Skip to main content

‘నాడు-నేడు’ కింద గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అత్యుత్తమ బోధన..!

సాక్షి, అమరావతి: గిరిజన బాల బాలికలను విద్యావంతులుగా మార్చడమే ధ్యేయంగా ‘నాడు-నేడు’ పథకం కింద గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతోంది. అవసరమైన చోట కొత్త గదులు నిర్మిస్తున్నారు. కొన్నిచోట్ల మరమ్మతులు చేస్తున్నారు. ప్రతి స్కూల్‌కు ప్రహరీలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది.
విద్యార్థులకు అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో అప్పర్ ప్రైమరీ వరకు ఆశ్రమ పాఠశాలలు 47, అప్‌గ్రేడెడ్ ఆశ్రమ హైస్కూళ్లు 82, ఆశ్రమ హైస్కూళ్లు 249.. మొత్తం 378 ఉన్నారుు. ఈ పాఠశాలల్లో 80,787 మంది విద్యాభ్యాసం సాగిస్తున్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. సాయంత్రం అల్పాహారం ఇస్తున్నారు. మాంసాహారం, కోడిగుడ్లు, కాయగూరలు, ఆకుకూరలతో భోజనం పెడుతున్నారు. ఈ స్కూళ్లలో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటున్నప్పటికీ సబ్జెక్ట్‌ల వారీగా ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించే దిశగా అత్యుత్తమ బోధన జరుగుతోంది.

రాష్ట్రంలో ఆశ్రమ పాఠశాలలు.. విద్యార్థుల సంఖ్య
జిల్లా స్కూళ్ల సంఖ్య విద్యార్థుల సంఖ్య
శ్రీకాకుళం 47 1,081
విజయనగరం 55 13,476
విశాఖపట్నం 122 38,425
తూర్పు గోదావరి 93 16,518
పశ్చిమ గోదావరి 25 5,983
కృష్ణా 1 150
గుంటూరు 3 567
ప్రకాశం 17 1,757
నెల్లూరు 1 507
చిత్తూరు 1 98
వైఎస్సార్ 1 197
అనంతపురం 1 207
కర్నూలు 11 1,821
మొత్తం 378 80,787
Published date : 03 Mar 2020 03:55PM

Photo Stories