Skip to main content

నవోదయ పది, పన్నెండు తరగతుల ప్రారంభానికి కేంద్రం అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో పది, పన్నెండు తరగతులు తిరిగి ప్రారంభించడానికి కేంద్ర విద్యాశాఖ అనుమతించింది.
ఈ మేరకు కేంద్ర హోం, ఆరోగ్య సంక్షేమ శాఖల మార్గదర్శకాల ప్రకారం ప్రామాణిక నియమావళి రూపొందించింది. ఏ రాష్ట్రంలో పది, పన్నెండు తరగతుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయో ఆ రాష్ట్రాల్లోనే నవోదయ విద్యాలయాలు కూడా తెరచుకుంటా యని పేర్కొంది. సదుపాయాలు ఇతరత్రా అంశాలు పరిశీలించి ఇతర తరగతుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. విద్య శాఖ ప్రామాణిక నియమావళి ప్రకారం ప్రతీ పాఠశాల రాష్ట్ర, జిల్లా యంత్రాంగంతో సంప్రదింపులు చేసి సొంత నిబంధనలు ఏర్పరచుకోవాలి. పాఠశాలలు, వసతి గృహాల్లో కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలి.
Published date : 04 Feb 2021 04:48PM

Photo Stories