు.
- తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకొన్నాకనే స్కూళ్లు, కాలేజీల్లోకి అనుమతించారు.
- ఇదిలా ఉండగా, రాష్ట్రంలో విద్యా వారధి, విద్యామృతం కార్యక్రమాల ద్వారా రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) దూరదర్శన్, ఆకాశవాణిల ద్వారా అవకాశం ఉన్న చోట్ల ఆన్‌లైన్లో బోధనా కార్యక్రమాలు ఇప్పటికే కొనసాగిస్తుండటం, సందేహాల నివృత్తి కోసం స్కూళ్లలో కొంత మంది టీచర్లను అందుబాటులో ఉంచడం తెలిసిందే.
Published date : 22 Sep 2020 01:31PM